Bigg Boss Nominations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ పూర్తయ్యింది. మొదటి వారం కాంట్రవర్సీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఇక రెండో వారంలోకి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అడుగుపెట్టింది. ఎప్పటిలాగే హౌజ్‌లో మళ్లీ నామినేషన్స్ మొదలయ్యాయి. ఇక ఎప్పటిలాగే మరో వారం ఎవరు ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో వారిని నామినేట్ చేసే ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్.దీనికి సంబంధించిన షూటింగ్ ఆదివారం జరిగింది. మరి ఈ వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
ఆదివారం షూటింగ్..
బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియకకు సంబంధించిన షూటింగ్ ఆదివారం (సెప్టెంబర్ 14) నిర్వహించారు. కానీ, ఆడియెన్సకు మాత్రం సోమవారం (సెప్టెంబర 15) ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియ చూపిస్తారు. అయితే, రెండో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ జోరుగా జరిగినట్లు ఇన్‌సైడ్ టాక్. ఈ వారం బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్సులో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. హౌజ్ మేట్స్ ఒక్కొక్కరు తగిన కారణాలు చెబుతూ ఇద్దరిని నామినేట్ చేశారు. అలా మొదటి రోజ నామినేషన్స ప్రక్రియ ముగిసేసరికి రెండో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది.
Read Also: Duleep Trophy: పోరాడి ఓడిన సౌత్ జోన్.. దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్
నామినేషన్స్ లో ఆరుగురు
రెండో వారం నామినేషన్స్‌లో భాగంగా భరణి శంకర్, ఫ్లోరా సైనిని జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి నామినేట్ చేసింది. అలాగే, కామనర్‌గా వచ్చిన మనీష్ మర్యాద కూడా భరణిని నామినేట్ చేశాడు. అతనితోపాటు రీతూ చౌదరిని కూడా మనీష్ నామినేట్ చేసినట్లు సమాచారం. మరో కామనర్ అయిన డీమోన్ పవన్ అతని కామనర్స్ గ్రూప్‌లోని మర్యాద మనీష్‌ను, హీరోయిన్ ఫ్లోరా సైనిని తనకు అనిపించిన కారణాలు చెప్పి నామినేట్ చేశాడు. కమెడియన్ సుమన్ శెట్టి .. ప్రియా శెట్టి, మనీష్ ఇద్దరిని నామినేషన్స్‌లో ఉంచాడు. అలాగే, ఎప్పుడు అల్లరి చేసే శ్రీజ దమ్ము మాస్క్ మ్యాన్ అయిన హరీష్ హరితను, భరణి శంకర్‌ను నామినేట్ చేసింది. వీరితోపాటు ఫోక్ సింగర్ రాము రాథోడ్ సోల్జర్ కల్యాణ్‌ను నామినేట్ చేశాడు. అరుపులు, గొడవలతో రెండో వారం నామినేషన్స్ కూడా బాగానే జరిగింది. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం నామినేషన్స్‌లో సీరియల్ నటుడు భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, హరీష్ హరిత, డీమోన్ పవన్, ప్రియా శెట్టి ఆరుగురు ఉన్నట్లు సమాచారం. ఈ ఆరుగురిలో ఫ్లోరా సైనీకి అత్యధికంగా నామినేషన్స్ ఓట్లు పడినట్లు పలువురు రివ్యూవర్స్ చెప్పారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది వారి వారంతపు పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.


