Bigg Boss Wildcard: బిగ్‌బాస్ సీజన్ 9.. ఈసారి రణరంగమే అంటూ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఐదో వారం నడుస్తోంది. అయితే ఈసారి హౌస్మేట్స్ పై గట్టిగానే సీరియస్ అయ్యాడు బిగ్‌బాస్ . స్ట్రాటజీకి, ఫౌల్ గేమ్ కు ఉన్న తేడా నాకు బాగా తెలుసు.. అంటూ సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా కంటెస్టెంట్లకు ఊహించని షాకిచ్చాడు. అయితే, బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
బెలూన్ టాస్క్ లో అతితెలివి
ఇక చివరకు బెలూన్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఏ జంట అయితే ఐదు నిమిషాలు లేదా ఐదు నిమిషాలకు దగ్గర సమయం మీద ఊదిన బెలూన్ బాక్స్ లో ఉన్నవారి నీడిల్ మాస్క్ కు తగిలి పగలకుండా గాలితో ఉంచగలుగుతారో వాళ్లు ఈ టాస్కులో విజేతలుగా నిలుస్తారు. అయితే రూల్స్ చెప్పినప్పటికీ.. అదేం పట్టించుకోకుండా రీతూ స్ట్రాటజీ పేరుతో ఫౌల్ గేమ్ ఆడింది. బెలూన్ తీసుకెళ్లి డీమాన్ వెనకాల సైడ్ కు పెట్టి సైలెంట్ గా నిల్చుంది. ఇక రీతూ ప్లాన్ నే తనూజ, శ్రీజ ఫాలో అయ్యారు. దీంతో బిగ్‌బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. స్ట్రాటజీకి ఫౌల్ గేమ్‌కి మధ్య ఉన్న తేడా నాకు బాగా తెలుసు.. ఆటలో ముఖ్యమైన రూల్ ఐదు నిమిషాలు చేరడానికి బెలూన్ ను ఊది గాలిలో ఉండేలా చేయడం.. మీరు దానిని పూర్తిగా విస్మరించి తెలివి అనుకున్నారు. ఇది ఆట స్పూర్తికే విరుద్ధం. ఇందులో ముందు వరుసలో ఉన్నది రీతూ పవన్, తర్వాత కళ్యాణ్ తనూజ, శ్రీజ సుమన్.. దివ్య మీరు ప్రయత్నించారు. కానీ మీ పార్టనర్ భరణి రెండున్నర నిమిషాల పాటు బెలూన్ ఊదారు. సంజన, ఫ్లోరా మాత్రమే తప్పు దారి పట్టకుండా ప్రయత్నించారు. ఈ టాస్క్ తక్షణమే రద్దు చేస్తున్నానని షాక్ ఇచ్చాడు.
పాయింట్లు సగానికి తగ్గించిన బిగ్ బాస్
మీకు గుణపాఠం నేర్పడానికి పవన్-రీతూ, భరణి-దివ్య, కళ్యాణ్-తనూజ, సుమన్-శ్రీజ.. మీ దగ్గర ప్రస్తుతం ఉన్న పాయింట్స్ సగానికి తగ్గిస్తున్నాను.. ఈ శిక్షతోనైనా మీకు కనువిప్పు కలుగుతుందని నేను ఆశిస్తున్నాను.. మరోసారి చెప్తున్నాను ఇది మీ అత్యంత పేలవమైన ప్రదర్శన.. ఇప్పుడు మీకు నచ్చింది చేసుకోవచ్చు.. అంటూ బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు. దీంతో సంచాలకులు, ప్లేయర్లు అందరూ సారీ చెప్పారు అయినా కానీ బిగ్‌బాస్ వెనక్కి తగ్గలేదు. ఇకపోతే, ఈ వారం హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రానున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే, ఎవరు హౌస్ లోకి అడుగుపెట్టనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Read Also: Bigg Boss: నిలిచిపోయిన ‘బిగ్‌బాస్’ షూటింగ్.. షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు..?

