Saturday, November 15, 2025
HomeTop StoriesBigg Boss Promo Today: నడుము గిల్లారని ఫీలైన ఇమ్మూ.. ప్రూఫ్ ఉందా అని ప్రశ్నించి తనూజ

Bigg Boss Promo Today: నడుము గిల్లారని ఫీలైన ఇమ్మూ.. ప్రూఫ్ ఉందా అని ప్రశ్నించి తనూజ

Bigg Boss Promo Today: బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతోంది. అయితే, ఆ టాస్క్ లో హోరాహోరీగా ఆడిన హౌస్‌మేట్స్‌ని తెగ నవ్వించాడు ఇమ్మానుయేల్. అందరూ గేమ్ మధ్యలో కూర్చొని ఉండగా సీరియస్‌గా నా నడుము ఎవరో టాస్కులో గిల్లేశారు అంటూ ఇమ్మూ అన్నాడు. ఈ మాటకి అందరూ తెగ నవ్వుకున్నారు. ఇక ఈ గేమ్‌లో బ్లూ టీమ్ గెలిచిందంటూ భరణి తీసుకున్న డెసిషన్‌పై ఇమ్మూ ఫైర్ అయ్యాడు. ఈ ప్రోమోపై ఓ లుక్కేద్దాం.

- Advertisement -

నవ్వులు పూయించిన ఇమ్మూ

బిగ్‌బాస్ హౌస్‌లో యాంగ్రీ హిప్పో గేమ్ నడుస్తుంది. ఇందుకు సంబంధించిన మొదటి ప్రోమోలో హౌస్‌మేట్స్ మాములుగా కుమ్ముకోలేదు. ఇక తాజాగా వదిలిన రెండో ప్రోమోలో మాత్రం ఇమ్మానుయేల్ నవ్వులు పూయించాడు. సంచాలక్.. గేమ్‌లో ఎవరో నా నడుము గిల్లారు.. అది ఎవరో మీరు చెప్పాలి.. అంటూ ఇమ్మూ అడిగాడు. ఈ మాటలకి సంచాలక్ భరణి సహ తనూజ, రీతూ చౌదరి అందరూ నవ్వుకున్నారు. నా నడుము అంత బావున్నంత మాత్రాన గేమ్ అడ్డుపెట్టుకొని అలా చేయడం ఇది నేను పర్సనల్ అబ్యూజ్‌లా నేను ఫీల్ అవుతా.. అంటూ ఇమ్మూ అన్నాడు. పక్కనే ఉన్న దివ్య అయితే పడిపడి నవ్వుకుంది. పోనీ ఎవరు గిల్లారో మీకేమైనా డౌట్ ఉందా.. అని ఇమ్మూని భరణి అడిగాడు. హా నాకు క్లారిటీ ఉంది..కన్నేసి కావాలని చేసిందే ఇదంతా.. అంటూ ఇమ్మూ అన్నాడు.

Read Also: Bigg Boss Promo Today: కెప్టెన్సీ రేసులో ఆ నలుగురు.. అమ్మాయిల నుంచి రీతూ ఒక్కతే..!

ఫ్రూఫ్ అడిగిన తనూజ

ఇంతలో ప్రూఫ్ ఉందా నీ దగ్గర నేను నీ నడుము గిల్లానని.. అంటూ తనూజ సరదాగా చెప్పింది. నాగ్ సార్ వచ్చినప్పుడు నా నడుము గిల్లినోళ్లు ఒకర్ని చూపించండి నాకు చాలు.. ఇంకేమొద్దు అంటాను.. అంటూ ఇమ్మూ ఇంకా కామెడీ చేశాడు. ఇంతలో భరణి ఈ రౌండ్‌లో ఎవరు గెలిచారు.. అంటూ బిగ్‌బాస్ అడిగాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈ పాయింట్ నేను బ్లూ టీమ్‌కి ఇస్తున్నాను బిగ్‌బాస్.. అని భరణి చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే రెడ్ టీమ్ ఈ గేమ్‌లో ఇరగదీసింది. కానీ పాయింట్ బ్లూ టీమ్‌కి ఎందుకిచ్చారో అర్థం కాలేదు. దీంతో దేన్ని పరిగణలోకి తీసుకొని విన్నర్స్‌ని చేశారు అది చెప్పండి.. అంటూ ఇమ్మూ అడిగాడు. 15-20 పర్సంట్ బాల్ శ్రీజ హోల్డ్‌లో ఉంది.. అంటూ భరణి అన్నాడు. 70 పర్సంట్ ఉన్నోడు దాటకపోతే 20 పర్సంట్ వాడు ఇలా పట్టుకుంటే వాళ్లకి పాయింట్ వెళ్లిపోతుందా.. అంటూ ఇమ్మూ కొశ్చన్ చేశాడు.

Read Also: Bigg Boss Nominations: నామినేషన్స్ లో ఆరుగురు.. సెలబ్రిటీలు ముగ్గురు… డేంజర్ జోన్ లో ఇద్దరు కామనర్లు

ట్విస్ట్ ఇచ్చిన భరణి

నాకు న్యాయం అనిపించింది నేను చేశాను.. అంటూ భరణి సమర్థించుకున్నాడు. మేము అక్కడి నుంచి ఈడ్చుకుంటా వస్తే ఇక్కడికి వచ్చి ఇలా పెడితే ఎలా అవుతుంది.. అని ఇమ్మూ వాదించాడు. ఇది నా ఫైనల్ కాల్ అంటూ భరణి డెసిషన్ తీసుకున్నాడు. ఇక శ్రీజతో తనూజ, రీతూ గేమ్ వ్యూహాలు చర్చిస్తూ బాల్ వాళ్ల దగ్గర ఉందనుకో నువ్వు వాళ్ల కాళ్లు చేతులు పట్టుకోవడమే ఎందుకంటే వాళ్లు టచ్ చేసి మాది మాది అంటారు కదా.. అంటూ మట్లాడుకున్నారు. మొత్తానికి ఇలా నిన్న ఈరోజు జరిగిన టాస్కులన్నీ కలుపుకుంటే కెప్టెన్సీ రేసులో నలుగురు నిలిచారు. పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్, రాము రాథోడ్, రీతూ చౌదరి కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. మరి వీరి నుంచి ఎవరిని కెప్టెన్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad