Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss New Promo: మొహానికి పెయింట్ పూసి.. హీటెక్కించేలా నామినేషన్స్..!

Bigg Boss New Promo: మొహానికి పెయింట్ పూసి.. హీటెక్కించేలా నామినేషన్స్..!

Bigg Boss New Promo: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 తొలి వారం సోసోగా సాగింది. కాగా.. రెండో వారం నామినేషన్స్‌ మొదలైపోయాయి. మొదటివారం పెద్దగా ఫైర్ లేకపోయినా ఈ వారం నామినేషన్స్ మాత్రం నా సామిరంగా అనేట్టుగా ఉన్నాయి. మీరు ఈ బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటానికి అర్హత లేదని భావించిన ఇద్దరు సభ్యులను తగిన కారణాలు స్పష్టంగా చెప్పి నామినేట్ చేసి వారి ముఖానికి రెడ్ పెయింట్‌ని పూయాల్సి ఉంటుంది.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ముందుగా తనూజ గౌడ.. హరిత హరీష్‌ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. మీరు ఆ రోజు చేయి చూపించి బిహేవియర్, నెక్స్ట్ టైమ్ చూజ్ చేసుకునేటప్పుడు అది చేయండి ఇది చేయండని మీరు చాలా మాట్లాడేశారు.. అది నాకు చాలా అంటే చాలా హర్ట్ అయింది.. ఎవరో నామినేషన్‌ని తీసుకొని నువ్వు ఇలా ఇలా అంటూ నాపై ఫైర్ అయ్యారు అని తనూజ అంటుంటే నువ్వు అనలేదండి మీరు అన్నాను.. అంటూ హరీష్ మధ్యలో మాట్లాడాడు. నువ్వు అనే అన్నారు.. అంటూ తనూజ మళ్లీ రెచ్చిపోయింది. అలానే ఇక్కడ ముగ్గురితో మాట్లాడాలనుకోవట్లేదు.. అంటూ మీరు మాట్లాడారు అదేనా ఆడవారిపై మీకున్న గౌరవం అంటూ తనూజ అడిగింది. మీరు చాలా పొరపాటు పడ్డారు.. అని హరీష్ అంటుంటే పొరపాటు ఏంటో ఒకసారి చెప్పండి.. అని తనూజ అడిగింది. మీరు వాయిస్ రెయిజ్ చేయండి కానీ అరవద్దు.. అంటూ హరీష్ కామెంట్ చేశాడు.

- Advertisement -

Read Also: Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్ లో ఆరుగురు.. హీరోయిన్ కే అత్యధికంగా ఓట్లు..!

శాడిజం ఎక్కడిదో అర్థం కాలేదు..

ఇక తన రెండో నామినేషన్‌గా ఫ్లోరా సైనిని సెలక్ట్ చేసింది తనూజ. ఒక షాంపూ బాటిల్‌కి మాయిస్చరైజర్, కండీషనర్ మిక్స్ చేసేసి పెట్టేయడం ఈ శాడిజం ఎక్కడిదని నాకు అర్థం కాలేదు.. అంటూ తనూజ అడిగింది. అయితే షాంపు, కండీషనర్ ఇష్యూ మీది కాదు.. అలానే ఫ్రీ బర్డ్ ఇష్యూ కూడా మీది కాదు.. అంటూ ఫ్లోరా కూల్‌గా ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత మనీష్ మొదటిగా భరణిని నామినేట్ చేశాడు. ఎగ్ తీసుకున్న సంగతి ప్రతి ఒక్క విషయం మీకు తెలుసు సార్‌కి.. ఎగ్ గురించే ఫైటింగ్ అవుతుంది.. ఎగ్ వదిలేసి ఛాయ్ మీదకి డైవర్ట్ చేశారు సార్ మేటర్.. అంటూ మనీష్ రీజన్స్ చెప్పాడు.

Read Also: Bigg Boss Day 8 Promo:  తిండిమానేసిన గుండు అంకుల్.. కన్నీళ్లు పెట్టుకున్న మనీష్.. కెప్టెన్ మాటవినని కామనర్స్

తర్వాత తన రెండో నామినేషన్‌గా రీతూ చౌదరిని మనీష్ సెలక్ట్ చేశాడు. మీరు ఇంటికి పర్మిషన్ అడిగి రావాలి మీరు అది బ్రేక్ చేశారా లేదా.. అంటూ మనీష్ కొశ్చన్ చేశాడు. మీతో ఆడుకునేటప్పుడు నేను లోపలికి వచ్చాను కానీ నేను ఒక్కదాన్నే సెపరేట్‌గా మీ ఇంట్లో తిరగలేదు కదా.. అని రీతూ చౌదరి జవాబిచ్చింది. దీనికి ఇంకా అరవండి.. అంటూ మనీష్ రెచ్చగొట్టాడు. దీంతో నా గొంతు నా ఇష్టం.. నేను అరుచుకుంటాను.. అంటూ రీతూ చౌదరి గట్టిగానే అరిచింది. ఇలా నామినేషన్స్ ప్రోమో అయితే హీటు పుట్టించేలా ఉంది. బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం నామినేషన్స్‌లో సీరియల్ నటుడు భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, హరీష్ హరిత, డీమోన్ పవన్, ప్రియా శెట్టి ఆరుగురు ఉన్నట్లు సమాచారం. ఈ ఆరుగురిలో ఫ్లోరా సైనీకి అత్యధికంగా నామినేషన్స్ ఓట్లు పడినట్లు పలువురు రివ్యూవర్స్ చెప్పారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది వారి వారంతపు పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad