Bigg Boss Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పటికే ఆరో వారం భరణి ఎలిమినేషన్ షాకింగ్ అంటే.. ఈసారి అంతకుమించిన దారుణమైన ఎలిమినేషన్ జరిగింది. ఈవారంలో డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా.. మిడ్ వీక్‌లో రాము రాథోడ్‌ని ఎలిమినేట్ చేయబోతున్నారు. అయితే ఐదోవారం దమ్ము శ్రీజని కనీసం ఆమె జర్నీ వీడియో కూడా ప్లే చేయకుండా ఎంత అవమానకరంగా బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించి వేశారో.. ఇప్పుడు రాము రాథోడ్‌ని అంతకంటే దారుణంగా హౌస్ నుంచి పంపిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి అమర్ దీప్, అంబటి అర్జున్‌లు బలవంతంగా రాము రాథోడ్‌ని హౌస్ నుంచి ఈడ్చుకుని వస్తున్నారు. దీంతో రాము రాథోడ్ మాత్రమే కాదు.. హౌస్‌లో ఉన్న వాళ్లందరూ షాక్ అయిపోయారు. వాళ్లేదో సరదాగా అంటున్నారని.. హౌస్‌లో ఉన్న వాళ్లు జోక్‌లు వేసుకుంటుండగా.. ఇంతలో బిగ్ బాస్ డోర్లు ఓపెన్ అయ్యాయి.
Read Also: Bigg Boss Updates: సంజనా- దివ్య మధ్య “చెత్త” గొడవ?
దారుణంగా లాక్కెళ్లిన..
దాంతో.. ‘ఇక్కడ ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చివరి మాటలు చెప్పేసుకో.. పోదాం బయటకు అని రాము రాథోడ్‌ని అమర్ దీప్, అర్జున్ అంబడి లాక్కుంటూ వెళ్తున్నారు. ఏంటి అన్నా ఇదీ..? నిజమా? ఏదైనా టాస్క్‌నా? అని రాముతో పాటు.. హౌస్‌లో ఉన్న వాళ్లంతా అడిగారు. నిజంగానే మనం ఏం చేయలేం.. నో ఎమోషన్స్.. నో ఫీలింగ్స్.. మాకు ఇచ్చిన టాస్క్ ఇది. బై బై అంటూ రాము రాథోడ్‌ని లాక్కుని మరీ వెళ్లారు. అన్నా.. అన్నా ప్లీజ్ అన్నా.. వన్ మినిట్ అన్నా.. ఇది టాస్క్ కాదా? నిజంగానే ఎలిమినేట్ చేస్తున్నారా? అని రాము రాథోడ్ ప్రాధేయపడ్డాడు. నిజంరా.. నిన్ను ఎలిమినేట్ చేసి బయటకు తీసుకుని రావడమే మాకు ఇచ్చిన టాస్క్.. ఇక నీ టాస్క్ కంప్లీట్ అయ్యింది పదా’ అంటూ రాము రాథోడ్‌ని బయటకు తీసుకుని వస్తున్నారు.
Read Also: Bigg Boss Updates: బిగ్ బాస్ లో ప్రేమ జంట బ్రేకప్.. అంతలోనే ప్యాచప్
ఓటింగ్ పరంగా లీడ్ లోనే రాము..
ఇకపోతే, ఓటింగ్ పరంగా చూస్తే రాము రాథోడ్ మాత్రం లీస్ట్ లో లేడు. బెటర్ పొజిషన్‌లోనే ఉన్నాడు. రమ్య, దివ్య, శ్రీనివాస్ సాయిల కంటే రాము రాథోడ్‌కి మంచి ఓటింగ్ పడింది. కానీ.. రాముని ఏ బేసిస్ పైన ఎలిమినేట్ చేస్తున్నారనేది మాత్రం తెలియడం లేదు. ఇక, డబుల్ ఎలిమినేషన్‌కి అయితే బలమైన కారణమే ఉంది. ఇప్పటి వరకు ఆరు వారాల ఆట ముగిసింది. ఇక తొమ్మిది వారాలు మాత్రమే మిగిలింది. కానీ హౌస్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. టాప్ 5 కంటెస్టెంట్స్‌ని తీసేస్తే.. మిగిలిన వారాల్లో డబుల్ ఎలిమినేషన్ అనేది మస్ట్. పైగా వచ్చేవారంలో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా రాబోతున్నారు. కాబట్టి… డబుల్ ఎలిమినేషన్ చేయడం తప్పదు.


