Bigg Boss 9: దేశవ్యాప్తంగా ఇప్పుడు బిగ్ బాస్ హవా నడుస్తోంది. బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో గా బిగ్ బాస్ కు పేరుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక తెలుగులో అయితే సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు ఒక వార్త వైరలయ్యింది.
Read Also: Bigg Boss Captaincy Task: పడాల పడిపోలేదు.. ఐదో వారం కెప్టెన్ గా కళ్యాణ్
వంద రోజులు నో కనెక్టివిటీ..
సీజన్ ప్రారంభమైతే చాలు చాలా మంది ఈ బిగ్ బాస్ షో కోసమే టీవీలు, స్మార్ట్ ఫోన్స్ కు అతుక్కుపోతారు. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ పాటించాల్సిన మెయిన్ రూల్.. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా 100 రోజులు తమకు ఇచ్చిన ఇంట్లో ఉండడం. బిగ్ బాస్ ఇంట్లోనూ మొబైల్ ఫోన్లు, టీవీలు వంటివి కనిపించవు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో రన్ అవుతోన్న బిగ్ బాస్ షోలన్నింటికీ ఈ మెయిన్ రూల్ వర్తిస్తుంది. అయితే ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోని పోటీదారులు మొబైల్ వినియోగిస్తున్నట్లు ఒక వార్త వైరలవుతోంది. దీనికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: Bigg Boss Today Promo: కళ్యాణ్ కొట్టిన దెబ్బ మామూలుగా లేదుగా.. భరణి భయ్యా ఫ్యూజులు ఔట్
తమిళ్ బిగ్ బాస్..
తెలుగులాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 కూడా ఇటీవలే స్టార్ట్ అయ్యింది. 24 గంటల పాటు నాన్ స్టాప్ గా ఓటీటీలో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడీ రియాలిటీ షోకు సంబంధించి ఒక షాకింగ్ వీడియో లీక్ అయ్యింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న తమిళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న వినోత్ తన మొబైల్ గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఆ సెల్ ఫోన్ నిజంగా హౌస్ లోనిదా లేదా ఏదైనా స్టోరీయా తెలియాల్సి ఉంది. అయితే, దీనిపైన వీకెండ్ ఎపిసోడ్ లోనే క్లారిటీ రానుంది. ఒకవేళ ఇది నిజమని తేలితే మాత్రం సదరు కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాక తప్పదని తెలుస్తోంది.


