తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక (Deputy Mayor Election) తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనటంతో ఎన్నికలు రేపటికి వాయిదా వేశారు. తిరుపతిలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తిపై కూటమి నాయకులు దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు మండిపడ్డారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బస్సులో వెళ్తున్న వైసీపీ కార్పొరేటర్లపై రాళ్ల దాడి చేశారన్నారు.
అదే బస్సులో కార్పొరేటర్లతో పాటు ఎంపీ గురుమూర్తి ఉన్నారు. రోడ్డుపై అడ్డగించి బస్సు అద్దాలను ధ్వంసం చేశారన్నారు. ఓటు వేసేందుకు వెళ్లొద్దంటూ కార్పొరేటర్లకి బెదిరింపులకు పాల్పడ్డారని వైసీపీ నేతలు అన్నారు. కార్పొరేటర్ల బలం లేకపోయినా డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి నేతలు రెండు రోజుల నుంచి తిరుపతిలో వరుస దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్నారు.
తాము ప్రయాణిస్తున్న బస్సు టైర్లకు గాలి తీసేసి, తాళాలు లాక్కుని తమ కార్పొరేటర్లను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారని చెప్పారు. ఇదంతా జరుగుతున్న పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఎంపీ ఆరోపించారు. ఉద్రిక్తతల నడుమ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలను అధికారులు వాయిదా వేశారన్నారు.
https://x.com/YSRCParty/status/1886300808595042582