Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Written Updates: ఈ తింగరిది ఎక్కడ్నుంచి వచ్చిందిరా బాబు.. కళ్యాణ్-శ్రీజ బుట్టలో పడ్డ...

Bigg Boss Written Updates: ఈ తింగరిది ఎక్కడ్నుంచి వచ్చిందిరా బాబు.. కళ్యాణ్-శ్రీజ బుట్టలో పడ్డ తనూజ

Bigg Boss Written Updates: బిగ్‌బాస్ హౌస్‌లో శాశ్వతంగా శత్రువులు- మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. సందర్భాన్ని బట్టి బిహేవ్ చేస్తారు. కానీ కొంతమంది మాత్రం మరీ గుడ్డిగా వీళ్లు నా ఫ్రెండ్స్ అంటూ నమ్ముతారు. కానీ అలాంటి వాళ్లకి వాళ్లే సరైన టైమ్ చూసి పోటు పొడుస్తారు. ఇప్పుడు, బిగ్‌బాస్ 9 లేటెస్ట్ ఎపిసోడ్‌లో కూడా అదే జరిగింది. తనూజ అమాయకత్వాన్ని, తింగరితనాన్ని 100 శాతం వాడుకొని.. కళ్యాణ్‌ కెప్టెన్ అయిపోయాడు. ఇక తనూజని గుడ్డిగా నమ్మి ఆట ఆడిన భరణి-దివ్యలు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. నిన్నటి ఎపిసోడ్‌లో లీడర్ బోర్డ్‌లో టాప్-2లో ఉన్న తనూజ-కళ్యాణ్‌లలో ఒకరికి సేఫ్ అయ్యే ఛాన్స్ బిగ్‌బాస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనూజని ఒక్క మట అడగ్గానే కళ్యాణ్‌ని సేఫ్ చేసి తను డేంజర్‌లోకి వెళ్లిపోయింది. ఇదేంటబ్బా తనూజ అసలు తన వాదన కూడా ఏం చేయలేదు.. అని ఆడియన్స్ కూడా అనుకున్నారు. దానికి రీజన్ ఏంటో ఈరోజు ఎపిసోడ్‌లో తేలింది. కళ్యాణ్-శ్రీజ కలిసి వేసిన బుట్టలో తనూజ పూర్తిగా పడిపోయింది.

- Advertisement -

దివ్య- ఇమ్మూ..

అయితే, కళ్యాణ్‌కి ఎందుకు ఇలా సేఫ్ ఇచ్చేశావ్.. నువ్వు తన కంటే టాస్కుల్లో బాగా ఆడావ్ కదా ఎందుకు అలా చేశావంటూ తనూజని దివ్య-ఇమ్మూ అడిగారు. దీనికి అంటే తను నాతో టీమ్ అప్ అయ్యేటప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తే నేను తీసుకుంటాను సేఫ్టీ అన్నాడు.. నేను అప్పుడు మాట ఇచ్చేశా అని తనూజ చెప్పింది. ఇది వినగానే ఇమ్మూ-దివ్య అవాక్కయ్యారు. అసలు వాడు శ్రీజని కాదని నీతో టీమ్ అయిందే ఇందుకు.. నువ్వేమో తింగరిదానిలా ముందే మాట ఇచ్చేశావ్.. లేదు ఆ టైమ్‌కి ఎవరు టాస్కులు బాగా ఆడితే వాళ్లు మాట్లాడి తీసుకుందామని నువ్వెందుకు చెప్పలేదు.. ఇది చాలా రాంగ్ డెసిషన్ అని దివ్య-ఇమ్మూ అన్నారు. ఇలా మాట్లాడిన తర్వాత దివ్యతో తనూజ క్లోజ్‌ అయింది. నైట్ బెడ్ దగ్గర ముచ్చట్లు పెట్టేటప్పుడు కూడా నాకు నా చెల్లి (దివ్య), నాన్న (భరణి) ఉన్నారు ఈ హౌస్‌లో అంటూ తనూజ చెప్పింది. ఇక డేంజర్ జోన్‌లో ఉన్నవారిలో ఒకర్ని సేవ్ చేసేందుకు బిగ్‌బాస్ లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. డేంజర్ జోన్‌లో ఉండే సభ్యులకి వచ్చే ఫైర్ స్ట్రామ్ నుంచి సేవ్ అవ్వడానికి లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను.. బిగ్‌బాస్ హౌస్‌లో మీ సర్వైవల్ కోసం నేను ఇస్తున్న టాస్క్ ఫైట్ ఫర్ సర్వైవల్.. గార్డెన్ ఏరియాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటితో నిండే పూల్స్ ఉన్నాయి.. అందులో నీళ్లు చల్లగా ఉండొచ్చు కానీ అవే మీకు అగ్నిపరీక్ష.. ఎందుకంటే స్టార్ట్ బజర్ మోగగానే డేంజర్ జోన్‌లో ఉన్న సభ్యులు తమకు కేటాయింటిన పూల్స్‌లోకి వెళ్లి అందులో ఉన్న రోప్స్‌ని పట్టుకొని పూర్తిగా పడుకోవాలి.. ఆ పూల్స్‌కి కనెక్ట్ చేసిన ట్యాప్స్ ద్వారా ఆ పూల్స్‌లో నీరు క్రమంగా ప్రతి సెకను మీ సహనాన్ని మీ శ్వాసని మీ ధైర్యాన్ని పరీక్షిస్తాయి.. సేఫ్‌ జోన్‌లో ఉన్న సభ్యులు డేంజర్ జోన్‌లో ఉన్న ఎవరిని డేంజర్ జోన్‌ నుంచి సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల పూల్‌లో నీటిని బకెట్‌తో బయటికి తీసి డేంజర్ జోన్‌లోనే ఉంచాలనుకుంటున్న సభ్యుని పూల్‌లో వేయాల్సి ఉంటుంది..

Read Also: Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్ కొలిక్కి వచ్చినట్లేనా.. ఎలిమినేషన్ ఎవరవుతారు?

పూల్ గేమ్ లో..

ఎప్పుడైతే పూల్‌లో ఉన్న సభ్యులు ఇక అందులో ఉండలేము అనుకుంటారో అప్పుడు వారు పూల్‌లో లేచి కూర్చోవచ్చు.. అలా లేచి కూర్చున్న వాళ్లు ఆట నుంచి ఎలిమినేట్ అవుతారు.. ఆఖరి వరకూ ఎవరైతే పూల్‌లో కొనసాగుతారో వారు ఈ ఫైట్ ఫర్ సర్వైవల్‌లో గెలిచి డేంజర్ జోన్ నుంచి సేవ్ అవుతారు.. ఈ టాస్కులో కొన్ని నియమాలున్నాయి.. పూల్‌లో ఉన్న సభ్యులు తమ శరీర భాగాల్ని పైకి లేపడానికి వీల్లేదు.. కేవలం తలని మాత్రమే పైకి పెట్టొచ్చు.. పూల్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో ఉన్న రోప్‌ని పట్టుకోవాలి.. ఒకవేళ పూల్‌లో ఉన్న సభ్యులు లేచి కూర్చుంటే సంచాలకులు ఆ పూల్‌కి ఉన్న ట్యాప్‌ని ఆఫ్ చేయాలి.. ఏ పూల్‌లో ఎవరు పడుకోవాలి అనేది సేఫ్ జోన్‌లో ఉన్న హౌస్‌మేట్స్ డిసైడ్ చేయాలి.. ఫ్లోరా ఈ టాస్కుకి సంచాలకులు అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఇలా చెప్పగానే అందరూ వాళ్లకి సపోర్ట్ చేసే వాళ్ల వెంట పడ్డారు. తనూజ.. నాన్న ప్లీజ్ అంటూ భరణిని హత్తుకొని ఏడ్చేసింది. దీంతో తనూజకి సపోర్ట్ చేస్తానని భరణి చెప్పాడు. సుమన్ శెట్టికి రాము, రీతూకి దివ్య, శ్రీజకి కళ్యాణ్, సంజనకి ఇమ్మూ సపోర్ట్ చేశారు.

Read Also: Bigg Boss: బిగ్ బాస్ లోకి నాగార్జునకు హిట్ ఇచ్చిన దర్శకుడు.. ఫుల్ ఇంట్రెస్టింగ్ గా మారిన షో

సుమన్ శెట్టి ఆన్ ఫైర్..

టాస్క్ నడుస్తున్న టైమ్‌లో సుమన్ శెట్టి కాళ్లు ట్యూబ్‌కి టచ్ అయ్యాయంటూ ఫ్లోరా ఎలిమినేట్ అని చెప్పేసింది. అయ్యో నా కాళ్లు టచ్ అవ్వలేదు.. మీకు నీళ్లలో అలా కనిపిస్తున్నాయని సుమన్ శెట్టి వాదించాడు. అయినా సరే ప్లోరా ఒప్పుకోలేదు. సుమన్ కూడా వాదించడంతో మిగిలిన వాళ్ల వచ్చి ప్లీజ్ అన్నా.. నీ వల్ల మిగిలిన వాళ్లు నీళ్లలో సఫర్ అవుతున్నారు.. సంచాలక్ డెసిషన్ తప్పయితే వీకెండ్ నాగార్జున సార్ చెప్తారు కదా అంటూ సుమన్ శెట్టికి సర్ది చెప్పారు. దీంతో ఎప్పుడూ వాదన పెట్టుకోను.. తప్పు లేకుండా తప్పు అంటున్నారు కాబట్టి అరుస్తున్నాను.. నేనేమైనా ఆరడగులు ఉన్నానా టచ్ అవ్వడనికి నాలుగు అడుగులు ఉన్నాను.. నా కాళ్లు ఎలా టచ్ అవుతాయి అంటూ సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు.

డీమాన్ ఔట్..

ఈ టాస్కులో నెక్స్ట్ డీమాన్ ఔట్ అయిపోయాడు. ఎందుకంటే డీమాన్‌కి ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత రీతూ ఔట్ అయిపోయింది. చివరి రౌండ్‌లో తక్కువ వాటర్ ఉండటంతో తనూజ విన్ అయింది. దగ్గరుండి మరీ తనూజని గెలిపించిన భరణి.. ఆమెని భుజం మీద మోసుకెళ్లి మరీ పొంగిపోయాడు. ఇక దివ్య కూడా తనూజకి కాస్త సపోర్ట్ చేసింది. దీంతో మొత్తానికి డేంజర్ జోన్ నుంచి తనూజ కూడా సేఫ్‌ అయిపోయింది. అంత కష్టపడినా ఈ గేమ్ లోనూ కూడా ఓడిపోయినందుకు రీతూ మళ్లీ ఏడ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad