Bigg Boss remuneration: బిగ్ బాస్ 9 తెలుగు రెండో వారం నామినేషన్స్ తర్వాత హీటెక్కింది. కాగా.. ఏడుగురు కంటెస్టంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. ఇప్పటికే కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఈసారి సాధారణ వ్యక్తులు కూడా హౌస్ లోకి వెళ్లడంతో వాళ్ల రెమ్యునరేషన్లపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈసారి అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్ గా టీవీ స్టార్ భరణి నిలిచాడు. బిగ్ బాస్ 9 తెలుగులో ఈసారి పెద్దగా పేరున్న వాళ్లు రాలేదు. దీంతో గత సీజన్ కంటే ఈసారి మరింత దారుణంగా షో ఫ్లాపవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆడియెన్స్ ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే ఉన్న వాళ్లలోనూ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ విషయానికి వస్తే అతని పేరు భరణి శంకర్. అతను వారానికి రూ.4 లక్షలు అందుకుంటున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. భరణికి పర్సనల్ లైఫ్, రిలేషన్‌షిప్స్ విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. అంతేకాకుండా, పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేశాడు.
Read Also: Samantha Interview: నటిగానే ఉండిపోను.. ఆ సమస్యతో పోలిస్తే అన్నీ చిన్నవే సమంత
భరణి గేమ్ ఇలా..
బిగ్ బాస్ హౌస్ లో భరణి చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఉంటున్నాడు. అతని గేమ్ అందరికీ నచ్చుతోంది. ఆ మధ్య హరిత హరీష్‌తో అతడు గొడవపడడం, వాళ్ళ మధ్య వాగ్వాదం జరగడం చూసి అందరూ షాక్ అయ్యారు. భరణి ఇంతకుముందు కొన్ని మంచి రోల్స్ చేశాడు. కానీ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడీ బిగ్ బాస్ ద్వారా మళ్లీ గాడిలో పడాలని భరణి భావిస్తున్నాడు. తొలి వారమే నామినేట్ అయినా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. మరి ఈ అవకాశాన్ని అతడు ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
మిగతా కంటెస్టంట్లు..
బిగ్ బాస్ 9 తెలుగు రెమ్యునరేషన్లు బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. భరణి తర్వాత ఆ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బాగానే పేరు సంపాదించిన ఆశా సైనీ. ఆమెకు వారానికి రూ.3 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం. ఇక సంజన గల్రానీకి వారానికి రూ.2.75 లక్షలు ఇస్తున్నట్లు తెలిసింది. బిగ్ బాస్ బ్యూటీ రీతూ చౌదరి కూడా ఎక్కువగానే అందుకుంటోంది. ఈ హాట్ భామకు వారానికి రూ.2.75 లక్షలు ఇస్తున్నారని టాక్. సీనియర్ కమెడియన్ సునీల్ శెట్టికి వారానికి రూ.2.5 లక్షలు అందుతున్నాయని సమాచారం. జబర్దస్త్ తో పాపులర్ అయిన ఇమ్మాన్యుయేల్ కు వారానికి రూ.2.25 లక్షలు ఇస్తున్నారని తెలిసింది. ఫోక్ సింగర్ కమ్ డ్యాన్సర్ రాము రాథోడ్ కు వారానికి రూ.2 లక్షలు అందుతున్నాయని టాక్. ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్షతో హౌస్ లోకి ఎంటరైన కామనర్స్ దమ్ము శ్రీజ, పడాల కల్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, ప్రియ, డీమాన్ పవన్ భారీ మొత్తంలో దక్కించుకుంటున్నారట. వీళ్లకు వారానికి రూ.70 వేల వరకు ఇస్తున్నారని సమాచారం.
Read Also: China Masters: చైనా మాస్టర్స్ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన పీవీ సింధు


