Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Captaincy: రెండు గ్రూపులు కొట్టుకుని సంజనాను కెప్టెన్ చేసేశారుగా..!

Bigg Boss Captaincy: రెండు గ్రూపులు కొట్టుకుని సంజనాను కెప్టెన్ చేసేశారుగా..!

Bigg Boss Captain: బిగ్ బాస్ లో గుడ్డు కొట్టేసి హౌస్ మొత్తాన్ని పరిగెత్తించిన సంజన.. ఇప్పుడు అఫీషియల్ గా హౌస్ కి కెప్టెన్ అయిపోయింది. పిల్లి-పిల్లి రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటే మధ్యలో కోతి ఎత్తుకుపోయిందట అన్నట్లుగా ఉంది హౌస్‌లో ప్రస్తుతం పరిస్థితి. అటు ఓనర్లు ఇటు టెనెంట్లు రెండు గ్రూపులు.. సంజన మాత్రం కెప్టెన్ కాకూడదని కోరుకున్నారు. అయితే వాళ్లలో వాళ్లు కొట్టుకొని మొత్తానికి సంజనను కెప్టెన్‌ అయ్యేలా చేశారు. ఇక కెప్టెన్‌గా రిబ్బన్ కట్టగానే సంజన డ్యూటీ ఎక్కేసింది. తనని ఎవరు ఏమన్నారో ప్రతి దాని లెక్క తేలుస్తా అన్నట్లుగా నవ్వుతూనే ఇచ్చిపడేస్తుంది. కెప్టెన్ అయిన వెంటనే తనకి మొదటి నుంచి పడకుండా ఉన్న లక్సు పాప (ఫ్లోరా)ని లగేజి తీసుకురా అంటూ ఆర్డర్ వేసింది సంజన. దీనికి ససేమీరా అని ముఖం మీదే ఫ్లోరా చెప్పేసింది. దీంతో సరే అయితే కెప్టెన్ మాట వినట్లేదు కాబట్టి దానికి పర్యవసానాలు నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటూ ముఖం మీదే చెప్పింది సంజన. అలానే హౌస్ మొత్తాన్ని స్కిట్ చేయండి.. నాకు వంట చేసి పెట్టండి అంటూ ఆర్డర్లు ఇచ్చింది. దీంతో బాగా కాలిపోయిన కామనర్లు సంజనకి వచ్చిన లగ్జరీ ఐటెమ్స్‌ని లేపేశారు. ఇలా డే 5 ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం.

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఔట్ అయినా కూడా

బిగ్‌బాస్ హౌస్‌కి తొలి కెప్టెన్ అయ్యేందుకు పెట్టిన టాస్కులో ఇమ్మూని గుడ్డిగా పక్కకి తప్పించేశాడు సంచాలక్ మనీష్. కాగా.. ఆ గేమ్ కంటిన్యూషన్‌తో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. తర్వాత రాడ్స్ తీసేందుకు సంజనని పిలిచాడు మనీష్. అంతేకాకుండా నేను చెప్పే వరకూ ఆగండి.. అంటూ సలహా ఇచ్చాడు మనీష్. ఇది వినగానే ఇమ్మూకి మండిపోయింది. అలా చెప్పకండి అన్నా మాకు చెప్పలేదు కదా.. అంటూ పక్క నుంచి డైలాగ్ వేశాడు. ఇక సంజన వెళ్లి పవన్ కళ్యాణ్ కాలు కింద ఉన్నరాడ్ పీకడంతో మనోడు సపోర్ట్ కోసం పైన ఉన్న వాల్ రూఫ్‌ని టచ్ చేశాడు. ఇది చూసిన టెనెంట్స్‌ వెంటనే సంచాలక్‌కి చెప్పి వాదించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం లేదు నేను టచ్ చేయలేదంటూ మొండిగా వాదించాడు. ఇక ఇమ్మూ విషయంలో వెంటనే డెసిషన్ తీసుకున్న సంచాలక్ మనీష్ ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. దీంతో టెనెంట్స్ అందరూ చుట్టూ చేరి ఇంతమంది తను టచ్ చేశాడని చెప్తున్నాం కదా నువ్వు చూడలేదా అంటూ నిలదీశారు. దీంతో చేసేదేం లేక అవును టచ్ చేశాడు.. పవన్ కళ్యాణ్ ఔట్ సో హరీష్ టీమ్ ఎలిమినేట్ అయింది అంటూ మనీష్ చెప్పాడు. ఇక, మిగిలింది రామూ రాథోడ్, దమ్ము శ్రీజ మాత్రమే.

ఇమ్మానుయేల్‌ వర్సెస్ హరీష్

ఇక చేసేదేం లేకపోయినా హరీష్ మాత్రం ఓ డైలాగ్ వేశాడు. ఓకే ఎలిమినేట్ అంటున్నారు కదా.. సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్.. వ్యూయర్స్ చూస్తున్నారు.. నేను వేరే వాళ్లలో ఇలా ఇలా గెంతులు వేయను ఇక్కడ.. ఎవరు ఎలా ఆడుతున్నారో అర్థమైంది కదా వీకెండ్ మట్లాడదాం.. అంటూ హరీష్ ఇండైరెక్ట్‌గా ఇమ్మానుయేల్ చేసిన గొడవ గురించి ప్రస్తావించాడు. ఇక కాసేపటికి ప్రియ కూడా నిల్చోలేక పక్కకి తిరిగింది. దీంతో ప్రియ కూడా ఔట్ అయిపోయింది .. అంటే ప్రియ సపోర్ట్ చేసిన డీమన్ పవన్ రేసు నుంచి తప్పుకున్నాడు. ఇక చివరిగా రాము రాథోడ్, దమ్ము శ్రీజ మాత్రమే మిగిలారు. ఇక్కడ జరిగిన ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకర్ని ఒకరు టార్గెట్ చేసుకుని.. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా శ్రీజ పట్టుకున్న రాడ్స్ పీకలేదు. అందరూ అవతలి వాళ్లని టార్గెట్ చేయడంతో ఈ గేమ్‌లో శ్రీజ గెలిచింది. చివరి వరకూ రాము ఆడి పోరాడాడు. ఇక, శ్రీజ గెలవడంతో సంజన కెప్టెన్ అయిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad