Tuesday, April 1, 2025
HomeAP జిల్లా వార్తలువైయస్ఆర్ కడపUgadi Awards: డా.చింతకుంట శివారెడ్డికి రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం

Ugadi Awards: డా.చింతకుంట శివారెడ్డికి రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే రాష్ట్రస్థాయి 2025 ఉగాది పురస్కారాల (state-level Ugadi award)కు గాను సాహిత్య విభాగంలో కడప యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో సహాయ పరిశోధకులుగా పనిచేస్తున్న డా.చింతకుంట శివారెడ్డి ఎంపిక అయ్యారు. వీరు రాయలసీమ అస్తిత్వ దిశగా పలు రచనలు చేశారు.

150కిపైగా పరిశోధన వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో 20కి పైగా పత్ర సమర్పణలు చేశారు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ముద్రించిన 30కి పైగా పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.

పురస్కారానికి ఎంపికయిన సందర్భంగా యోగి వేమన విశ్వవిద్యాలయ బాధ్య ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాస రావు, కులసచివులు ఆచార్య పి.పద్మ, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి, సిబ్బంది అభినందనందనలు తెలిపారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News