Friday, January 24, 2025
HomeAP జిల్లా వార్తలుGarlic price: ఘాటెక్కిన వెల్లుల్లి ధర.. కేజీ రూ.450

Garlic price: ఘాటెక్కిన వెల్లుల్లి ధర.. కేజీ రూ.450

మాసాంహరాలు, మసాల కూరలు వండాలంటే మాత్రం వెల్లుల్లి ఉండాల్సిందే. అయితే ధర మాత్రం ఇప్పుడు కొండెక్కింది. పేద,మధ్య తరగతికి అందుబాటులో లేదు. దీంతో ప్రజలు ఈ ఘాటెక్కిన వెల్లుల్లి కొనుగోలు చేయాలంటే ముఖం చాటేస్తున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్లో ఈ వెల్లుల్లి ధర 450కి చేరింది. పదేళ్ల తర్వాత ఈ స్థాయిలో ధర పెరిగిందని వ్యాపారులు వాపోతున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా ప్రాంతాల్లో సాగు తగ్గడమే ధర పెరగడానికి ప్రధాన కారణమంటున్నారు. తాడేపల్లి గూడెం నుంచే గోదావరి, విశాఖ, విజయనగరం , శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు వెల్లుల్లి ఎగుమతి అవుతుంటుంది. దీంతో మసాల కూరలు చేసుకోవాలంటే మాత్రం వెల్లుల్లి వాడకం తగ్గించాల్సిన పరిస్థితి ఉందని మహిళలు వాపోతున్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News