Sunday, April 13, 2025
HomeAP జిల్లా వార్తలుతిరుపతితిరుమల గోశాల వివాదం.. ఆరోపణలను ఖండించిన టీటీడీ..!

తిరుమల గోశాల వివాదం.. ఆరోపణలను ఖండించిన టీటీడీ..!

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీ గోశాల గోవుల మృతిపై ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో టీటీడీ స్పందించింది. ఇటీవల సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న ఆరోపణల ప్రకారం, గత మూడు నెలల్లో టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

గోవుల సంరక్షణను పూర్తిగా గాలికొదిలేశారని, టీటీడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని భూమన ఆరోపించారు. హిందూ ధర్మ పరిరక్షణ పేరిట అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గోవులను కాపాడడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

అయితే ఈ ఆరోపణలపై టీటీడీ స్పష్టతనిచ్చింది. గోశాలలో గోవులు మృతి చెందాయని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు టీటీడీకి సంబంధించినవే కాదని ఖండించింది. నిరాధార ఆరోపణలు, వాస్తవేతర చిత్రాలను ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని తెలిపింది. టీటీడీ పీఆర్ అధికారుల ద్వారా విడుదలైన ప్రకటనలో, ఈ ప్రచారాన్ని నిరాధారమని పేర్కొంటూ, భక్తులు అవాస్తవాలను నమ్మరాదని విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News