Saturday, February 22, 2025
HomeAP జిల్లా వార్తలువైయస్ఆర్ కడపDisciplinary action:20 మంది రెవెన్యూ సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలు

Disciplinary action:20 మంది రెవెన్యూ సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలు

వైయస్ఆర్ కడప జిల్లాలో నాలుగు డివిజన్ల పరిధిలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది పై క్రమశిక్షణ చర్యలు( Disciplinary action) తీసుకున్నట్లు కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రెవెన్యూ సంబంధిత విషయాలు, మ్యుటేషన్ తదితర సమస్యలు పరిష్కరించడంలో ఆర్ఐలు, వీఆర్వోలు, సర్వేయర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఐవీఆర్ఎస్(IVRS) ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు అందిన మేరకు 20 మంది సచివాలయ రెవెన్యూ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

అధికారుల వివరాలు
బద్వేలు మండలం తిప్పనపల్లి సచివాలయం వీఆర్వో సాలమ్మ, చక్రాయపేట మండలం సురభి సచివాలయం సర్వేయర్ విజయ్ కుమార్, దువ్వూరు మండల వీఆర్వో మునిస్వామి, ఇడమడక వీఆర్వో హరి యాదవ్, జమ్మలమడుగు మండలం బి.బొమ్మపల్లి వీఆర్వో భీమన్న, కడప మండలం మామిళ్ళపల్లి వీఆర్వో జహీర్ అబ్బాస్, ఉక్కాయపల్లె వీఆర్వో శ్రీనివాసులు.

కలసపాడు మండలం ఇ.రామాపురం వీఆర్వో కొండయ్య, పిడుగుపల్లి వీఆర్వో ఆనందరావు, పిడుగుపల్లి ఆర్ఐ చంద్రశేఖరరావు, కమలాపురం మండలం కోగటం ఆర్ఐ అర్జున్, లేతపల్లి వీఆర్వో చిన్న వెంకటరామన్న, మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లి వీఆర్వో మధు డేవిడ్, మైలవరం మండలం తలమంచిపట్నం వీఆర్వో ఓబులేసు.

రాజుపాలెం మండలం టంగుటూరు వీఆర్వో సరళ, వల్లూరు మండల వీఆర్వో ఖాజా మొహిద్దీన్, వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లి వీఆర్వో ఓబయ్య, కతలూరు, సర్వేయర్ బ్రహ్మయ్య, వేంపల్లె మండల సర్వేయర్ బ్రహ్మకుమార్ రెడ్డి, ఒంటిమిట్ట మండలం, మంటపంపల్లి వీఆర్వో శ్రీనివాసులుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News