Sunday, November 16, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss: నీ ఇంటి నెంబర్ తో సహా తెలుసు.. దమ్ముకు దువ్వాడ వార్నింగ్..!

Bigg Boss: నీ ఇంటి నెంబర్ తో సహా తెలుసు.. దమ్ముకు దువ్వాడ వార్నింగ్..!

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఆట ఇప్పుడు మొదలైంది. వైల్డ్ కార్డుల ఎంట్రీ తర్వాత.. ఇదివరకే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి దమ్ము శ్రీజ, భరణి రీఎంట్రీ ఇచ్చింది. అయితే, వీరిద్దరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఇద్దరికి పెట్టిన టాస్కులలో భరణికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, శ్రీజకు, దివ్వెల మాధురికి మధ్య గొడవ ఇప్పట్లో తెగేలా లేదు. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ లో ఫైర్ బ్రాండ్ లా అడుగుపెట్టింది దివ్వెల మాధురి. ఇంట్లోకి అడుగుపెట్టడంతోనే దమ్ము శ్రీజతో ఓ రేంజ్ లో గొడవ పెట్టుకుంది. పేరు తెలియదు అని చెప్పినందుకు నా పేరు తెలియదా అంటూ నానా హంగామా చేసింది. ఇక ఇటీవల నామినేషన్స్ కోసం రీఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ.. మాధురికి తన స్టైల్లో కౌంటరిచ్చింది. దువ్వాడ మాధురి ఎవరో నీకు తెలియకపోతే.. బయటకు వెళ్లి అడుగు అని అన్నారు.. వెళ్లి అడిగాను.. మాధురి అంటే ఎవరో తెలియదు అంటున్నారు. నాకే కాదు.. బయటచాలామందికి తెలియదు. అంటూ పంచ్ ఇచ్చింది. ఇక ఈ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు.

- Advertisement -

Read Also: Surya Kumar Yadav: అరుదైన రికార్డు.. హిట్ మ్యాన్ సరసన సూర్యా భాయ్

నీ గురించి మొత్తం తెలుసు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఆ అమ్మాయి పేరు దమ్ము శ్రీజ అనుకుంటా.. ఆమెను మాధురి ఎలిమినేట్ చేయలేదు. హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్ంట్స్ ఆమెను ఎలిమినేట్ చేశారు. మాధురి ఎవరో తెలియదు అని చెప్పినందుకు ఆమెను బయటకు పంపించలేదు. చిన్న పిల్లలను మాధురి అంతగా పట్టించుకోదు. శ్రీజది వైజాగ్. ఆమె ఇంటి డోర్ నంబర్ తో సహా నాకు తెలుసు.. వాళ్ల నాన్న కూడా నాకు తెలుసు. వాళ్ల గురించి మొత్తం నాకు తెలుసు.. తెలియకపోతే అడిగే పద్దతి ఉంటుంది. మీరు నాకు పరిచయం లేదు. మీ గురించి పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడగాలి. మాధురి రాగానే అక్కడున్నవాళ్లంతా పవర్ బ్యాంక్ వచ్చిందని అన్నారు” అని చెప్పుకొచ్చారు.

Read Also: IND vs AUS: స్కై సూపర్ సిక్సర్.. టీ20ల్లో 150వ సిక్స్‌ కొట్టిన విధ్వంసకర బ్యాటర్

తనదైన మార్క్ చూపిస్తుంది

అంతేకాకుండా దువ్వాడ దివ్వెలను పొగిడేశారు. “మాధురిని చూడగానే కొంతమందికి చెమటలు పట్టేశాయి. ఎలా మాట్లాడాలి.. ? ఎలా తట్టుకోవాలి ? అని అందరు హడలిపోతుంటే.. ఈమెకు మాత్రం పేరు తెలియదా.. ? అందరూ పలకరిస్తుంటే ఈమెకు పేరు అడగాలి అనిపించిందా.. ? మాధురిని నువ్వు ఎవరు అని అడిగితే క్రేజ్ పెరుగుతుంది. గుర్తింపు వస్తుందనే మాధురిని పేరు అడిగింది తప్పితే మనస్పూర్తిగా కాదు..శ్రీజ చాలా అహంకారంతో అడిగింది. అందుకే మాధురి నుంచి ఆన్సర్ అలా వచ్చింది. మాధురి బిగ్ బాస్ కు వెళ్లాలని అనుకోలేదు. అటు నుంచి ఒత్తిడి వచ్చింది. అందుకే వెళ్లింది. తన మార్క్ చూపిస్తుంది” అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad