Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss 9 Telugu Voting: ఈసారి డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్ లో ఆ...

Bigg Boss 9 Telugu Voting: ఈసారి డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్ లో ఆ నలుగురు?

Bigg Boss 9 Telugu Voting: వచ్చే వారం బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నారు. దాదాపు ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్‌లు వైల్డ్ కార్డ్‌ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. అందులో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉండటంతో ఆట మంచి రసపట్టులోకి వెళ్లబోతుంది. ఇప్పటి వరకూ హౌస్‌లో ఉన్న వాళ్లనే ఓనర్స్, టెన్నెంట్స్‌‌గా విడగొట్టారు. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్‌లు వచ్చిన తరువాత.. గతంలో మాదిరిగానే వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ మధ్య పోరు రసవత్తరంగా మారనుంది.

- Advertisement -

Read Also: Bigg Boss Today Promo: మీ నాన్నకు ఇప్పటికిప్పుడు పెళ్లంటే ఎలా? తనూజతో ఇమ్మూ కామెడీ

కొత్తగా నామినేషన్స్ ప్రక్రియ

కాగా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా కొత్త పద్దతిలో నిర్వహించాడు బిగ్‌బాస్. ఒక పెద్ద బెడ్ ని గార్డెన్ లో ఏర్పాటు చేసి, ఫ్లోరా, రాము తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరినీ ఆ బెడ్ పైన నిల్చోబెట్టాడు. ‘ఈ వారం మీరంతా నామినేట్ అయ్యారు, ఈ నామినేషన్ నుండి ఇమ్యూనిటీ పొందే అవకాశం మీకు ఇస్తున్నాను, మీరంతా ఆ బెడ్ మీదనే ఉండాలి, అలా ఆఖరి వరకు ఎవరెవరు ఉంటారో, వాళ్లు నామినేషన్ నుంచి బయటపడినట్టు. మిగిలిన వాళ్లు నామినేట్ అయ్యినట్టు’ అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నీరు, నిప్పు, గాలి అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్ ఆడించారు. ఈ పోటీలో ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణి, తనూజ పాల్గొన్నారు. చివరకు ఈ గేమ్ లో ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలిచారు. దీంతో కెప్టెన్ రాము, ఇమ్యాన్యుయేల్ తప్పితే మిగిలిన వాళ్లంతా ఈసారి నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. సంజనా, దివ్య నికితా, ఫ్లోరా, రితూ చౌదరి, శ్రీజ, పవన్, భరణి, డిమాన్ పవన్, తనూజ, సుమన్ లు ఈ వారం నామినేట్ అయిన వారిలో ఉన్నారు.అయితే ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశముంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా ఈ వారమే హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది.

Read Also: Bigg Boss Wildcard Entry: తుపాను నుంచి కాపాడుకోవటానికి ఒకే ఒక్క ఛాన్స్…. వైల్డ్‌కార్డ్స్‌ని ఆపేందుకు టాస్కులు..

డేంజర్ జోన్ లో.. ఆ నలుగురు

ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే శ్రీజ, దివ్య నిఖిత, ఫ్లోరా సైనీ, డీమాన్ పవన్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దివ్య నిఖిత గేమ్స్ బాగానే ఆడుతోంది. తోటి కంటెస్టెంట్స్ తో కూడా సవ్యంగానే మెలుగుతోంది .అయితే ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ కావడంతో సరైన ఫ్యాన్ బేస్ లేదు. దీంతో దివ్యకు ఓటింగ్ లో దెబ్బ పడుతోంది. ఇక గత వారం ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకుంది దమ్ము శ్రీజ. కాబట్టి ఆమె కూడా డేంజర్ జోన్ లో ఉంది. డీమాన్ పవన్ కు కూడా తక్కువే ఓట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫ్లోరా సైనీ, రీతూ చౌదరిలకు ఓటింగ్ తక్కువగా ఉంది. రీతూ పత్తేపారాలు, ఎఫైర్లు, దొంగ ఏడుపులు నటిస్తూ నెగెటివిటీ మూటకట్టుకుంది. కానీ.. టాస్క్‌ల పరంగా ఆమె శక్తికి మించి కష్టపడుతుంది. వాయిస్‌ని కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఇలాంటి కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్‌ని బిగ్ బాస్ హౌస్ నుంచి మధ్యలోనే పంపించడం అనేది బిగ్ బాస్ హిస్టరీలోనే లేదు. ఆ లెక్కన చూస్తే రీతూ కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. కాగా ఈ ఆదివారమే బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయి. మొత్తం ఐదు నుంచి ఆరుగురు సభ్యులు హౌస్‌లోకి రాబోతున్నారు. మరి ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారు? కొత్త కంటెస్టెంట్స్ తర్వాత తర్వాత గేమ్ ఎలా ఉండబోతుందో అని ఆడియన్స్ ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad