Bigg Boss Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ఎనిమిదోవారం ఎలిమినేషన్‌లో సూపర్ ట్విస్ట్ ఉండబోతుంది. ఈవారంలో మొత్తం 8 మంది నామినేషన్స్‌లో ఉండగా.. దువ్వాడ మాధురి, గౌరవ్ ఈ ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వైల్డ్ కార్ద్ ద్వారా హౌస్‌లోకి వచ్చిన ఈ ఇద్దరూ తొలిసారిగా నామినేషన్స్‌లోకి వచ్చారు. అటు దివ్వెల తరఫున దువ్వాడ ఓట్ల కోసం ఆడియన్స్ ను రిక్వెస్ట్ చేస్తే.. ఇటు గౌరవ్ పీఆర్ కూడా తీవ్రంగానే కష్టపడుతోంది. అయితే ప్రతి వారం ఎలిమినేషన్‌ని డిసైడ్ చేసేది కేవలం ఓటింగ్ మాత్రమేకాదు.. స్పెషల్ పవర్స్ కూడా ఓటింగ్‌ని డామినేట్ చేయబోతుండగా.. ఈవారం ఎలిమినేషన్ తనూజ చేతుల్లో ఉంది.
Read Also: Fingerprint technology: మరణించిన వ్యక్తి ఫింగర్ ప్రింట్ తో ఫోన్ అన్ లాక్ ఎలా చేయొచ్చు
లీస్ట్ లో మాధురి, గౌరవ్..
కాగా.. తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చిన దివ్వెల మాధురి, గౌరవ్.. ఈ ఇద్దరూ లీస్ట్ ఓటింగ్‌లో ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన దివ్వెల మాధురి ఈ ఎనిమిదో వారంలో ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే ఈవారంలో కూడా ఎలిమినేన్ ట్విస్ట్ ఉండబోతుంది. ఓటింగ్ ప్రకారం అయితే దివ్వెల మాధురి ఎలిమినేట్ అవుతుందనేది ఫిక్స్. బట్.. ఇక్కడ ఈవారం ఎలిమినేషన్‌ని డిసైడ్ చేసేది ఓటర్లు మాత్రమే కాదు.. హౌస్‌లో ఉన్న తనూజ. అవును ఆమె దగ్గర.. గోల్డెన్ పవర్ ఉంది. ఈ పవర్‌ని ఉపయోగించి.. లీస్ట్ ఓటింగ్‌లో ఉన్న ఒకర్ని కాపాడవచ్చు. గతంలో భరణి.. ఎలిమినేషన్ అప్పుడు కూడా.. ఇలాగే చేశారు. ఇమ్మానుయేల్ తన పవర్‌ని ఉపయోగించి.. రాముని సేవ్ చేశాడు. ఇప్పుడు అదే తరహాలో తనూజకి సూపర్ పవర్ ఉండబోతుంది.
Read Also: Pro Kabaddi: పల్టాన్ ను పల్టీ కొట్టించిన దబంగ్ దిల్లీ.. ప్రొకబడ్డీ టైటిల్ కైవసం
మాధురిని సేవ్ చేస్తే..
తన దగ్గర ఉన్న సూపర్ పవర్‌తో లీస్ట్ ఓటింగ్‌లో ఉన్న మాధురి, గౌరవ్‌లలో ఒకర్ని సేవ్ చేసి.. మిగిలిన వాళ్లని ఎలిమినేట్ చేయొచ్చు. ఆ తరువాత ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేషన్ అనేది చెప్పొచ్చు కానీ.. తనూజ సూపర్ పవర్‌తో ఎవర్నైతే సేవ్ చేసిందో వాళ్లే హౌస్‌లో ఉంటారు. మిగిలిన వాళ్లు ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ మరో ఛాన్స్ కూడా ఉంటుంది. తనూజ.. తన సూపర్ పవర్‌తో ఒకర్ని సేవ్ చేసింది కాబట్టి.. నో ఎలిమినేషన్ అని కూడా పెట్టొచ్చు. కానీ ఎక్కువ శాతం ఎలిమినేషన్‌కే ఛాన్స్ఉంది. నో ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. కెప్టెన్సీ టాస్క్‌లో కూడా.. తనూజకి బాగా సపోర్ట్ చేసింది మాధురి. నిన్నటి ఎపిసోడ్‌లో కూడా.. ఇద్దరూ కలిసి బెడ్ షేర్ చేసుకునే బాడింగ్ వచ్చేసింది. కాబట్టి.. తనూజ మాధురికే జై కొట్టొచ్చు.


