Monday, November 17, 2025
HomeTop StoriesBigg Boss Wildcards: బిగ్ బాస్ హౌస్ లో హ్యాండ్సమ్ హంక్స్.. స్పెషల్ పవర్స్‌తో నిఖిల్-గౌరవ్...

Bigg Boss Wildcards: బిగ్ బాస్ హౌస్ లో హ్యాండ్సమ్ హంక్స్.. స్పెషల్ పవర్స్‌తో నిఖిల్-గౌరవ్ ఎంట్రీ

Bigg Boss Wildcards: బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీలు వస్తాయన్నప్పట్నుంచి షో మరింత రసవత్తరంగా మారింది. కాగా.. వైల్డ్ కార్డులుగా సీరియల్ హీరోలు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలుగా వీళ్లిద్దరూ హౌస్‌లోకి వచ్చారు. నిఖిల్ నాయర్.. గృహలక్ష్మి, పలుకే బంగారుమాయెనా సీరియల్స్‌లో నటించాడు. ఇక గౌరవ్.. గీత LLB అనే సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్‌కి పరిచయమయ్యాడు. ఇక, వాళ్ల ఎంట్రీ ఎలా జరిగిందో, ఏ ఏ పవర్స్ నాగార్జున వాళ్లకు ఇచ్చాడో మరిన్ని వివరాలు చూద్దాం.

- Advertisement -

Read Also: Flora Saini Elimination:  ఎలిమినేషన్ ఒకరిది.. ఏడుపు ఇంకొకరిది.. ఫ్లోరా షైనీ ఎలిమినేషన్ ఎలా జరిగిందో తెలుసా?

వైల్డ్ కార్డు ఎంట్రీలుగా..

బిగ్‌బాస్ సీజన్-9లోకి వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష, అయేషా జీనత్‌, శ్రీనివాస్ సాయిలతో పాటు సీరియల్ హీరోలు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్‌కార్డ్ లిస్ట్‌గా ఐదో కంటెస్టెంట్‌గా నిఖిల్ నాయర్.. చివరి కంటెస్టెంట్‌గా గౌరవ్ వచ్చారు. ముందుగా స్టేజ్ మీదకి వచ్చిన నిఖిల్ నాయర్‌కి మోహన్ లాల్ వీడియోతో సర్‌ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. నిఖిల్‌కి పింక్ స్టోన్ ఇచ్చి హౌస్‌లోకి పంపించారు. దీని వల్ల కంటెండర్ పవర్ నిఖిల్‌కి దక్కింది. ఇది వాడి నువ్వు డైరెక్ట్‌గా కెప్టెన్సీ కంటెండర్ అవ్వొచ్చు.. అని నాగ్ చెప్పారు.

Read Also: Bigg Boss Ramya: పక్కా లోకల్ సాంగ్ తో పికిల్స్ పాప ఎంట్రీ..!

చివరి కంటెస్టెంట్ గా..

ఇక చివరి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లాడు గౌరవ్ గుప్తా. ఇతనకి తెలుగు కాస్త తక్కువగా వచ్చు. దీంతో మాట్లాడటానికి ఇబ్బంది పడ్డాడు. ఇక గౌరవ్‌కి బ్లెస్సింగ్ పవర్ ఇచ్చారు నాగ్. దీనితో హౌస్‌లో ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌ నుంచి సలహా అడిగి బయటపడే పవర్ అన్నమాట. హౌస్‌లోకి వెళ్లే ముందు కొంతమంది ఫొటోలు చూపించి ఫేవరెట్ ఎవరని నాగ్ అడిగారు. ఇందులో తనూజ పేరు చెప్పాడు గౌరవ్. దీంతో ఆ ఫొటో వెనకాల ఏ నంబర్ ఉంటే అన్ని పుషప్స్ చేయాలని నాగ్ చెప్పారు. తనూజ ఫొటో వెనుక 50 నంబర్ ఉండటంతో అన్ని పుషప్స్ చేసి మరీ హౌస్‌లోకి వెళ్లాడు గౌరవ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News