Bigg Boss Elimination: బిగ్ బాస్ సీజన్ 9లో నాలుగో వారం షాకింగ్ ఎలిమినేషన్ జరుగబోతుంది. తొలివారంలో శ్రష్టి వర్మ, రెండోవారంలో మర్యాద మనీష్, మూడో వారం ప్రియశెట్టి.. ఈ మూడు ఎలిమినేషన్‌లు అందరూ ఊహించినవే. ఇక నాలుగో వారంలో దమ్మ శ్రీజా ఎలిమినేషన్‌లో ఉండటంతో.. ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం అని అనుకున్నారంతా. నిజానికి తొలి ఐదురోజుల ఓటింగ్‌ని చూస్తే ఇవే రిజల్ట్స్ వచ్చాయి. కానీ చివరి రోజు ఓటింగ్ బయటకు వచ్చేసరికి షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. హరిత హరీష్ బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్‌లో ముక్కుసూటి మనిషి అంటే హరిత హరీష్. అగ్నిపరీక్షలో అతని పెర్ఫామెన్స్ చూసిన తరువాత.. ఇతను బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే.. విన్నర్ అయినా అవ్వకపోయినా గట్టి పోటీ అయితే ఇస్తాడని అంతా అనుకున్నారు. అయితే నాలుగు వారాలకే షాకింగ్ ఎలిమినేషన్ ద్వారా హరిత హరీష్ ఇంటి ముఖం పట్టబోతున్నాడు. నిజానికి ఈ నాలుగో వారం ఎలిమినేషన్ అనేది ఐదోరోజు ఓటింగ్ వరకూ కూడా పిక్చర్ క్లియర్‌గా కనిపించిపోయింది. రీతూ, ఫ్లోరా, సంజన, హరీష్, దివ్య నిఖితలతో పాటు దమ్ము శ్రీజ నామినేషన్స్‌లో ఉండటంతో.. శ్రీజ ఎలిమినేషన్ కావడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఐదోరోజు ఓటింగ్ ఒక్కసారిగా తారుమారు కావడంతో ఎలిమినేషన్ లెక్కలు మారిపోయాయి. గాయం కారణంగా ఈవారం మొత్తం టాస్క్‌లు ఆడలేకపోయిన హరిత హరీష్ ఓటింగ్ దారుణంగా డ్రాప్ కావడంతో ఓటింగ్ లెక్కలు మారిపోయాయి.
దీనికి తోడు.. ఈవారంలో విజృంభించి ఆడిన కళ్యాణ్ పడాల ఓటింగ్ మొత్తం శ్రీజ దమ్ము వైపు షిఫ్ట్ కావడంతో.. సేఫ్ జోన్‌లో ఉంటాడనుకున్న హరిత హరీష్ ఎలిమినేషన్‌లో జోన్‌లోకి వచ్చి.. శ్రీజ సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. ఈవారంలో కళ్యాణ్ పడాల విజృంభించి ఆడటంతో పాటు.. రీతూ కొట్టిన దెబ్బకి మనోడిపై ఆడియన్స్‌తో సింపథీ వచ్చేసింది. అయితే ఈవారంలో కళ్యాణ్ పడాల నామినేషన్స్‌లో లేడు.. ఒకవేళ ఉండి ఉంటే అతను టాప్‌లో ఉండేవాడు. అయితే కళ్యాణ్ పడాలకి శ్రీజ సపోర్ట్ చేయడం వల్ల.. కళ్యాణ్ పడాల ఓటింగ్ మొత్తం శ్రీజ వైపుకి మళ్లింది. దెబ్బకి లీస్ట్ ఓటింగ్‌లో ఉన్న శ్రీజ ఓటింగ్ తారుమారైంది. అదే మాస్క్ మెన్ కొంప ముంచింది. శ్రీజ నామినేషన్స్‌లో ఉంది కాబట్టి ఇక ఆమె ఎలిమినేషన్ పక్కా అని అనుకున్నారంతా. కానీ చివరి రెండు రోజుల ఓటింగ్‌తో శ్రీజ దమ్ము సేవ్ అయ్యి.. హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యే అవకాశం స్పష్ఠంగా కనిపిస్తోంది. మరోవైపు, సంజనాపై ఈవారం చాలా నెగిటివిటీ ఉన్నప్పటికీ ఆమె పీఆర్ వర్క్ గట్టిగానే ఉంది కాబట్టి.. పైగా తొలివారం నుంచి ఓటింగ్ గ్రాఫ్ ఉంది కాబట్టి ఈవారంలో సంజనా సేఫ్ జోన్‌లో ఉంది. సెలబ్రిటీ ఓటు షేరింగ్ ఫ్లోరా షైనీకి పడటంతో ఆమె తొలివారం నుంచి సేవ్ అవుతూ వస్తోంది. ఈవారంలో ఇమ్మానుయేల్, భరణి, సుమన్ శెట్టిలు నామినేషన్స్‌లో లేకపోవడంతో వాళ్ల ఓట్లు షేరింగ్ ఫ్లోరాకి పాజిటివ్‌గా మారింది. ఇక రీతూ చౌదరి విషయానికి వస్తే.. బిగ్ బాస్ షో అవసరమా? అన్నదానికంటే.. బిగ్ బాస్‌కి రీతూ చౌదరి చాలా అవసరం. బిగ్ బాస్ లాంటి అడల్ట్ షోకి రీతూ చౌదరి లాంటి బోల్డ్ కంటెస్టెంట్ దొరకడమే వాళ్ల అదృష్టం. వాళ్లు కావాలనుకున్న కంటెంట్‌కి రీతూ చౌదరి రెట్టింపు ఇస్తుంది తప్పితే ఇంచు కూడా తగ్గదు. కాబట్టి.. ఇలాంటి కంటెస్టెంట్‌ని వదులుకోరు.
రీతూచౌదరి ఎఫైర్లు.. బిగ్ బాస్ హౌస్‌లో పత్తేపారాలు ఇవన్నీ పక్కన పెడితే.. టాస్క్‌లు రీతూ చౌదరి ఫుల్ ఎఫర్ట్ పెడుతోంది. గతంలో విష్ణు ప్రియనే చివరి వరకూ ఎలిమినేట్ చేయకుండా ఉంచారు. ఆమె కేవలం పృథ్వీ కోసమే ఆడింది.. పృథ్వీ కోసమే ఉన్నది.. అతనికోసమే తపించింది. అతను ఈమె కుక్కని చూసినట్టు చూసి చీత్కరించుకున్నా కూడా.. అతని వెంట పడేది. ఇక టాస్క్‌లు అంటారా.. హా బోడి టాస్క్‌లు ఆడితే ఎంత ఆడకపోతే ఎంత.. వీకెండ్‌లో నాగార్జున చూసుకుంటారు.. వీక్ మొత్తంలో బిగ్ బాస్ చూసుకుంటాడు. మన పత్తేపారం మనం చేసుకుంటే చాల్లే అనేట్టుగానే ఉండేది విష్ణు ప్రియ. అలాంటిది ఆమెనే చివరి వరకూ ఉంచారు. మరి రీతూ చౌదరి.. అలాంటి పులిహోర కంటెంట్‌తో పాటు.. టాస్క్‌లలో కూడా శక్తికిమించి కష్టపడుతోంది. బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్‌ని అన్ని విధాలుగా సమకూర్చుతుంది. కాబట్టి రీతూ చౌదరిని తీస్తే గీస్తే ఓ పది వారాల తరువాతే అవకాశం ఉండొచ్చేమో కానీ.. ప్రస్తుతానికి అయితే రీతూ ఫుల్ సేఫ్ జోన్‌లోనే ఉంది.
Read Also: Japan PM: జపాన్ చరిత్రలో కొత్త అధ్యాయం.. తొలి మహిళా ప్రధానిగా సనై తకైచి..!
ఇటు దివ్య నిఖిత పాజిటివ్ వైబ్‌తో హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టింది.. ఆమెపై ఎలాంటి నెగిటివిటీ లేదు. హుందాగానే ప్రవర్తిస్తుంది. ఈమె వెళ్లింది తొలివారమే కాబట్టి.. ఇంకా ఆమె ఆటను చూడాలని అనుకునే వాళ్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి.. దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. పైగా దివ్య నిఖిత టాస్క్‌ల పరంగా వెనకడుగు వేయడం లేదు. మగాళ్లతో పోటీ పడి ఆడుతోంది. గత వారం హరిత హరీష్‌తో కింద మీదా పడి చాలానే కష్టపడింది. ఆ టైమ్‌లో కూడా హుందాగానే ప్రవర్తించింది దివ్య నిఖిత. వేరే వాళ్లైతే దాన్నిపెద్ద ఇష్యూ చేసేవారు కానీ.. మొదట్లో చేయి ఎక్కడ పెడుతున్నారో చూసుకోండి హరీష్ గారు అని అంటూనే.. ఆ తరువాత తాను అన్న మాటని కూడా సరిచేసుకుని హరీష్‌కి సారీ చెప్పింది. బిహేవియర్ పరంగా దివ్యనిఖితకి మంచి మార్కులే పడుతున్నాయి. పైగా ఇమ్మానుయేల్, భరణిలతో క్లోజ్‌గా ఉంటుంది కాబట్టి.. దివ్య నిఖితకి కలిసి వచ్చే అంశం. ఈవారం టాస్క్‌లలో అందరూ బాగానే పెర్ఫామెన్స్ చేశారు. కానీ హరిత హరీష్‌కి హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల.. అతను పార్టిసిపేట్ చేయలేదు. అదే అతనికి పెద్ద దెబ్బ. నిజానికి ఇంత ముక్కుసూటిగా ఉండే వాళ్లు బిగ్ బాస్‌కి సెట్ అవ్వరు. బిగ్ బాస్ షోలో రాణించాలంటే డ్రామాలు ఆడాలి.. నీతి, న్యాయం అంటే ఇలాగే ఎలిమినేట్ అయిపోతుంటారు. పైగా హరీష్.. నేను కరెక్ట్‌గా ఉన్నాను.. నా చుట్టూ ఉన్న వాళ్లు కూడా అలాగే ఉండాలి అనే స్వభావం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లు బిగ్ బాస్ లాంటి గబ్బు షోకి అస్సలు సెట్ కాడు కాబట్టి.. మాస్క్ మ్యాన్ హౌస్ వీడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


