Bigg Boss Suman Shetty: బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం డిఫరెంట్ టాస్కులు జరిగాయి. డే 25 ఎపిసోడ్ లో హంగ్రీ హిప్పో అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో బాగా ఆకలితో ఉన్న ఒక హిప్పో బొమ్మను ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. దానికి ఆకలి వేసినప్పుడల్లా.. ఆ హిప్పో అరుస్తుంది. అదిరి అరవగానే.. హౌస్ లో వేరువేరు ప్లేస్ లో ఉన్న బాల్స్‌ను హిప్పో నోటిలో వేసి ఆహారంగా తినిపించాలి.. ఈ ఛాలెంజ్ ముగిసే సమయానికి ఏ టీమ్ సభ్యులైతే హిప్పో నోటిలో ఎక్కువ బాల్స్ వేస్తారో ఆ టీమ్ విన్ అయ్యినట్టు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. అలాగే విన్ అయిన టీమ్.. నచ్చిన ఒక పవర్ కార్డ్‌ని పొందుతారని అనౌన్స్ చేశాడు.ఈ ఛాలెంజ్ కు భరణిని సంచలక్ గా వ్యవహరించాడు.
మూడు టీమ్ లు
తనూజ, రీతూ, హరీష్ ముగ్గురూ బ్లూ టీమ్ లో ఉండగా.. సంజన, రాము, సుమన్ శెట్టి కలిపి యల్లో టీమ్, ఇమ్మూ, కళ్యాణ్, ఫ్లోరా ముగ్గురూ రెడ్ టీమ్. ఇక గ్రీన్ టీమ్ రేసు నుంచి తప్పుకొని పక్కన కూర్చుంది. ఈ ఛాలెంజ్ లో ఇమ్మూ, కళ్యాణ్ టీమ్ లో ఉన్నవారిని ఓ రేంజ్ లో ఎత్తి కుమ్మేశారు. ఈ గేమ్ లో సంజన తన సొంత టీమ్ ని నేల నాకించేసింది. సంజన తన టీమ్ కోసం కాకుండా పక్క టీమ్ కోసం ఆడింది. ఇదేంటి అని సుమన్ శెట్టి అడిగాడు. దానికి సంజన చెప్పిన ఆన్సర్ విని సుమన్ శెట్టి షాక్ అయ్యాడు. మనం ఎలాగో గెలవం. అందుకే రెడ్ టీమ్ కు హెల్ప్ చేస్తున్నా అని చెప్పింది సుమన్ ను కూడా రెడ్ టీమ్ కు హెల్ప్ చేయమని చెప్పింది. దానికి సుమన్ ఒప్పుకోలేదు.
Read Also: Bigg Boss Promo Today: నడుము గిల్లారని ఫీలైన ఇమ్మూ.. ప్రూఫ్ ఉందా అని ప్రశ్నించి తనూజ
రెడ్ టీమ్ గెలిచి..
దీంతో, ఈ టాస్కులో రెడ్ టీమ్ గెలిచి మళ్లీ కంటెండర్‌షిప్ కార్డ్ తీసుకుంది.. ఈ కార్డుని కళ్యాణ్.. ఇమ్మూకి ఇచ్చారు. దాంతో కళ్యాణ్‌తో పాటు ఇమ్మూ కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. రీతూ-డీమాన్ కలిసి సంజన గేమ్ గురించి సుమన్ శెట్టి దగ్గర డిస్కషన్ పెట్టారు. తెలుసు అందరికీ ఆవిడ సంగతి.. డిసైడ్ చేస్తుందట మా టీమ్ ఆడాలా లేదా అని.. డిసైడ్ చేయడమేంటి.. నోటిలో నోరు పెట్టలేను నేను.. అసలు పెట్టను.. మనమేదో సైలెంట్‌గా పోదామని చూస్తే రెచ్చగొడుతుంటే.. అసలకే సుమన్ సుమన్ అని పిలుస్తున్నారు.. సుమన్ శెట్టి అని లాగుతున్నారు బయటికి.. అని సుమన్ అన్నాడు. ఒక్కసారి బయటికొచ్చి ఇచ్చిపడెయ్ అన్నా.. అని డీమాన్ అన్నాడు. కూర్చొని చెప్తున్నాను కదా ఆల్‌రెడీ.. ఏం ఇచ్చేమంటావ్ ఆళ్లలాగ కుక్కల్లా అరవమంటారా.. అలా అరిచినా న్యాయం, నీతి, నిజాయతీగా ఉండాలి.. ఊరుకునే అరిస్తే వచ్చేది కదా.. అరిచి ఉపయోగం ఉండాలి మనం.. మా టీమ్‌కి ఒక్క బాలూ పడలేదు.. మీకు రెండు, వాళ్లకి రెండు.. సో రెడ్ టీమ్‌కి ఒక్కటిస్తే ముందుముందు మనకి ప్లస్ ఉంటుందట.. వాళ్లు కెప్టెన్ అయితే మనకి ప్లస్ ఉంటుందని చెబుతుంది.. ఆవిడకి ప్లస్ ఉంటుంది.. మనకేం ఉంటుంది.. అంటూ సంజన గురించి చెబుతూ సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు.
మిగితా కంటెండర్స్ ఎవరంటే?
ఇక, గేమ్ అయ్యిన తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. కళ్యాణ్, ఇమ్మానుయేల్ మీరు కంటెండర్స్‌గా అర్హత సాధించారు.. మీతో పాటు కంటెండర్స్‌గా ఎవరు ఉండబోతున్నారో తెలుసుకోవడానికి మీరు ఇంటి సభ్యుల్లో ఆరుగుర్ని సెలక్ట్ చేసి మూడు టీమ్స్ గా డివైడ్ చేయాలి.. మీరు నిర్ణయించే ఆ మూడు టీమ్స్ కంటెండర్‌షిప్ పొందడానికి మరో ఛాలెంజ్‌లో పోటీపడతారు.. ఎవరిని ఎవరితో జంటగా చేయాలి.. ఎవరిని తప్పించాలి అనేది పూర్తిగా మీ నిర్ణయం.. అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇమ్మూ-కళ్యాణ్ మాట్లాడుకున్నారు.. డీమాన్‌ని పక్కన పెట్టేద్దామని కళ్యాణ్ సలహా ఇచ్చాడు. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రాము.. గా టీమ్ చేశారు. హరీష్‌కి దెబ్బ తగలడంతో గేమ్ ఆడనని అన్నాడు.. ఆతర్వాత టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
Read Also: Bigg Boss Voting: ‘దమ్ము’ మిడ్ వీక్‌లోనే మాయమవుతోందా?.. ఈ వారం ఇద్దరు ఫిక్స్..!


