Bigg Boss Promo Today: బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం టాస్కులు గట్టిగానే జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెండర్‌షిప్, కిక్ ఔట్ కార్డ్స్‌ని ఫ్లోరా టీమ్ గెలుచుకుంది. ఇక ఈరోజు మటన్, లగ్జరీ ఫుడ్ కార్డ్స్ కోసం టాస్కు జరిగింది. ఇందులో భాగంగా పెట్టిన హంగ్రీ హిప్పో టాస్కులో కంటెస్టెంట్లు మాములుగా కుమ్ముకోలేదు. ముఖ్యంగా ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్ అయితే గేమ్‌లో రెచ్చిపోయారు. ఈ టాస్కుకి భరణి సంచాలక్‌గా ఉన్నాడు. ఇమ్మూపై తనూజ ఫైర్ అయింది. చివరికి బిగ్‌బాస్ కెప్టెన్సీ రేసులో నలుగురు నిలిచారు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్, కిక్ ఔట్, మటన్, లగ్జరీ ఫుడ్ అంటూ నాలుగు పవర్ కార్డ్స్ కోసం హౌస్‌మేట్స్ అంతా తన్నుకుంటున్నారు. 12 మందిని నాలుగు టీములుగా డివైడ్ చేసి బిగ్‌బాస్ టాస్కులు పెడుతున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో వరుసగా రెండు గేమ్స్ గెలిచిన ఫ్లోరా టీమ్ (ఫ్లోరా, కళ్యాణ్, ఇమ్మానుయేల్) అటు కంటెండర్ షిప్, కిక్ ఔట్ రెండు కార్డ్స్ గెలుచుకుంది.
Read Also: Bigg Boss Nominations: నామినేషన్స్ లో ఆరుగురు.. సెలబ్రిటీలు ముగ్గురు… డేంజర్ జోన్ లో ఇద్దరు కామనర్లు
హంగ్రీ హిప్పో
ఇక ఈరోజు ఎపిసోడ్‌లో మటన్, లగ్జరీ ఫుడ్ కార్డ్స్ కోసం టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. పవర్ కార్డ్ పొందడం కోసం నేను మీకు ఇస్తున్న టాస్క్.. హంగ్రీ హిప్పో.. ఆకలితో ఉన్న హిప్పో నోటిలో బాల్స్ వేసి ఆహారంగా తినిపించడం.. ఏ టీమ్ అయితే ఆ హిప్పో నోటిలో ఎక్కువ బాల్స్ వేసి ఆహారంగా తినిపిస్తారో వారే ఈ ఛాలెంజ్‌లో విజేతలు అవుతారు.. మీ ప్రత్యర్థి పోటీదారులు ఆ హిప్పో నోటిలో బాల్స్ వేయకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. గేమ్ స్టార్ట్ అవ్వగానే మరోసారి రెడ్ టీమ్ అంటే ఫ్లోరా టీమ్ రెచ్చిపోయింది. కళ్యాణ్-ఇమ్మానుయేల్ అయితే బాల్ పట్టుకొని మిగిలిన ప్లేయర్లని తోసిపడేశారు. తనూజ, రీతూ చౌదరి, హరీష్ ఆపడానికి ట్రై చేసినా పనవ్వలేదు. దీంతో పాయింట్ రెడ్ టీమ్‌కి.. అని భరణి అన్నాడు. దీనిపై తనూజ ఫైర్ అయింది. ఇది నిజంగా అన్‌ఫెయిర్.. వాడు వెనకాల ఉన్నాడు ముందు శ్రీజ పట్టుకొని వెళ్లింది .. పట్టుకొని వెళ్లగానే ఆయన తోశాడు.. అంటూ ఇమ్మూ గురించి చెప్పింది తనూజ.
Read Also: Bigg Boss Priya Shetty: నాకు అన్నీ ఎక్కువే.. ఉడుకు రక్తం కదా.. ప్రియా శెట్టి కామెంట్స్ వైరల్
నలుగురు కెప్టెన్సీ కంటెండర్లు
బాడీ కూడా టచ్ అవ్వలేదు నాన్న.. అని ఇమ్మూ క్లారిటీ ఇవ్వబోయాడు. బాడీలో టచ్ కాకపోతే నువ్వు ఎందుకు తోసుకొని వెళ్లావ్.. అన్‌ఫెయిర్ ఇవ్వాలనుకుంటు ఇచ్చేసుకోండి.. అంటూ సంచాలక్ భరణిపై కూడా తనూజ గట్టిగానే మాట్లాడింది. ఇలా మొత్తానికి ఈ టాస్కులన్నీ ముగిసేసరికి నలుగురు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. కళ్యాణ్, రీతూ చౌదరి, ఇమ్మానుయేల్, రాము రాథోడ్.. ఈ నలుగురు కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. మరి వీరి నుంచి నాలుగో వరం కెప్టెన్ ఎవరవుతారు అనేది చూడాలి. అమ్మాయిల నుంచి కేవలం రీతూనే కెప్టెన్ రేసులో ఉంది. బిగ్‌బాస్ 9లో తొలి వారం సంజన కెప్టెన్ కాగా ఆ తర్వాత వరుసగా రెండు వారాలు డీమాన్ కెప్టెన్ అయ్యాడు. మూడో వారం ఇమ్మూ కెప్టెన్ అయినప్పటికీ సంజన కోసం త్యాగం చేయడంతో తర్వాత అది డీమాన్ చేతికి వెళ్లింది.


