Friday, January 10, 2025
HomeAP జిల్లా వార్తలుతిరుపతిTirupathi: కౌంటర్లు పెట్టారు, భద్రత మరచారు

Tirupathi: కౌంటర్లు పెట్టారు, భద్రత మరచారు

డిమాండ్

భక్తులకు వైకుంఠ వాసుని దర్శనం కల్పించాల్సిన సాక్షాత్ టిటిడినే కౌంటర్ల దగ్గర భద్రత వహించడంలో విఫలమై, భక్తుల ప్రాణాలు పోవడానికి కారకులయ్యారని అమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు నీరు గట్టు నగేష్ , కల్లూరు బాలసుబ్రహ్మణ్యం , వెంకటా చలపతి , కోడివాక చందు , బొంతల రాజేష్ రాయల్ లు ఆరోపణలు చేశారు.

- Advertisement -

తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ భద్రతా సిబ్బందిని ప్రధాని మోడీ సభకు తరలించడం వల్లే క్యూ లైన్ ల వద్ద రక్షకభటులు కరువయ్యారన్నారు. టీటీడీ మరియు పోలీస్ శాఖ ల నిర్లక్ష్య వైఖరికి ప్రతిఫలంగా క్యూ లైన్ లలో చనిపోయిన వారికి శాశ్వత ఉద్యోగం అలాగే కోటి రూపాయల ప్రాణ నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News