Saturday, November 15, 2025
HomeTop StoriesBigg Boss: తెర వెనుక ఇంతుందా.. ట్రోఫీ కోసం భారీ ప్లాన్..?

Bigg Boss: తెర వెనుక ఇంతుందా.. ట్రోఫీ కోసం భారీ ప్లాన్..?

Bigg Boss: బిగ్ బాస్ ఎందుకు చూస్తారు అంటే.. ఒక్కోసారి ఆన్సర్ ఉండదు. ఆ రియాల్టీ షో.. విమర్శలు వచ్చిన అదే స్థాయిలో రెస్పాన్స్ సైతం వస్తుంటుంది. అందుకే అన్ని భాషలలోనూ ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షో దూసుకుపోతుంది. అయితే ఒకప్పుడు బిగ్ బాస్ షోకు పాజిటివ్ రివ్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఆట పూర్తిగా మారిపోయింది. హౌస్ లో కంటెస్టెంట్స్ కంటే బయట ఉండే పీఆర్ టీమ్స్ మాత్రమే విన్నర్ ఎవరనేది డిసైడ్ చేస్తున్నాయి. తమ కంటెస్టెంట్ గెలిపించేందుకు మిగత కంటెస్టెంట్లకు సంబంధించిన వీడియోను కట్ చేసి తమకు నచ్చినట్లు షేర్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు పీఆర్ టీమ్ మ్యాటర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. ? అసలు విషయం ఇక్కడే ఉంది. ఇటీవల మలయాళంలో బిగ్ బాస్ షో పూర్తైన సంగతి తెలిసిందే. మలయాళంలో బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా మలయాళీ సీరియల్ నటి అనుమోల్ నిలిచింది. అయితే ఆమె గెలిచిన విధానంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

Read Also: Sanju Samson: దరిద్రం అంటే నీదే భయ్యా…కెప్టెన్‌ పోస్ట్‌ దక్కించుకోలేని శాంసన్‌!

భారీగా ప్రైజ్ మనీ..

ఆమె సీజన్ 7 ట్రోఫీతోపాటు రూ.42 లక్షల ఫ్రైజ్ మనీ, SUV కారు గెలుచుకుంది. అనుమోల్ గెలవడానికి కారణం ఆమె పీఆర్ టీమ్ అని ప్రచారం జరుగుతుంది. అనుమోల్ తన పీఆర్ టీమ్ కోసం ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు చేసిందని బిన్సీ సెబాస్టియన్ అనే తోటి కంటెస్టెంట్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన అనుమోల్.. తనకు పీఆర్ టీమ్ ఉన్న మాట నిజమే కానీ రూ.16 లక్షలు చెల్లింలేదని అన్నారు. గతంలో తనను ఓ పీఆర్ టీమ్ 15 లక్షలు అడగ్గా.. అంత తాను ఇవ్వలేనని చెప్పిందట. కేవలం రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చానని.. మిగిలిన అమౌంట్ బయటకు వచ్చాకా ఇస్తానని చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అనుమోల్. ఈ విషయం గురించి హౌస్ లో తన తోటి కంటెస్టెంట్ బిన్సీ సెబాస్టియన్ తో ముచ్చటించింది అనుమోల్. అయితే ఇప్పుడు వీరిద్దరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Read Also: BB Nominations: నామినేషన్స్ లో రచ్చ.. ఆరుగురు నామినేట్..?

బలమైన పీఆర్ టీంపై..

దీంతో బిగ్ బాస్ రియాల్టీ షోలో గెలవాలంటే కంటెస్టెంట్స్ ఆట తీరు కాదు.. బలమైన పీఆర్ టీం ఉండాలనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక తెలుగు విషయానికి వస్తే.. ఇప్పుడు సీజన్ 9లో బలమైన కంటెస్టెంట్స్ గా సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, భరణి, సంజన, రీతూ, డీమాన్ పవన్, తనూజ ఉన్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం తనూజ, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. వీరిద్దరిలోనే విజేత ఉంటారని తెలుస్తోంది. అయితే, వీరిద్దరిలో పోల్చుకుంటే తనూజ పీఆర్ టీమ్ చాలా స్ట్రాంగ్. అంతేకాదు.. ఆమెకు బిగ్ బాస్, హోస్ట్ నాగార్జున పెద్ద పీఆర్ టీమ్స్. తనూజ చేసిన మిస్టేక్స్ పక్కన పెట్టి.. ఆమెకు ఎదురు తిరిగిన కంటెస్టెంట్స్ మిస్టేక్స్ వీడియోస్ ప్లే చేసి మరీ చూపిస్తుంటారు. కానీ అంతకు ముందు రేషన్ మేనేజర్ విషయంలో ఇమ్మాన్యుయేల్ కు ఓకే అని చెప్పి.. ఆతర్వాత నాగార్జున ముందు వద్దు అన్నాను అంటూ మాట మార్చింది. దీంతో నాగ్ సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తనూజను ఏకిపారేశారు ఇమ్మూ ఫ్యాన్స్. గతవారం నామినేషన్స్ సమయంలో రాము రాథోడ్ చేయి పైన కళ్యాణ్ పేరు రాస్తూ నామినేట్ చేయమని చెప్పింది తనుజ. ఇద విషయాన్ని నాగార్జున అడగ్గా.. నో అనే చెప్పింది. చివరకు నాగ్ సైతం ఏమనలేక వదిలేశారు. దీంతో బిగ్ బాస్ విజేత తనూజ అని.. అందుకే ఆమెకు సపోర్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలానే మన బిగ్ బాస్ కన్నడ వాళ్లకు పట్టం కట్టడం కామనే కదా అని మరికొందరు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad