Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss: ఓటింగ్ లో సీరియల్ హీరోయిన్ టాప్.. లీస్ట్ లో కొరియోగ్రాఫర్..!

Bigg Boss: ఓటింగ్ లో సీరియల్ హీరోయిన్ టాప్.. లీస్ట్ లో కొరియోగ్రాఫర్..!

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం నామినేషన్స్ అంతంతమాత్రంగానే సాగాయి. కాగా.. ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో 8 మంది సెలబ్రిటీలు, ఒక కామనర్ ఉన్నారు. అయితే, ఓటింగ్ ఫలితాలు వచ్చేశాయి. వారిలో టాప్‌లో తనూజ గౌడ టాప్‌లో దూసుకుపోతుండగా.. ఎలిమినేషన్‌కు దగ్గరిగా ఇద్దరు ఉన్నారు.  బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో గ్రాండ్‌గా సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్‌లోకి 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తంగా 15 మంది ఇంటి సభ్యులుగా అడుగుపెట్టారు. వీరిలో సెలబ్రిటీలుగా తనూజ గౌడ, ఫ్లోరా సైని, ఇమ్మాన్యుయెల్, భరణి శంకర్, రీతూ చౌదరి, రాము రాథోడ్, సంజన గల్రాని, శ్రేష్టి వర్మ, సుమన్ శెట్టి ఉన్నారు.
Read Also: Weight loss bonus: చైనా కంపెనీ వినూత్న ఆలోచన.. బరువు తగ్గితే బోనస్..!

- Advertisement -

నామినేషన్స్..

అగ్ని పరీక్ష ద్వారా అలాగే, బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష ద్వారా ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. వారిలో హరిష్ హరిత, సోల్జర్ కల్యాణ్ పడాల, డిమోన్ పవన్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ ఉన్నారు. ఇక మొదటి వారం వీరందరికి నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. పేరుకు మొదటి వారం నామినేషన్స్ జరిగాయి. అయితే, ఈ నామినేషన్స్‌ను కేవలం సెలబ్రిటీల్లో మాత్రమే చేయాలని బిగ్ బాస్ రూల్ పెట్టాడు. సెలబ్రిటీలు టెనెంట్స్‌గా, కామనర్స్ ఓనర్స్‌గా ఉంటున్నారు. కాబట్టి, ఎవరు సరిగా పని చేయట్లేదో, రెంట్ లేని టెనెంట్‌గా ఉండే అర్హత ఎవరికి లేదో చెబుతూ నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ తెలిపాడు. దాంతో సెలబ్రిటీల్లో 8 మంది నామినేట్ అయ్యారు.

Read Also: Nepal: నేపాల్ తాత్కాలిక సారథిగా మాజీ సీజేఐ జస్టిస్ సుశీలా కర్కీ..!

ట్విస్టులు
ఇకపోతే, బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ తర్వాత కొన్ని ట్విస్టులు ఇచ్చారు. దీంతో, కామనర్స్ నుంచి డిమోన్ పవన్ మొదటి వారం నామినేట్ అయ్యాడు. అలా మొత్తంగా బిగ్ బాస్ 9 తెలుగు మొదటి వారం 9 మంది నామినేట్ అయ్యారు. వీరికి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ 10న నామినేషన్స్ అనంతరం బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ ఓటింగ్‌లో ముద్ద మందారం సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ టాప్ 1లో దూసుకుపోతోంది. తనూజకు 5,727 ఓట్లతో 23.57 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఆమె తర్వాత సైలెంట్‌గా ఉంటున్న కమెడియన్ సుమన్ శెట్టి రెండో స్థానంలో దూసుకుపోతున్నాడు. సుమన్‌కు 5,290 ఓట్లతో 21.77 శాతం ఓటింగ్ పడింది. అలాగే, వరుసగా మూడో స్థానంలో ఇమ్మాన్యుయెల్ 16.83 శాతం (4,090 ఓట్లు), 4వ ప్లేసులో డీమోన్ పవన్ 10.18 శాతం (2,474 ఓట్లు), ఐదో స్థానంలో సంజన గల్రాని 8.6 శాతం (2,089 ఓట్లు), 6వ ప్లేసులో రాము రాథోడ్ 7.35 శాతం (1,786 ఓట్లు), 7వ స్థానంలో రీతూ చౌదరి 6.66 శాతం (1,619 ఓట్లు) ఓటింగ్ నమోదు అయింది.

చివరి రెండు స్థానాల్లో..

ఇక చివరి రెండు స్థానాల్లో హీరోయిన్ ఫ్లోరా సైనీ, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఉన్నారు. ఫ్లోరా 2.89 శాతం ఓటింగ్, 701 ఓట్లతో 8వ స్థానం దక్కించుకోగా, శ్రేష్టి 2.14 శాతం ఓటింగ్, 519 ఓట్లతో అట్టడుగున 9వ ప్లేసులో నిలిచింది. అంటే, మొదటి వారం ఎలిమినేషన్‌కు దగ్గరిగా ఇద్దరూ లేడీ కంటెస్టెంట్లే ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లోరా, శ్రేష్టి ఇద్దరు ఎలిమినేషన్ కు దగ్గర్లో ఉన్నారు. ఈ వారం పూర్తయ్యేసరికి ఇలాగే ఓటింగ్ కొనసాగితే వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. లేదా పర్ఫామెన్స్ బాగుండి ఓట్లు పడితే ఓటింగ్ మారే ఛాన్స్ కూడా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad