Bigg Boss Telugu: బిగ్‌బాస్ షోలో వీకెండ్ ఎపిసోడ్ కు ఉన్న క్రేజ్ మరో ఎపిసోడ్ కు ఉండదు. నాగ్ వచ్చి కంటెస్టెంట్లందర్నీ వాయించి పడేస్తాడని.. అందరూ ఎదురుచూశారు. ఇకపోతే, ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లున్నారు. వీరిలో ఆరుగురు కొత్తగా వచ్చిన వైల్డ్‌కార్డ్స్ ఉన్నారు. వారిలో ఎక్కువ హైలైట్ అవుతుంది ఇద్దరే ఇద్దరు. ఒకరు మాధురి, మరొకరు ఆయేషా! అరుపులు, ఏడుపులు తప్ప ఏదీ కనిపించడం లేదంటూ తనూజను నామినేట్ చేసిన ఆయేషా.. వచ్చినప్పటినుంచి అరుస్తూనే కనిపించింది. నిన్న ఒక్క గేమ్ ఓడిపోయేసరికి బోరుమని ఏడ్చింది. ఇక, వాళ్లిద్దరి తాటతీస్తారని జనాలు ఫుల్ గా ఎక్ప్ పెక్ట్ చేశారు. అందుకు తగ్గట్లే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కింగ్ నాగార్జున అక్షింతలు వేస్తున్నాడు. కానీ, మాధురి విషయంలో మాత్రం అలా కాదు.. ఆమెను మహరాణి పీఠంపైనే కూర్చొబెట్టి.. వాయించేశాడు. దీనిపైనే ఇవాళ్టి ఎపిసోడ్ నడిచింది.
Read Also: Bigg Boss Updates: ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టిన సుమన్ శెట్టి.. క్లాప్స్ కొట్టిన లేడీస్
మాధురి గురించి..
ఆ తర్వాత వైల్డ్‌కార్డ్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్‌కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.
Read Also: Bigg Boss Updates: ఉతుక్కో.. ఆరబెట్టుకో.. నాకేం కర్మ.. కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన అయేషా
గొడవ గురించి..
నాగ్ మాట్లాడుతూ.. మాధురి.. హౌస్‌కు రెండో బిగ్‌బాస్‌లా ఫీలవుతోంది. అందరిపై ఆజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌తో ఓ గొడవ కూడా జరిగింది. ఆ గొడవలో తప్పెవరిది? అని కెప్టెన్ సుమన్‌ను అడిగాడు. అందుకు సుమన్ ఎక్కడా తడుముకోకుండా మాధురిదే తప్పని నాగార్జునతో చెప్పాడు. మాధురి.. పవన్ కల్యాణ్‌తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి.


