Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9BB Nominations: నామినేషన్స్ లో రచ్చ.. ఆరుగురు నామినేట్..?

BB Nominations: నామినేషన్స్ లో రచ్చ.. ఆరుగురు నామినేట్..?

BB Nominations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదో వారం నామినేషన్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ప్రతి వారం ఒక కొత్త డ్రామా, కొత్త విభేదాలు చూసే ప్రేక్షకులకు ఈ వారం నామినేషన్లు మరింత హై ఓల్టెజ్ ఇచ్చాయి. గత వారం డబుల్ ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లు షాక్ అవ్వగా, ఈసారి ఎవరు నామినేట్ అవుతారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉంటారన్న ఆసక్తి హౌస్ లోనూ, ఆడియన్స్ లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ బిగ్ బాస్ 9 తెలుగులో పదోవారం నామినేషన్స్ ప్రక్రియ ఎలా సాగింది. ఈ నామినేషన్స్ పర్వంలో ఎవరు నామినేట్ అయ్యారో అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

నామినేషన్స్ అంటేనే హీట్..

సాధారణంగా బిగ్ బాస్ లో నామినేషన్లు రాగానే హౌస్ లో హీట్ పెరిగిపోతుంది. అప్పటివరకు ఫ్రెండ్స్‌లా కనిపించే వారే, వెనకనుంచి వెన్నుపోటు పొడుస్తారు. చిన్న చిన్న కారణాలతో నామినేట్ చేసే సన్నివేశాలు మామూలే కానీ, ఈసారి నామినేషన్ల తీరు మాత్రం భిన్నంగా సాగింది. ఈ వారం నామినేషన్ల కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కేవలం ఐదు నిమిషాల సమయం ఇచ్చి “మీరు నామినేట్ చేయాలనుకున్న ఒక్కరిని బలమైన కారణంతో నామినేట్ చేసి, బురద నీటిలో నిలబెట్టండి” అని సడన్ టాస్క్ ప్రకటించాడు. దీంతో హౌస్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Read Also: Bigg Buzz:  బిగ్ బాస్ హౌస్ బస్సా? కోట్ల మంది కల.. రాముపై ఫైర్..!

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?
ఈ నామినేషన్స్ అన్నింటిలో దివ్యని భరణి నామినేట్ చేయడం హైలెట్ అయింది. సీజన్‌లో ఇప్పటివరకూ దివ్యని భరణి ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు. దీంత ఇద్దరి మధ్య పెద్ద వాదనే జరిగినట్లు తెలుస్తుంది. ఇలా ఎవరు ఎవరిని నామినేట్ చేశారో చూద్దాం. దివ్యని భరణి, రీతూ నామినేట్ చేశారు. గౌరవ్‌ని డీమాన్, తనూజ, దివ్య నామినేట్ చేశారు.నిఖిల్‌ని కళ్యాణ్, సుమన్ నామినేట్ చేయగా.. రీతూని నిఖిల్ నామినేట్ చేశాడు. ఇక, సంజనని గౌరవ్ నామినేట్ చేశాడు.

Read Also: Saturn: ఆ రాశి వారికి ఏలినాటి శని రెండో దశ.. ముప్పు తప్పేలా లేదు!

గౌరవ్ కే నామినేషన్స్ ఎక్కువ..

ఓవరాల్‌గా చూసుకుంటే అందరికంటే గౌరవ్‌కే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. మొత్తం ముగ్గురు సభ్యులు గౌరవ్‌ని నామినేట్ చేశారు. తర్వాత దివ్య, నిఖిల్‌ ఇద్దరికీ చెరో రెండు నామినేషన్స్ వచ్చాయి. ఇక నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే గౌరవ్-నిఖిల్ ఇద్దరికీ ఈ వారం టఫ్‌గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మిగిలిన నలుగురికి ఇప్పటికే నామినేషన్స్‌కి వెళ్లిన అనుభవం ఉంది. అలానే వారికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కనుక ఈ వారం గౌరవ్-నిఖిల్‌లో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలా కాకుండా ఈ వారం వీరిద్దరూ ఆటలో ఏమైనా అద్భుతం చేస్తే మాత్రం పరిస్థితులు మారొచ్చు. వైల్డ్‌కార్డ్స్‌గా హౌస్‌లోకి వచ్చిన వాళ్లలో ప్రస్తుతం గౌరవ్-నిఖిల్ మాత్రమే మిగిలారు. మిగిలినవాళ్లంతా టపాటపా ఎలిమినేషన్‌కి క్యూ కట్టారు. అయేషా ఆరోగ్యం బాలేక మధ్యలోనే హౌస్ నుంచి ట్రీట్‌మెంట్ కోసం ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad