Bigg Boss Sunday Promo: బిగ్‌బాస్ సండే ఎపిసోడ్ లో ఎంటర్ టైన్ మెంట్ మామూలుగా లేదు. దీనికి సంబంధించిన రెండో ప్రోమో వచ్చింది. ఇందులో హోస్ట్ నాగార్జున.. సిల్వర్ స్టార్ వచ్చిన కంటెస్టెంట్ల గురించి మిగిలిన వాళ్లతో తమ అభిప్రాయాలు చెప్పించారు. మరి ఎవరు ఎవరి గురించి ఏం చెప్పారో చూద్దాం. ప్రోమోపై ఓ లుక్కేద్దాం. బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోలో కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు చెప్పి వాళ్ల గురించి అభిప్రాయం చెప్పాలని నాగార్జున కొందరిని అడిగారు. ఈ హౌస్‌లో సిల్వర్ స్టార్స్ పది మందికి వచ్చాయి.. రాము, సుమన్ మీతోనే స్టార్ట్ చేద్దాం.. నేను ఎవరి పేరు చెప్తే వాళ్లలో నెగెటివ్స్ చెప్పు.. భరణి నెగెటివ్ ఏంటి అని నాగ్ అడిగారు. దీనికి భరణి అన్న సేఫ్‌గా ఆడుతున్నారేమో అనిపిస్తుందన్నా నాకు.. అని సుమన్ శెట్టి చెప్పాడు. అనిపించడమేంటి సేఫ్‌యే ఆడుతున్నాడు భరణి.. అంటూ నాగ్ నవ్వారు. తర్వాత రీతూ.. గురించి చెప్పు అని నాగ్ అడిగారు. నాతో బాగా ఉండేది ఎక్కువగా అన్నయ్య అన్నయ్య అని ఇప్పుడు అది కొంచెం తగ్గింది సార్.. అని సుమన్ శెట్టి చెప్పాడు. అన్నయ్యని చూసుకో అమ్మా కొంచెం.. అంటూ రీతూకి సలహా ఇచ్చారు నాగ్. అన్నయ్యే నామినేట్ చేస్తున్నాడు సార్.. అన్నయ్య నామినేషన్స్‌లో పెట్టిన పాయింట్స్‌కి నాకు బ్రెయిన్ పోయింది.. అంటూ రీతూ చెప్పింది.
శ్రీజ గురించి రాము ఏమన్నాడంటే?
ఇక శ్రీజ గురించి రాముని అడిగారు నాగ్. ఏదైనా మాట్లాడేటప్పుడు పాయింట్ టూ పాయింట్ చెప్తుంది కానీ అది ఏమవుతుందంటే సాగదీస్తున్నట్లు అనిపిస్తుంది.. అంటూ రాము చెప్పాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు వినరు.. ఆమె గొడవ ఆమెది.. రీసెంట్‌గా జరిగిన ఎగ్స్ విషయంలో కూడా చాలా హర్టింగ్‌గా అనిపించింది.. అంటూ సంజన గురించి కూడా తన అభిప్రాయం చెప్పాడు రాము. ఆ తర్వాత తనూజ గురించి చెప్తూ ఊరికే ఎమోషనల్‌గా ఏడుస్తుంది సార్.. వాదన వద్దు అనుకున్నా కూడా ఆ సిట్యువేషన్‌లో ఎక్కువ వాదిస్తుంది అనిపిస్తుంది సార్.. అంటూ సుమన్ శెట్టి అన్నాడు.
Read Also: Bigg Boss New Promo: ఇమ్మానుయేల్ నడుముపైనే తనూజకు ఎందుకు కన్ను? నాగ్ కామెంట్లకు నవ్వులే నవ్వులు
ఎక్కడి వెళ్తున్నారు?
నెక్స్ట్ టాస్క్‌కి పోటీపడేది శ్రీజ-దివ్య.. అని నాగార్జున చెప్పారు. తమ పేర్లు చెప్పగానే ఇద్దరూ కలిసి గార్డెన్ ఏరియాకి వెళ్లబోయారు. ఎక్కడికివెళ్తున్నారు వాళ్లిద్దిరూ.. అంటూ నాగ్ అవాక్కయ్యారు. కమ్ అంటే గార్డెన్‌లోకి రమ్మన్నట్లా.. అక్కడ హౌస్‌మేట్స్ బొమ్మలున్నాయి.. మీకిష్టమైన బొమ్మ తీసుకొని మెడలో వేసుకొని వాళ్లని ఇమిటేట్ చేయాలి.. దివ్య.. రీతూలా.. శ్రీజ.. పవన్‌లా.. ఇమిటేట్ చేయండి అంటూ నాగ్ టాస్క్ ఇచ్చారు. అసలే వీళ్లిద్దరి గురించి అందరికీ హౌస్‌లో బాగా తెలుసు. దీంతో అటు దివ్య ఇటు శ్రీజ ఇద్దరూ వాళ్ల కాటన్ బిజినెస్ గురించి బాగానే ఇమిటేట్ చేశారు. ఇది చూసి నాగార్జున అయితే తెగ నవ్వుకున్నారు. డీమాన్-రీతూ కూడా పైకి అయితే నవ్వుకున్నారు. దీంతో ఈ ప్రోమో ఎండ్ అయిపోయింది.


