Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Day 32 Promo: ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో బిగ్ బాస్.. బొక్కలో గేమ్...

Bigg Boss Day 32 Promo: ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో బిగ్ బాస్.. బొక్కలో గేమ్ గురించి టాస్కులు

Bigg Boss Day 32 Promo: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని బిగ్‌బాస్ హౌస్ మేట్స్ ని హడలెత్తించాడు. ఈ వారం మొత్తం టాస్కులతో హోరెత్తిస్తున్నాడు. హౌస్‌మేట్స్‌ని జంటలుగా విడదీసి కొన్ని ఛాలెంజస్ ఇచ్చాడు. ఇందులో గెలిచిన వారికి వాళ్ల స్థానాల ఆధారంగా పాయింట్లు లభిస్తున్నాయి. అయితే, మొత్తం ఈ ఛాలెంజస్ అన్నీ పూర్తయ్యే సరికి లీడర్ బోర్డులో ఏం జంటలు టాప్‌లో ఉంటే వారు సేఫ్‌గా ఉంటారు. చివరి స్థానాల్లో ఉన్న వారికి డేంజర్ ఉంటుందని హింట్ ఇచ్చాడు. అయితే, ఇందులో భాగంగా ఈరోజు ఎపిసోడ్‌లో పెట్టిన గేమ్ కి సంబంధించిన ప్రోమో చూద్దాం.

- Advertisement -

Read Also: Bigg Boss Harish: ఇది నా కాలే.. ఇది నా కాలే.. నాగార్జున ముందు ఇచ్చింది బిల్డప్ కాదు.. మాస్క్ మ్యాన్ ఆన్సర్ ఇదే..!

ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ మోడ్..

నిన్నటి ఎపిసోడ్ ముగిసేసరికి లీడర్ బోర్డ్‌లో రీతూ-డీమాన్ జోడీ టాప్‌ 1లో నిలిచింది. ఆ తర్వాత భరణి-దివ్య, ఫ్లోరా-సంజన జోడి సేమ్ పాయింట్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక చివరి రెండు స్థానాల్లో తనూజ-కళ్యాణ్, సుమన్-శ్రీజ ఉన్నారు. అయితే, ఈరోజు ఎపిసోడ్‌లో మరో టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకి వెళ్లే సమయం వచ్చింది.. ఎంటర్‌టైన్ అవ్వడం ఎంత ముఖ్యమో టాస్కులో గెలవడం కూడా అంతే ముఖ్యం.. మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకి ఉన్న కలర్ హోల్స్‌లో నేను చెప్పిన కలర్ హోల్ నుంచి బయటికి రావాలి.. ఏ జట్టు సభ్యులైతే ఎక్కువసార్లు ముందుగా బయటికొస్తారో వాళ్లు ఈ టాస్కులో విజేతలు అవుతారు.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. సాంగ్ పెట్టగానే సుమన్ శెట్టి అయితే అదిరిపోయేలా స్టెప్పులేశాడు. మిగిలిన అమ్మాయిలతో కలిసి సుమన్ శెట్టి వేసిన డ్యాన్స్ చూసి అందరూ తెగ నవ్వుకున్నారు. ఇంతలో మ్యూజిక్ స్టాప్ చేసి ఆరెంజ్ కలర్ అని బిగ్‌బాస్ చెప్పాడు. వెంటనే అందరికంటే ముందు దివ్య ఆ కన్నంలో దూరింది. వెనకాల నుంచి మిగిలిన వాళ్లు లాగుతుండటంతో కాలుతో తన్నెయ్ అంటూ భరణి సలహా ఇచ్చాడు. ఈ రౌండ్‌లో దివ్య గెలవగానే వెల్డన్‌ రెయ్.. అంటూ భరణి వచ్చి హత్తుకున్నాడు.

Read Also: Bigg Boss Written Updates: ఫోకస్ చేయాల్సింది నా ఫేస్ పైన కాదు.. తనూజ ఆన్ ఫైర్.. కళ్యాణ్ కు వరస్ట్ ప్లేయర్ ట్యాగ్

భరణిపై తనూజ ఫైర్..

మరో రౌండ్‌లో కళ్యాణ్ ముందుగా హోల్‌లోకి దూరి బయటికి వస్తుండగా వెనకాల నుంచి భరణి కాలు పట్టుకొని లాగబోయాడు. దీంతో తనూజ.. భరణిపైన అరిచింది. ఇది చూసి భరణి పార్టనర్ అయిన దివ్య ఫైర్ అయింది. ఇలా తనూజ-దివ్య మధ్య కాసేపు గొడవ జరిగింది. ఎక్కడ అరిచా ఆయన గేమ్ ఆయన కోసం ఆడమని చెప్పా.. నాకు రైట్ ఉంది నాన్నకి చెప్పడానికి.. అంటూ తనూజ వాదించింది. ఆయన కోసమే ఆడుతున్నారు.. అని దివ్య అంటే నాకు నచ్చినట్లే నేను చెప్పా.. అంటూ తనూజ అరిచింది. ఇక ప్రోమో చివరిలో సంజన ఎమోషనల్ అయింది. ఇలా ఉంటే నేను ఇంటికి వెళ్లిపోతాను.. నాకు ఇంత ఫిజికల్ టాస్క్ అవ్వదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, నిన్నటి ఎపిసోడ్ లో అన్ని ఎపిసోడ్స్ లో ఫెయిల్ అయిన కళ్యాణ్- తనూజ  ఈ కలర్ హోల్ టాస్కులో కళ్యాణ్-తనూజ మొదటి స్థానం సాధించినట్లు లీకులు బయటకు వచ్చాయి. ఆ తర్వాత భరణి-దివ్య ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad