Saturday, December 28, 2024
HomeAP జిల్లా వార్తలుతిరుపతిTirupathi: తిరుప‌తిలో హోరెత్తిన క‌రెంట్ పోరుబాట‌

Tirupathi: తిరుప‌తిలో హోరెత్తిన క‌రెంట్ పోరుబాట‌

తిరుపతి వైసీపీ గర్జన

రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపిన రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -

జిల్లా కేంద్ర‌మైన తిరుప‌తి న‌గ‌రంలో వైసీపీ క‌రెంట్ పోరుబాట హోరెత్తింది. వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పిలుపు మేర‌కు శుక్ర‌వారం తిరుప‌తిలో వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ నేతృత్వంలో నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీ పద్మావ‌తిపురంలోని తన నివాసం నుంచి భూమ‌న కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీఎస్పీడీసీఎల్ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ర‌కూ సాగింది. క‌రెంట్ చార్జీలు త‌గ్గించాలంటూ భారీగా పాల్గొన్న శ్రేణులు నిన‌దించాయి.

సంస్కరణలు-సోలార్ అన్నారు

భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని చెబుతున్న ఆ విద్యుత్ ఛార్జీలతోనే ప్రజల నటి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సోలార్ విధానం ద్వారా వినియోగదారుల విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా చేస్తానని చంద్రబాబు ప్రగల్బాలు పలికారని విమర్శించారు. అలాగే నాణ్య‌మైన విద్యుత్ అందిస్తామ‌ని, వీలైతే చార్జీలు త‌గ్గిస్తామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇచ్చిన హామీల్ని నీటి మూటలేనని ఎద్దేవా చేశారు. 2019 నాటికి 87 వేల కోట్ల రూపాయల విద్యుత్ డిస్కములకు బకాయిలు పెట్టిన చంద్రబాబు నాయుడు అప్పుల కుంపటిలో విద్యుత్ శాఖను నెట్టివేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లోనే రూ.15 వేల కోట్ల‌కు పైగా రాష్ట్ర ప్ర‌జానీకంపై భారం వేయ‌డం దుర్మార్గ‌మ‌ని విమ‌ర్శించారు. వెంట‌నే స‌ర్దుబాటు చార్జీలను ఉప‌సంహ‌రించుకుని, ప్ర‌జ‌ల‌పై భారం లేకుండా చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. లేనిపక్షంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భారీ విద్యుత్ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఏ

తలకు మించిన భారంగా కట్టడి చర్యలు

ఎస్పీడీసీఎల్ కార్యాలయము వద్దకు భారీ ఎత్తున చేరుకున్న వైసీపీ శ్రేణులను కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండి కి వినతిపత్రం అందించేందుకు ముఖ్య నాయకులు మాత్రమే డి.ఎస్.పి వెంకటనారాయణ అనుమతించారు. ఈ సంద‌ర్భంగా ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం, తిరుప‌తి మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌, నగర మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి తదితరులు సిఎండికి వినతిపత్రం అందజేశారు. ఈ ర్యాలీలో వైసీపీ కార్పొరేట‌ర్లు వెంకటేశ్వర్లు, కేతం రామారావు, ఉమా అజయ్, ఎస్ కే బాబు, శేఖర్ రెడ్డి, ఆంజనేయులు, కుమారి, మల్లం రవి, బొమ్మగుంట రవి, రాజేశ్వరి,గీత, దళిత నాయకురాలు అరుణ, శాంతా రెడ్డి, పెరుగు వెంకటేష్, నల్లని బాబు, తదితర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News