Bigg Boss Captain Kalyan: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో గత నాలుగు రోజులుగా హౌస్‌లోకి ఎక్స్ కంటెస్టెంట్లు వస్తున్నారు. వాళ్లు వచ్చి ఈ టాస్కులు కండెక్ట్ చేశారు. వారిపైన గెలిచిన వారు కంటెండర్లు అయ్యారు. అలా మొత్తం ఆరుగురు కంటెండర్లుగా నిలిచారు. కళ్యాణ్, డీమాన్, ఇమ్మానుయేల్, దివ్య, సంజన, రీతూ.. కంటెండర్లు కాగా తనూజ, సుమన్ శెట్టి, భరణిలు ఓడిపోయారు. ఇక ఈ ఆరుగురిలో కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు బిగ్‌బాస్ ఓ టాస్కు పెట్టాడు. అయితే రేసులో ఉన్న ఆరుగురికి టాస్క్ పెట్టకుండా కంటెండర్లు కాకపోయిన తనూజ, భరణి, సుమన్ శెట్టిలకి ఈ టాస్కు పెట్టాడు. బజర్ మోగగానే ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా కత్తిని పట్టుకుంటే వారికి ఆ రౌండ్‌లో ఛాన్స్ దక్కుతుంది. తాము కెప్టెన్‌గా చూడాలనుకుంటున్న వారికి వీరు ఆ కత్తిని అందిస్తారు. ఆ కత్తి తీసుకున్న కంటెండర్ తమకి పోటీగా ఉన్న వారిని లేదా కెప్టెన్‌గా చూడాలనుకోవడం లేని వ్యక్తికి పొడిచి రేసు నుంచి తప్పించాలి. అలా ముందుగా సుమన్ శెట్టి కత్తి అందుకొని రీతూకి ఇచ్చాడు. ఇక రీతూ ఊహించినట్లే సంజనని పొడిచింది. మీరు గేమ్ గురించి కాకుండా పర్సనల్ విషయాల గురించి మాట్లాడి.. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూశారంటూ రీతూ చెప్పింది. దీనికి మరోసారి సంజన ఫైర్ అయింది.
Read Also: Ghee: ఉదయాన్నే వేడినీటిలో దీన్ని మిక్స్ చేసి తాగితే
సంజనా వైల్డ్ ఆన్సర్..
ఇక్కడ ఎవరికీ పర్సనల్స్ ఏం ఉండవ్.. ఇదంతా గేమ్‌యే అంటూ రీతూకి సంజన దీటుగా జవాబిచ్చింది. ఆ తర్వాత భరణి.. డీమాన్ చేతికి కత్తి ఇచ్చాడు. దీంతో డీమాన్.. నేరుగా ఇమ్మానుయేల్‌ని పొడిచాడు. నేను అడిగినప్పుడు నువ్వు నాకు సాయం చేయలేకపోయావ్ అంటూ మొన్న నామినేషన్స్ పాయింట్‌యే చెప్పాడు డీమాన్. ఈ మాటకి ఇమ్మూకి కాలింది. నేను ఏడిస్తే ఏడుపొస్తుంది.. నవ్వితే నవ్వొస్తుంది అంటూ ఇక సొల్లు చెప్పకు.. పాయింట్లు లేకపోతే నేను ఇష్టం లేదని చెప్పు.. అంతేకానీ ఇవన్నీ వద్దు అంటూ ఇమ్మూ ఫైర్ అయ్యారు. ఇక నుంచి నాతో ఇవన్నీ వద్దు అంటూ గట్టిగానే చెప్పాడు ఇమ్మూ. ఇలా మొత్తానికి అందరూ రేసు నుంచి తప్పుకోగా కళ్యాణ్ మిగిలాడు. దీంతో సీజన్-9 చివరి కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడన్నమాట.
Read Also: Healthy Fruits: ఈ పండ్లను డైలీ తింటే మలబద్ధకం దూరం
కళ్యాణ్, తనూజ మధ్యే కప్పు పోరు..
ఇకపోతే, బిగ్ బాస్ ఫైనల్స్ కళ్యాణ్, తనూజ మధ్యే కప్పు గురించి పోరు జరగుతున్నట్లు తెలుస్తోంది. సీరియల్ అభిమానులతో పాటు బిగ్ బాస్ ఫ్యాన్స్ తనూజకు ఓట్లు గుద్దుతున్నారు. కాగా.. ఫ్యామిలీ వీక్ నుంచి కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అతనికి కూడా ఫ్యాన్ బేస్ చాలానే ఫాం అయ్యింది. దీంతో, వీరిద్దరిలో కప్పు ఎవరికో ఒకరికి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి కప్పు కొట్టేదవరో మరికొన్ని రోజుల్లో తేలనుంది.

