Tuesday, February 25, 2025
HomeAP జిల్లా వార్తలువైయస్ఆర్ కడపJagan:పులివెందులలో జగన్ పర్యటన

Jagan:పులివెందులలో జగన్ పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌(YS Jagan) పులివెందులలో పర్యటిస్తున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాళ్ల విజ్ఞప్తులను స్వీకరించారు.

- Advertisement -

వైఎస్‌ జగన్‌ రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయన్ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైయస్‌ జగన్‌తో సెల్ఫీలు, ఫొటోల కోసం ఎగబడ్డారు. మరో వైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని వారికి ఆయన సూచించారు.

తన రెండు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా ఇవాళ, రేపు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సాయంత్రం ప్రైవేట్‌ కార్యక్రమాలకు హాజరు కానున్న వైయస్‌ జగన్‌.. రేపు ఎల్వీ ప్రసాద్ సంస్థ ద్వారా ఆధునికీకరణ చేసిన రాజారెడ్డి ఐ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News