విశాఖ జిల్లా దేవరాపల్లి, చింతలపూడి పంచాయతీ శివారు వీరభద్రిపేట గిరిజన గ్రామానికి రోడ్డు(Road) సౌకర్యం కల్పించాలని ఆదివాసి గిరిజనులు (Adivasi tribes) మోకాళ్ళపై కూర్చోని చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కల్యాణ్ బాబు మా గ్రామానికి రోడ్డు వేయాలని వినూత్న రీతిలో సోమవారం ఆందోళన చేసారు. వీరికి మద్దతుగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇదే ఈ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు రోడ్డు సౌకర్యం లేక మెరుగైన వైద్యం అందక వారం రోజుల్లో గమ్మేల ప్రవీణ్, సూకురి చిన్నారి, గమ్మేల కావ్య, ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తెలిపారు. వీర భద్రంపేట జంక్షన్ నుండి చింతలపూడి మెయిన్ రోడ్డుకు కిలోమీటరు దూరం, కనీషం గ్రావేల్ రోడ్డు అయిన వేయాలని గిరిజనులు మోర పెట్టుకున్న పట్టించుకోనె నాథుడే లేరని వాపోయారు.
గత సంవత్సరం 9 వ నెలలో బురదలో కూర్చోని రోడ్డు వేయాలని గిరిజనులు నిరసన తెలిపారని దీంతో అధికారులు హుటాహుటిన గ్రామాన్ని సందర్శించి సి సి రోడ్లుకు ఎస్ట్మెంట్ వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలియజేసారని అన్నారు. నేటికీ అతి గతి లెేదన్నారు. ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తే అనంతగిరి మండలంలోని సోలు బోంగు వలసల గురుపాటి గరువు గ్రామాల్లో గిరిజనుల కష్టాలు తీరుతాయని తెలిపారు.
నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు, పాఠాశాలకు వెళ్ళడానికి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్న గిరిజనుల బ్రతుకుల్లో మార్పు మాత్రం రాలేదని అవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకుంటున్న పాలకులు, మిగిలిన రోజుల్లో వారి చావుకు వారిని వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు ప్రాణాలు అంటే పాలకులకు లెక్కలేదని అడవిలో జంతువులు కన్నా అధ్వాన్నంగా చూస్తున్నారని మండిపడ్డారు.
మండల కేంద్రానికి కేవలం 8 కిలో మీటర్ల దూరంలోని ఉన్న గిరిజన గ్రామానికి సైతం డోలి మోతలు మరణ మృదంగాలు తప్పడం లేదన్నారు. గిరిజన ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించి ప్రతి గిరిజన గ్రామానికి రోడ్లు సౌకర్యం కల్పిస్తామని చెప్పారని తెలిపారు. వర్షం వస్తే డోలి కట్టి గ్రామంలోకి తీసుకు వెళ్తున్నారంటే గిరిజనుల దుస్థితి, ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు.
ఇంతటి దౌర్బగ్యపు పరిస్థితుల్లో గిరిజనులు మగ్గి పోతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మాత్రం డోలి మోతలు ఉండకూడదని అన్ని గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పిస్తామన్న మాటలు కోటలు దాటుతున్న చేతల్లో చూపించడం లేదన్నారు. వెంటనే వీరభద్రిపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ స్వయాన గిరిజన గ్రామాన్ని సందర్శించి గిరిజన గ్రామానికి లింక్ రోడ్లు సౌకర్యాలు కల్పించాలని గిరిజనులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.