Friday, February 21, 2025
HomeAP జిల్లా వార్తలువైయస్ఆర్ కడపAPPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షలు విజయవంతం చేయండి: కలెక్టర్

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షలు విజయవంతం చేయండి: కలెక్టర్

ఈ నెల 23న జరుగనున్న ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీ ఏర్పాట్లతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాల్ నందు ఈ నెల 23వ తేదీ న జరుగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్ల పై సంబంధిత లైజన్ అధికారులతో సమావేశం జరిగింది.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ న జరుగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీ ఏర్పాట్లతో అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. పరీక్షలు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పార్ట్-1 సెషన్, మద్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పార్ట్-2 సెషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 13 పరీక్షా కేంద్రాలలో రెండు సెషన్స్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఆలస్యమైతే అనుమతి లేదు
అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.30 గంటల నుండి 9.45 గంటల వరకు, 1.30 గంటల నుండి 2.45 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీసు కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపర్ వైజర్లు, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా, ఎలాంటి అక్రమాలకు తావ్వివకుండా జరిగేలా చూడాలని అన్నారు. పోలీస్ శాఖ ప్రతి పరీక్షా కేంద్రంలో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగు నీటి వసతి, మరుగుదొడ్లు, అంతరాయలేని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.

కలెక్టర్ కార్యాలయం నందు గ్రూప్-2 మెయిన్ పరీక్షలకు సంబంధించి హెల్ప్ డెస్క్ 08562-246344 గల నంబరు 21-02-2025 నుండి 23-02-2025 వరకు కార్యాలయ సమయం ప్రకారం పరీక్షకు హాజరగు అభ్యర్థుల సహయారార్థం ఏర్పాటు చేయవలసిందిగా తెలిపారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు:-

(1)కె ఎల్ ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, బిసైడ్ కె ఎస్ ఆర్ ఎం కాలేజ్, కృష్ణాపురం, తాడిగొట్ల, చింతకొమ్మదిన్నె మండలం, కడప వైఎస్ఆర్ జిల్లా- 516005.

(2)గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్(ఏ) (ఆర్ట్స్ కాలేజ్), బిసైడ్ న్యూ కలెక్టర్ ఆఫీస్, రిమ్స్ రోడ్, కడప వైఎస్ఆర్ జిల్లా- 516004.

(3) కె ఎస్ ఆర్ ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ( ఆటోనమాస్), కృష్ణాపురం, చింతకొమ్మదిన్నె మండలం, కడప వైఎస్ఆర్ జిల్లా- 516005.

(4)అన్నమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్స్, బిహైన్డ్ ఆర్టీవో ఆఫీస్, ఊటుకూరు పోస్ట్, చింతకొమ్మదిన్నె విల్లేజ్ & మండలం, వైఎస్ఆర్ జిల్లా- 516003.

(5)గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, నియర్ హెడ్ పోస్ట్ ఆఫీస్, కడప, వైఎస్ఆర్ జిల్లా- 516001.

(6)శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SVIST), పులివెందుల రోడ్, కృష్ణాపురం, నియర్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఆఫ్ KSRM, తాడిగొట్ల గ్రామం, చింతకొమ్మదిన్నె మండలం, కడప వైఎస్ఆర్ జిల్లా- 516004.

(7)శ్రీహరి డిగ్రీ కాలేజ్, నియర్ తాలూకా పోలీస్ స్టేషన్, బాలాజీ నగర్, కడప, వైఎస్ ఆర్ జిల్లా – 516003.

(8)శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, నియర్ ఎస్ వి డిగ్రీ కాలేజ్, బాలాజీ నగర్, కడప, వైఎస్ ఆర్ జిల్లా – 516003.

(9)నారాయణ జూనియర్ కాలేజ్, డోర్ నెం. 2/714-18, హరి టవర్స్, నాగరాజు పేట, ఆఫీసర్స్ క్లబ్ ఎదురుగా, నియర్ కోటిరెడ్డి సిర్కిల్, కడప వైఎస్ ఆర్ జిల్లా – 516001.

(10)ఎస్ కె ఆర్ అండ్ ఎస్ కె ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, నియర్ సన్ రైజ్ హాస్పిటల్, నాగరాజు పేట, కడప వైఎస్ ఆర్ జిల్లా – 516001.

(11)నాగార్జున డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, డోర్ నెం. 39/622-68, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా – ఔట్ గెట్, 13వ వార్డు, అరవింద నగర్, కడప వైఎస్ ఆర్ జిల్లా – 516001.

(12)శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, (ఆటోనోమాస్), నియర్ వై జంక్షన్, పక్కీర్ పల్లి రోడ్, కడప వైఎస్ ఆర్ జిల్లా – 516002.

(13)కె ఓ ఆర్ ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, నియర్ కె.ఎస్. ఆర్. ఎం. జాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కృష్ణాపురం, చింతకొమ్మదిన్నె మండలం, కడప వైఎస్ఆర్ జిల్లా- 516005.

ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ ఇ జి అశోక్ కుమార్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఏపీపీఎస్సీ ప్రత్యేక అధికారులైన పర్యవేక్షకులు కె. శారద, అసిస్టెంట్ సెక్రెటరీ (మానిటోరింగ్) జె. జయంతి, ఎస్వో జె. యశోద, సునీత, జిల్లా అధికారులు, లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News