Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Ayesha: బిగ్ బాస్ అయేషాపై మాజీ ప్రేమికుడి సంచలన ఆరోపణలు.. రెండుసార్లు బ్రేకప్?

Bigg Boss Ayesha: బిగ్ బాస్ అయేషాపై మాజీ ప్రేమికుడి సంచలన ఆరోపణలు.. రెండుసార్లు బ్రేకప్?

Bigg Boss Ayesha: బిగ్‌బాస్‌ 9 తెలుగులో వైల్డ్‌ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన అయేషా పటాకాలా దూసుకెళ్తుంది. కేరళకు చెందిన ఆమె అసలు పేరు అయేషా జీనత్‌.. అయితే, కోలీవుడ్‌లోనే ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. 2019లో ఆమె నటించిన సత్య సీరియల్‌ తమిళ్‌లో పాపులర్‌ అయింది. అయితే, ఆ సీరియల్ ముగింపు అర్థాంతరంగా జరిగింది. దీంతో, ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఏకంగా సత్య-2 కూడా రన్‌ చేశారు. ఆ తర్వాత, తమిళ్‌ బిగ్‌బాస్‌-6లో ఛాన్స్‌ దక్కించుకున్న ఈ బ్యూటీ సుమారు 60రోజుల పాటు కొనసాగింది. తెలుగులో స్టార్‌మా సీరియల్స్‌ సావిత్రమ్మ గారి అబ్బాయి, ఊర్వశివో రాక్షసివో వంటి ప్రాజెక్ట్‌లతో మెప్పించింది. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డులో భాగంగా హౌస్ లోకి ఎంటరైంది. తన స్టైల్లోనే పవర్‌ఫుల్‌గా గేమ్ లో టాలెంట్‌ చూపుతుంది.

- Advertisement -

Read Also: Deepshikha Nagpal: కెమెరా ముందు దుస్తులు తీసేసావా?.. నా కూతురు సీడీని విరిచేసింది

రెండుసార్లు ఎంగేజ్ మెంట్..

అయేషా రెండుసార్లు నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ వివాహ జీవితంలో అడుగుపెట్టలేదు. మొదట హరన్ రెడ్డిని ప్రేమించింది. అతను ఫ్యాషన్‌ ఫోటోగ్రాపర్‌గా సినిమా పరిశ్రమలోనే కొనసాగాడు. కొన్ని ప్రాజెక్ట్‌లకు వారిద్దరూ కలిసి కూడా పనిచేశారు. అయితే, అతను తనను ప్రేమిస్తూనే మరో అమ్మాయితో సంబంధం  పెట్టుకున్నాడని తెలుసుకున్న అయేషా అతడికి బ్రేకప్‌ చెప్పింది. ఇదే విషయాన్ని తమిళ్‌ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె పంచుకుంది. అయితే, 2023లో యోగేష్ (యోగి)తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. కానీ, ఎంగేజ్‌మెంట్‌తోనే అతనికి కూడా ఆమె గుడ్‌బై చెప్పేసింది. నిజాయితీ లేని ప్రేమ తనకు అవసరం లేదని ఆమె పలుమార్లు చెప్పుతూ వచ్చింది. కెరీర్‌ మీద మాత్రమే తన ఫోకస్‌ ఉంటుందని, ఈ ప్రేమలు తనకు పడవని ఒక క్లారిటీ వచ్చినట్లు పలు ఇంటర్వ్యూలో తెలిపింది.

అయేషాపై మాజీ ప్రేమికుడి కామెంట్

ఇక, అయేషా హీరోయిన్‌గా మూడు సినిమాల్లో కూడా నటించింది. తమిళ్‌ బిగ్‌బాస్‌లో చాలా వివాదాస్పద కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది. తోటి కంటెస్టెంట్స్‌ను ఆవేశంతో దూషించడం వల్ల తనుకు చెడ్డపేరు వచ్చింది. అయితే, హౌస్ నుంచి వెళ్లేటప్పుడు వాళ్లకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఒకసారి హౌస్ట్‌గా ఉన్న కమల్‌ హాసన్‌నే ఎదిరించి వైరల్‌ అయింది. అయితే, ఆమె తమిళ్‌ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె మాజీ ప్రియుడు దేవ్‌ సంచలన ఆరోపణలు చేశాడు.  అయేషాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందని కామెంట్‌ చేశాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి తనను అవమానించడమే కాకుండా.. కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని మరో ఇద్దరితో ఆమె ప్రేమాయణం నడిపిందని చెప్పాడు. అయితే, అతను చేసిన ఆరోపణల గురించి అయేషా మాత్రం ఎక్కడా మాట్లాడలేదు.  ఫైనల్‌గా అయేషా జీవితంలో మూడు ప్రేమకథలు బ్రేకప్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక, బిగ్ బాస్ తెలుగులో మాత్రం ఈ అమ్మడు ఇరగదీస్తుంది.
Read Also: Bigg Boss: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా.. డేంజర్ జోన్ లో ఎవరున్నారో తెలుసా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad