Thursday, January 30, 2025
HomeAP జిల్లా వార్తలువిశాఖపట్నంCold weather: ఇకపై చలి లేనట్టే… మరో వారం తర్వాత ఎండలే ఎండలు..

Cold weather: ఇకపై చలి లేనట్టే… మరో వారం తర్వాత ఎండలే ఎండలు..

బయటికి రావాలంటేనే చలి తీవ్రతకు గజ గజ వణుకుపుడుతుంది. ఇకపై అంతగా చలి ఉండదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజులు తర్వాత ఈ చలి తీవ్రత పెరిగి ఆ తర్వాత క్రమంగా ఎండలు దంచి కొడుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి చలికాలం దాదాపుగా ముగుస్తుందని చెప్పారు.

ఫిబ్రవరి 2వ వారం నుంచి అధికంగా ఎండ తీవ్రత
ముఖ్యంగా వాతావరణ శాఖ అంచనా ప్రకారం చూస్తే ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. ఫిబ్రవరి 27 తర్వాత పెద్ద మెుత్తంలో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాఘమాసం మొదటి నుంచి చివరిదాకా చలి, ఎండలతో మిశ్రమ వాతావరణం ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు.

ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసినట్టే

- Advertisement -

ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసిందని చెప్పారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించాయి. దీంతో దక్షిణాదిలో గత 2 రోజులుగా వానలు లేవన్నారు. వాతవరణ శాఖ అంచనా ప్రకారం రుతు పవనాలు వైదొలిగినట్లేనని ప్రకటించింది. ఈశాన్య రుతుపవనాలు సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. కానీ ఈసారి ఈశాన్య రుతుపవనాల సీజన్ ఎక్కువ కొనసాగటంతో నెల రోజులు వర్షాలు పడ్డాయన్నారు.

ఈ సారి అధికంగానే వర్షపాతం నమోదు
నైరుతి, ఈశాన్య సీజన్లో కలిపి వర్షపాతం అధికంగా నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత కూడా అదే స్థాయిలో నమోదయిందన్నారు. సాధారణం కంటే ఎక్కువగానే పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నిందన్నారు. దాదాపుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మరి ముఖ్యం ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు అరకు ప్రాంతంలో చలి తీవ్రత అధిగంగా ఉందన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ వంటి ఫారెస్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగానే ఈ యేడాది చలి ఉందని చెబుతున్నారు.

మరో 2 వారాల్లో ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

మరో 2 వారాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మెుత్తానికి ఇక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం లేదన్నారు.ఈలోగా ఎండలు ముదిరితే మాత్రం క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News