Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss: ఫెయిర్ గేమ్ తో ఔట్.. మ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Bigg Boss: ఫెయిర్ గేమ్ తో ఔట్.. మ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Bigg Boss Elimination: బిగ్ బాస్ సీజన్ 9.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. 9వ వారంలో రాము రాథోడ్ స్వయంగా ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఇంటి మీద బెంగతో.. తల్లిదండ్రులను మిస్ అవుతున్నానంటూ బయటకు వచ్చేశాడు. ఇక అడియన్స్ ఓటింగ్ ప్రకారం.. ఎలిమినేట్ అయ్యాడు సాయి శ్రీనివాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన సాయి.. హౌస్ లో మాత్రం ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. అయితే, అతడి ఎలిమినేషన్ వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అక్టోబర్12న వైల్డ్ కార్డ్ గా ఇంట్లోకి అడుగుపెట్టాడు సాయి శ్రీనివాస్. ఇమ్యూనిటీ పవర్ ఉన్న వజ్రాన్ని అతడి చేతికి ఇచ్చిన నాగ్ కావాల్సినప్పుడు వాడుకోమన్నాడు. దీంతో ఒక వారం అతడు సేవ్ అయ్యాడు.

- Advertisement -

Read Also: Bigg Buzz:  బిగ్ బాస్ హౌస్ బస్సా? కోట్ల మంది కల.. రాముపై ఫైర్..!

గేమ్ ఆడే ఛాన్స్ రాలేదు

వెళ్లిన మొదటి వారంలో అతడు నామినేషన్లలోకి రాలేదు. ఇక తర్వాత వారం వచ్చినప్పటికీ రమ్య మోక్ష ఎలిమినేట్ కావడంతో సేఫ్ అయ్యాడు సాయి. మరో వారం తన ఇమ్యూనిటీ కోసం ఇచ్చిన పవర్ వజ్రాన్ని వాడుకుని నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. కానీ ఈ వారం మాత్రం బయటకు వచ్చేశాడు. అయితే ఇప్పటివరకు హౌస్ లో ఉన్న వారాలు అనవసర గొడవలు.. ఫుటేజే కోసం కావాలని వాదించడం చేయకుండా తన గేమ్ తాను ఆడేందుకు ట్రై చేశాడు. కానీ అప్పటికే ఆటలో ఆరితేరిన కంటెస్టెంట్స్.. సాయికి ఛాన్స్ రాకుండా తెలివిగా అతడిని వెనక్కు నెట్టేస్తూ.. ఆడేందుకు ట్రై చేయట్లేదంటూ అతడిని నామినేట్ చేశారు. టాస్కులలో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందరిని కాదని తన తెలివితో అందుకోలేకపోయాడు. దివ్య, రీతూ ఇద్దరూ కలిసి అతడిని గేమ్ నుంచి తప్పించడంతో అసలు గేమ్ ఆడే ఛాన్స్ రాలేదు. అలాగే అర్థం కానీ గొడవలు స్టార్ట్ చేసి.. అడ్డంగా వాదించేవారితో గెలవలేకపోయాడు.

Read Also: Saturn: ఆ రాశి వారికి ఏలినాటి శని రెండో దశ.. ముప్పు తప్పేలా లేదు!

ఆడియన్స్ ని గెలుచుకున్న సాయి

కానీ తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయినప్పటికీ అడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. హౌస్ లో ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. కానీ అదే సమయంలో ఇతరులు గట్టిగా వాదించడంతో అయోమయంలో పడ్డాడు. ముఖ్యంగా తనూజను నామినేట్ చేస్తూ చెప్పిన స్ట్రాంగ్ పాయింట్స్ ఆమె ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. కానీ అతడి పాయింట్స్ స్ట్రెయిట్ గా చెప్పడంతో సాయి పై మరికొందరు ప్రశంసలు కురిపించారు. ప్రతి గేమ్ లో ఫెయిర్ గా ఉన్నాడు.. అన్ ఫెయిర్ గేమ్ ఆడుతూ.. అడ్డమైన వాదన చేయలేదు. అలాగే ఫుటేజ్ కోసం వాదించాలని.. అవసరం లేకపోయినా గొడవ పెట్టుకోవాలని ట్రై చేయలేదు. తనవరకు వచ్చే వరకు వెయిట్ చేశాడు. అలాగే తనకు హెల్ప్ కావాలని ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోలేదు. ఎవరితోనూ స్నేహం , లేదా అన్న, తమ్ముడు అంటూ బాండింగ్స్ పెట్టుకోలేదు. ప్రతి గేమ్, ఇతరులను అర్థంలో చేసుకోవడంలో స్లో అయ్యాడు కానీ ఈ బిగ్ బాస్ ఆటలో అంత స్లో గా ఉంటే వర్కవుట్ అవ్వదు. దీంతో సాయి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. దాదాపు నాలుగు వారాలు హౌస్ లో ఉన్నాడు సాయి. అయితే, వారానికి రూ.2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ సంపాదింటినల్ టాక్. దీంతో, ఈ నాలుగు వారాలకు రూ.8 లక్షల రెమ్యూనరేషన్ అందినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad