Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Day 8 Promo:  తిండిమానేసిన గుండు అంకుల్.. కన్నీళ్లు పెట్టుకున్న మనీష్.. కెప్టెన్...

Bigg Boss Day 8 Promo:  తిండిమానేసిన గుండు అంకుల్.. కన్నీళ్లు పెట్టుకున్న మనీష్.. కెప్టెన్ మాటవినని కామనర్స్

Bigg Boss Day 8 Promo: బిగ్‌బాస్ హౌస్‌లో మళ్లీ కథ మొదటికే వచ్చింది. కెప్టెన్ మాట వినాల్సిందేనని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున క్లియర్ గా చెప్పి.. అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు గొర్రెల్లా తలలూపిన కంటెస్టంట్లు.. ఇప్పుడు కెప్టెన్ సంజనా మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో కామనర్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. ముఖ్యంగా హరీష్, మర్యాద మనీష్ ఇద్దరూ ప్రియ, దమ్ము శ్రీజల విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. బిగ్‌బాస్ సీజన్ 9లో కామనర్లు సెలబ్రెటీల్లా.. సెలబ్రెటీలు కామనర్లరా బిహేవ్ చేస్తున్నారు. ఏదో పొడిచేస్తారు అంటూ అగ్నిపరీక్ష పెట్టి మరీ వీళ్లని జ్యూరీ హౌస్‌లోకి పంపింది. కానీ వీళ్ల తీరు, తల పొగరు చూసి ఆడియన్స్ చికాకు పడుతున్నారు. అందుకే వీకెండ్ ఎపిసోడ్స్‌లో వీళ్లని హోస్ట్ నాగార్జున గట్టిగానే ఉతికారు. అయినా కానీ వీళ్ల పద్ధతి మారకపోవడం మరో ఎత్తు. లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో ప్రియ, దమ్ము శ్రీజ మరోసారి రెచ్చిపోయారు. కాగా.. ఈ ప్రోమోపై లుక్కేద్దాం.

- Advertisement -

Read Also: Bigg boss Today promo: నడుము గిల్లద్దు.. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.. హీరోయిన్ పై కమెడియన్ కంప్లైంట్

రెక్లెస్ గా శ్రీజ ఆన్సర్..

ప్లీజ్ టేక్ ఏ నోట్ ఆఫ్ దిస్.. అంటూ కెప్టెన్ సంజన ఏదో చెబుతుంటే శ్రీజ రెక్లెస్‌గా ఆన్సర్ ఇచ్చింది. నో కెప్టెన్ తిన్నగా లేకపోతే మేము వినం.. అంటూ శ్రీజ చెప్పింది. దీంతో దొంగతనం జరిగితే జరగనీ అట్లా మెయింటైన్ చేద్దాం.. అని సంజన చెప్పగానే ప్రియ కూడా వాయిస్ రెయిజ్ చేసింది. ఓహో ఎవరూ దొంగతనం చేయకండి.. మేడమ్ తెచ్చి ఇస్తారు ఫుడ్.. అంటూ చులకనగా మాట్లాడింది. మరోవైపు రాము రాథోడ్ దగ్గర కూర్చొని తన బాధలు చెప్పుకున్నాడు హరిత హరీష్. కొంతమంది నిజంగా మంచోళ్లు ఉంటారు.. కొంతమంది మంచోళ్లలా నటిస్తుంటారు.. భరణి అక్కడికెళ్లి సంజన దగ్గర ఓవర్ స్మార్ట్‌గా టాపిక్ నా వైపు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.. అంటూ రాముతో చెప్పాడు. ఇంతలో హరీష్ కోసం శ్రీజ ఫుడ్ తీసుకొని వచ్చింది. టూ డేస్ నుంచి ఏం తినలేదు.. ఏం తినకపోతే నీరసం వస్తుంది.. అని శ్రీజ చెప్పింది. నేనిక తినను ఇంకొన్ని రోజుల వరకు ఏం తినను.. వాటర్ కూడా తాగాను.. మీలాంటోళ్ల మధ్యలో ఉండాలనుకోవట్లేదు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయేవరకూ నేను ఏం తినను తాగను.. అంటూ పట్టుబట్టాడు హరీష్.

Read Also: Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్ లో ఆరుగురు.. హీరోయిన్ కే అత్యధికంగా ఓట్లు..!

కామనర్ల డిస్కర్షన్…

మరోవైపు కామనర్లు ప్రియ, డీమన్ పవన్, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్‌తో సంజన మాట్లాడటానికి డిస్కషన్ పెట్టింది. అక్కడ మనీష్‌పై ఫైర్ అయింది శ్రీజ. నీకు పనిలేదు కాబట్టి వేరే వాళ్ల పని దోచుకొని నువ్వు పెట్టుకుందామనుకుంటున్నావే కానీ.. అంటూ శ్రీజ చెప్పింది. దీనికి నీ పనే ప్రతిసారి అరవడం కదా.. అంటూ మనీష్ రెస్పాండ్ అయ్యాడు. దీంతో అందుకే పాయింట్ ఔట్ చేసేస్తున్నారని కార్నర్‌కి వెళ్లి ఏడవటం నీ పని.. అంటూ శ్రీజ ఫైర్ అయింది. ఇక ఓనర్స్ ఫ్రూట్స్ ఇచ్చుకుంటారు.. మిగిలినవాళ్లు స్టాక్ చెక్ చేసుకుంటారు.. నేను వెళ్లి నిలబడి చూడాలా.. అంటూ ప్రియ పాయింట్ లేవనెత్తింది. ఇక వీళ్ల గొడవ తట్టుకోలేక ఇమ్మానుయేల్ దగ్గరికెళ్లి ఎమోషనల్ అయ్యాడు మనీష్. సెల్ఫిష్ రూథ్‌లెస్ ఇడియట్స్ అన్నా.. కామనర్స్ కామనర్స్ అన్న దానికి వీళ్లొక గలీజ్ మార్క్.. వరస్ట్ కామనర్స్ అన్నా వరస్ట్ కామనర్స్.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad