Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Triangle Love Story: ముక్కలైన కళ్యాణ్ గుండె.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లేనా?

Triangle Love Story: ముక్కలైన కళ్యాణ్ గుండె.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లేనా?

Triangle Love Story: నా సామిరంగా.. ట్విస్ట్ అంటే ఇది. బిగ్ బాస్ లో ఇప్పటివరకు రీతూతో కాట్రాజ్ కళ్యాణ్ లతో చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.. కాగా.. ఇప్పటివరకు నడిచిన ట్రయాంగిల్ ట్రాక్ ఇవాళ్టితో ముక్కలైంది. కెప్టెన్సీ రేసులో కళ్యాణ్ కు రీతూ వెన్నుపోటు పొడిచింది. డీమాన్ తో కళ్యాణ్ ను వేటు వేసింది. రీతూ డైరెక్ట్‌గా రేసు నుంచి తప్పించకుండా తన జిగ్రీ డీమాన్‌తో చేయించింది రీతూ. ఇది తట్టుకోలేకపోయిన కళ్యాణ్.. డీమాన్, రీతూలని ఏకిపారేశాడు. మీ ఇద్దరినీ ఫ్రెండ్స్ అనుకున్నా.. నన్ను మోసం చేశావ్ నువ్వు అంటూ రీతూ ముఖం మీదే చెప్పాడు. ఇక చేసింది చాలదన్నట్లు కళ్యాణ్‌పైన రీతూ అరిచింది. కాగా.. ఇంత డ్రామా జరిగిన ఈ ప్రోమోని మనమూ చూసేద్దాం.

- Advertisement -

కెప్టెన్సీ టాస్కు తర్వాతే లొల్లి..

బిగ్‌బాస్ సీజన్-9లో మొత్తానికి ఓ మంచి సీన్ అయితే పడింది. ఇప్పటివరకూ హౌస్‌లో కలిసి తిరిగిన రీతూ చౌదరి-కళ్యాణ్‌ల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ కట్ అయ్యింది. కెప్టెన్సీ రేసు నుంచి డీమాన్ సాయంతో కళ్యాణ్‌ని తప్పించింది రీతూ. దీంతో కళ్యాణ్  ఫుల్ గా హర్టయ్యాడు. బెడ్ మీద కళ్యాణ్ ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయింది శ్రీజ. నేను కెప్టెన్‌గా నిన్ను ఖచ్చితంగా చేస్తాను.. అంటూ కళ్యాణ్‌కి ధైర్యం చెప్పింది. ఇక పవన్ కళ్యాణ్ ఏడుపు చూసి తనూజ అక్కడికి వచ్చి మాట్లాడింది. ఎవరి మైండ్‌లో ఎవరి హార్ట్‌లో ఏముందో మనకేదీ తెలియదు.. అని తనూజ చెప్పింది. దీనికి నేను ఈ హౌస్‌లో నమ్మింది రీతూనే.. అంటూ కళ్యాణ్ చెబుతుంటే ఆ పేరు చెప్పొద్దు ఎక్కడా నాకు అది అనిపించలేదు.. అంటూ తనూజ చెప్పింది. ఇక, ఆ తర్వాత కాసేపటికి డీమాన్‌ని వెంటబెట్టుకొని కళ్యాణ్‌ దగ్గరికి వెళ్లి సారీ చెప్పింది రీతూ. బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్ కదరా నువ్వు.. ఫస్ట్ తీసేమని ఎలా చెప్పావ్.. నోటిలో నుంచి ఎలా వచ్చింది ఆ మాట.. అంటూ కళ్యాణ్ ముఖం మీదే అడిగాడు. అక్కడి నుంచి లేచి వెళ్లిపోతూ ఒకడి కష్టాన్ని దొబ్బడం కాదు ఎవడైనా సరే చెప్తున్నాను.. అంటూ కళ్యాణ్ అరిచాడు. దానికి మన ఎడిటర్ వేసిన బీజీఎం ఉంది సారూ.. ఓ రేంజ్ లో ఉంది.

Read Also: RCB: ఆర్సీ ఫ్రాంఛైజీ భవిష్యత్ ఏంటో..? అమ్మకానికి లలిత్ మోదీ షేర్లు?

మోసపోయినందుకు బాధపడుతున్నా..

కాసేపటికీ మళ్లీ గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ దగ్గరికి వచ్చి రీతూ బతిమాలింది. నాకు ఈ హౌస్‌లో ఉన్నది ఫస్ట్ నుంచి ఇద్దరే కానీ నేను వీడి నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా.. అది కూడా నువ్వు నన్ను తీసేయమన్నావ్ కదా.. అంటూ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. ఇదంతా చూసి రీతూకి ఓ సలహా ఇచ్చాడు డీమాన్. ఇప్పుడే చెప్తున్నాను వాడు వినకుండా చీదరించుకున్నాడంటే.. నాకు అలా చీదరించుకుంటుంటే వెనకాల వెళ్లడం నాకు ఇష్టం లేదు.. అంటూ డీమాన్ అన్నాడు.

Read Also: Bigg Boss New Captain: కొత్త కెప్టెన్ గా రాము రాథోడ్..!

అయితే, ఇక ఆ తర్వాత ఉండబట్టలేక మళ్లీ రీతూ డీమాన్ దగ్గరికి వెళ్లింది. కిచెన్ లో కళ్యాణ్  దగ్గరికెళ్లి నేను చూడలేకపోతున్నాను నువ్వు బాధపడటం.. నేనూ ఓడిపోయానురా అంటూ రీతూ చెప్పింది. దీనికి నేను బాధపడుతున్నది ఓడిపోయినందుకు కాదు మోసపోయినందుకు.. అంటూ కళ్యాణ్ వెళ్లిపోయాడు. దీంతో అనేసి వెళ్లిపోవడం కాదు నేను ఏం సపోర్ట్ అన్నాను చెప్పు.. అంటూ రీతూ అరిచింది. అక్కడకి శ్రీజ కూడా రావడంతో ఓకే థాంక్యూ.. అంటూ డీమాన్‌ని తీసుకొని రీతూ వెళ్లిపోయింది. థాంక్యూ సో మచ్ రీతూ.. అంటూ శ్రీజ కూడా వెటకారంగా చెప్పింది. నేను ఏమనలేదు శ్రీజ నేను.. అని రీతూ అంటే నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వెందుకు ఓకే థాంక్యూ అని వెటకారంగా చెప్పడం.. నీకేం పని అసలు ఇక్కడికి రావడానికి.. అంటూ శ్రీజ దులిపేసింది. ఇక చివర్లో ఏం మోసం చేశాను కళ్యాణ్ అని రీతూ రివర్స్ అయ్యింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad