తిరుపతి జూ పార్క్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న టిటిడి ఉద్యోగిపై చిరుత పులి దాడి చేసిన ఘటన శనివారం జరిగింది. టిటిడి తిరుమల అశ్విని ఆసుపత్రిలో పనిచేస్తున్న డి.ముని కుమార్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చెర్లోపల్లి నుంచి తిరుపతి వైపు వస్తుండగా చెట్ల పొదల్లో నుంచి ఒక్కసారిగా చిరుత పులి అతనిపై దాడి చేసింది. ద్విచక్ర వాహనం పైనుంచి ముని కుమార్ కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళుతున్న స్థానికులు హుటాహుటిన గాయపడిన ముని కుమార్ ను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చిరుత దాడి ఘటన సమాచారం తెలుసుకున్న నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి జూ పార్కు సమీప ప్రాంత కాలనీవాసులు, అలిపిరి పాదాల మండపం స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పులిని బంధించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.
Tirupathi: తిరుపతిలో చిరుత దాడి
టీటీడీ ఉద్యోగికి గాయాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES