Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ సీజన్-9లో మరోసారి ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. హౌస్ లో 9వ కెప్టెన్ అయ్యేందుకు ఆరుగురు కంటెండర్లు పోటీపడ్డారు. దివ్య, సుమన్ శెట్టి, తనూజ్, రీతూ, ఇమ్మాన్యుయేల్, భరణి ఈ వారంలో పోటీదారులుగా ఉన్నారు. బిగ్‌బాస్ వారికి ‘వే టూ కెప్టెన్సీ’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో కంటెండర్లు ట్రైన్ ఇంజిన్‌లోకి ఎక్కి ముందుగా చేరుకోవాలి. అందులో విజయం సాధించిన వారికి ఒకరిని రేసు నుండి తప్పించే అవకాశం లభిస్తుంది.
Read Also: Bigg Boss Updates: భరణి బలి.. తనూజ ఏడుపే ఏడుపు
భరణి ఔట్
అయితే, మొదట భరణి రేసు నుంచి ఔట్ అయ్యాడు. తర్వాత సాయి ఇంజిన్‌లోకి ఎక్కి దివ్యను రేసు నుండి ఔట్ చేశాడు. అప్పుడు దివ్య కోపంతో పెద్ద గొడవ చేసింది, ఎందుకంటే సాయి ముందు రీతూని పిలిచాడు. కానీ, రీతూ బతిమాలే సరికి, చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుని దివ్యను ఔట్ చేశాడు. వెంటనే, సుమన్ శెట్టి రేసులో తర్వాత ఔట్ అయ్యాడు. ఆ తర్వాత, ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ ముగ్గురు రేసులో మిగిలారు. ముగ్గురిలో తనూజ, రీతూ ఎప్పుడూ కెప్టెన్ కాలేదు. ఇమ్మాన్యుయేల్ ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయ్యాడు, కానీ ఆ సమయంలో కెప్టెన్ ఎవరనే నిర్ణయాలు దివ్య చేతిలోకి వెళ్లాయి. దీంతో, దివ్య మరోసారి తనూజను రేసు నుంచి తప్పించి ఆమెకు షాక్ ఇచ్చింది.
తనూజకు మళ్లీ నిరాశే
చాలా వారాలుగా తనూజ కెప్టెన్సీ కోసం ప్రయత్నిస్తోంది, కానీ లాస్ట్ మినిట్ లో ఆమె రేసు నుంచి ఔట్ అవుతోంది. ఇక, ఈ వారం కెప్టెన్సీలో చివరిగా రీతూ, ఇమ్మాన్యుయేల్ మిగిలారు. అయితే, ఇమ్మాన్యుయేల్ మరోసారి ఎలా కెప్టెన్ అయ్యాడనే వివరాలు తెలియాలి. ఇకపోతే,. బిగ్‌బాస్ ఈ వారం సీక్రెట్ టాస్కులు, రెబల్స్ గేమ్స్ ద్వారా హడావిడి సృష్టించాడు. సుమన్ శెట్టి, దివ్య సీక్రెట్ టాస్కులు విజయవంతంగా పూర్తి చేసి కంటెండర్లుగా నిలిచారు. మరో రెబల్ రీతూ కూడా కంటెండర్ అయ్యింది. కెప్టెన్సీ టాస్క్‌లో స్ట్రాటజీతో ఆడి ఇమ్మాన్యుయేల్ చివరికి కెప్టెన్ గా నిలిచాడు. సీజన్ 9లో ఇప్పటివరకూ ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ మాత్రమే రెండు సార్లు కెప్టెన్ అయ్యారు.
Read Also: Mohammed Shami: రిటైర్మెంట్ బాటలో టీమిండియా స్టార్ ప్లేయర్..?
ఎలిమినేషన్ పై ఫోకస్..
ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారో అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఓటింగ్ ట్రెండింగ్ ని పరిశీలిస్తే, సాయి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, నామినేషన్స్ లో ఉన్న సాయి తప్ప మిగిలిన వారంతా మొదటి నుంచి హౌస్ లో ఉన్నవారే. సాయి ఒక్కడు మాత్రమే, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. దీంతో, అతడు హౌస్ నుంచి వెళ్లడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మరి, బిగ్ బాస్ అతడ్నే పంపిస్తాడో లేదంటే ఎలిమినేషన్ ఎత్తేస్తాడో మాత్రం తెలియాల్సి ఉంది.


