Bigg Boss Updates: బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆడియన్స్ ఫుల్ కిక్కిచ్చింది. రకరకాల మలుపులు తిరుగుతూ అటు ఆడియన్స్‌కి ఇటు హౌస్‌మేట్స్‌కి బుర్రతిరిగే మజా అయితే ఇచ్చింది. హౌస్‌లోకి దివ్య నికితా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇక దాన్ని తారస్థాయికి పెంచుతూ మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో సంజనని సీక్రెట్ రూమ్‌లో పెట్టాడు బిగ్‌బాస్. దీంతో టీవీలో అందరి బాగోతాలు చూస్తూ ఒకొక్కరి గురించి అదిరిపోయే కామెంట్లు చేసింది సంజన. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం.
మిడ్ వీక్ ఎలిమినేషన్..
బిగ్‌బాస్ చరిత్రలో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ కొత్తేం కాదు. అయితే ఇందులో కొన్ని నిజంగానే ఎలిమినేషన్‌లు అయితే మరికొన్ని మాత్రం సీక్రెట్ రూమ్ డ్రామాలు. ఇక తాజాగా బిగ్‌బాస్ 9లో కూడా అదే డ్రామా రిపీట్ అయింది. హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దివ్య నికితాని పంపించి హౌస్‌మేట్స్‌కి చిన్న షాకిచ్చాడు బిగ్‌బాస్. ఇక నేటి ఎపిసోడ్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ అందర్నీ హడలెత్తించాడు. అందుకు తగ్గట్లుగానే డ్రామాని పండించి.. హౌస్ నుంచి సంజనని ఎలిమినేట్ చేస్తూ హౌస్‌మేట్స్‌కి మరో షాకిచ్చాడు. అంతకుముందు బిగ్‌బాస్ ఆదేశాల మేరకు దివ్య నికితా తన దృష్టిలో టాప్ 1-13 ఎవరో చెప్పి ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఆ ర్యాంకింగ్స్ ఆధారంగానే టాప్-5లో ఉన్నవాళ్లకి కెప్టెన్సీ టాస్క్ జరిగింది. అయితే టాప్-5లో ఉన్న సంజన, డీమాన్ ఇప్పటికే కెప్టెన్‌లు కావడంతో ఆ ప్లేస్‌లో దివ్యకి, సుమన్ శెట్టికి అవకాశం దక్కింది. దీంతో మొత్తం ఐదుగురు కెప్టెన్సీ టాస్కులో పోటీపడ్డారు. వీరిలో ఇమ్మాన్యుయేల్ గెలిచి హౌస్‌కి మూడో కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ హడావిడి మొదలైంది. అర్ధరాత్రి సైరన్ మోగించి కంటెస్టెంట్లని కంగారు పెట్టాడు బిగ్‌బాస్.
ఎలిమినేషన్.. ఒకర్ని బయటకు పంపాలి
సైరన్ మోగడంతో అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నారేమో అనుకొని పోలో మని గార్డెన్ ఏరియాకి వచ్చారు. కానీ బిగ్‌బాస్ మాత్రం వేరే అనౌన్స్‌మెంట్ చేశాడు. నా చక్రవ్యూహం మొదటి అధ్యాయంలో దివ్య ఇంట్లోకి అడుగుపెట్టింది.. ఇప్పుడు ఆ చక్రవ్యూహంలోని మరో అధ్యాయానికి సమయం వచ్చింది. ఇంటి సభ్యులందరూ ఇప్పటివరకూ మీకు లభించిన ఫలాల్లోని బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు రెడ్ సీడ్ పొందిన వారి వంతు.. ఎప్పుడూ లేని విధంగా రెడ్ సీడ్ పొందినవారికి ఇంటి నుంచి ఒకర్ని బయటికి పంపే అధికారాన్ని నేను ఇస్తున్నాను. దివ్య నేను పంపిన సభ్యురాలు.. ఫ్లోరా తన ఇమ్యూనిటీని గెలుచుకొని ఈ వారం సేవ్ అయ్యారు కాబట్టి వీరిద్దరూ మినహాయించి మిగతా రెడ్ సీడ్ పొందని వారిలో నుంచి ఒకర్ని మీరు ఇంటి నుంచి బయటికి పంపేందుకు నిర్ణయించాల్సి ఉంటుంది.. అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు.
సంజనని టార్గెట్ చేసిన హరీష్
ఇక రెడ్ సీడ్ పొందిన భరణి, హరీష్, కళ్యాణ్, డీమాన్, రాము మాట్లాడుకోవడానికి లోపలికెళ్లారు. హరీష్ అయితే ముందుగానే తన ఒపీనియన్ చెప్పాడు. నాకు సంజన గారు అందులో వెరీ క్లియర్.. ఎందుకంటే ఈ షో దొంగల షో దొంగతనాల షో అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు.. అన్నాడు. నా ఒపీనియన్‌లో అయితే సేఫ్ గేమ్ ఆడుతుంది.. అంటూ రాము కూడా తందానా అన్నాడు. నీకూ సంజన గారేనా అని అడిగితే 100 శాతం.. అంటూ చెప్పాడు. సుమన్ శెట్టి గారి విషయంలో నాతో బయట మాట్లాడుతూ మీరు నా గురూజీ కలిసి ఆయనది సిగరెట్లు తీసేద్దామన్నప్పుడు వద్దండి తప్పు అది పర్సనల్ సంబంధించిన వాటి జోలికి వెళ్లొద్దు అటాక్ చేయొద్దు దయచేసి అని చెప్పా.. సైకో ఆనందమా దేనికి అది.. దాని నుంచి ఔట్‌పుట్ ఏమొస్తది.. ఒక్కసరి కాదు మాటిమాటికి అదే రిపీట్ చేస్తున్నారు.. ఇవాళ దివ్యది కూడా అలానే ఏంటది పరిస్థితి అంటూ హరీష్ అన్నాడు.
సంజనానే టార్గెట్
ఆవిడకి ఎవరైతే ఫేవర్‌గా ఉంటారో వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉంటారు.. వాళ్ల సైడ్‌యే మాట్లాడుతుంటారు.. వాళ్ల గురించే పని చేస్తున్నట్లు ఉంటారు.. అందరి దగ్గరా అది ఉందో లేదో తెలీదు కానీ నా విషయంలో ఎందుకు అనిపించిందో ఏమో మరి.. ఆవిడ కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్న ఫీలింగ్ అనిపించింది నాకు.. నేను అది అబ్జర్వ్ చేశాను.. అంటూ రాము చెప్పాడు. సంజన గారి తర్వాత సెకండ్ ఆప్షన్ అంటే ఎవరి పేరు చెప్తారు.. అని భరణి అడిగాడు. స్ట్రాంగ్‌గా మెజారిటీ సంజన గారు ఉన్నారు.. సెకండ్ ఆప్షన్ అంటే నాకు ఎవరూ కనపడట్లేదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో నుంచి పంపించే అంత అనర్హులు ఎవరూ లేరు.. అంటూ హరీష్ చెప్పాడు. దీంతో సంజన గారినే డిసైడ్ చేద్దామా మరి.. అని కళ్యాణ్ అన్నాడు.
అది మాకు నచ్చలేదు
నిర్ణయం తెలిపే సమయం వచ్చేసింది.. మిగతా సభ్యుల సూట్‌కేసులన్నీ స్టోర్ రూమ్ నుంచి తీసుకొని లివింగ్ ఏరియాకి రండి.. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పండి.. అని బిగ్‌బాస్ అడిగాడు. దీంతో బిగ్‌బాస్ సంజన గారు.. అంటూ హరీష్ చెప్పాడు. ఆవిడ కొంచెం ఏదైనా సరే ఆవిడకి నచ్చలేదంటే ఏదైనా ఇష్యూ అయితే అది పర్సనల్‌గా తీసుకొని పర్సనల్ అటాక్ చేయడం ఎమోషన్స్‌తో ప్లే చేయడం చేస్తున్నారు.. అని డీమాన్ అన్నాడు. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే నాకు నచ్చలేదు బిగ్‌బాస్.. దివ్య గారిని పర్సనల్‌గా టార్గెట్ చేసి మరీ ఆవిడకి సంబంధించిన కాస్ట్యూమ్స్ అవి కూడా దాచేయడమనేది.. అంటే డే1యే దివ్య గారు చాలా సఫర్ అయ్యారు.. ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే బిగ్‌బాస్.. అంటూ భరణి మాట్లాడాడు.
ఓవరాక్టింగ్ చేసిన కళ్యాణ్
ఈ హౌస్‌కి మాకు ఏది అయితే వద్దనుకుంటున్నామో ఎలాంటి వాళ్లు లేకపోతే ఈ హౌస్ ఇంకా గొడవలు లేకుండా ప్రశాంతంగా అందరూ ఉంటారని నేను అనుకుంటున్నానో వేరే వాళ్లు పర్సనల్‌గా ఇబ్బంది పడరు అనుకుంటున్నానో ఆ బేసిస్ మీద ఇక్కడున్నవాళ్లు అందరితో పోల్చుకుంటే సంజన గారు కొంచెం డిస్ట్రబెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు హౌస్‌లో.. సో అందరికంటే ఆవిడ దగ్గరి నుంచి మాకు నెగెటివ వైబ్స్ వస్తున్నాయని సంజన గారి పేరు ఏకాభిప్రాయంతో డిసైడ్ చేసుకున్నాం.. అంటూ కళ్యాణ్ తన వెర్షన్ చెప్పాడు.
Read Also: Bigg Boss Telugu: తప్పించాడు.. గెలిచాడు.. చివరికి మూడో కెప్టెన్ అయ్యాడు
కాంపిటేషన్ అని తీసేశారేమో
అందరూ మాట్లాడేశాక నేను మాట్లాడొచ్చా బిగ్‌బాస్.. అంటూ సంజన తన అభిప్రాయం చెప్పింది. ఇవాళ జరిగిందేంటి (దివ్య వస్తువుల దొంగతనం).. అందులో నేను ఒంటరిగా లేను కదా.. కానీ వాళ్లకి నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానా నాకు తెలీదు.. లేక ఈరోజు నాకు దివ్య థర్డ్ ర్యాంక్ ఇచ్చింది హౌస్‌లో.. ఇక్కడున్న వాళ్లలో నేనే థర్డ్ ప్లేస్‌లో ఉన్నాను కాబట్టి.. ఓకే తను స్ట్రాంగ్‌గా ఉంది తనని పక్కకి జరిపేస్తే కట్ ఆఫ్ చేస్తే మా దారి క్లియర్ అవుతుందని అనుకున్నారో.. డైరెక్ట్‌గా కాంపిటేషన్‌లో నన్ను కార్నర్ చేసి బయటికి పంపిస్తున్నారా నాకు తెలీదు.. ఫస్ట్ వీక్ నుంచే నాకంటూ ముక్కుసూటి అభిప్రాయాలు ఉన్నాయి.. ఒక సోలో ప్లేయర్‌గానే ఉన్నాను.. నా ఆలోచనలు ఖచ్చితంగా డిఫరెన్స్ అవ్వొచ్చు కానీ నేను ఎవరినీ పర్సనల్‌గా హర్ట్ చేయలేదు.. అందుకే దివ్యని నేను పర్సనల్‌గా పిలిచాను.. మాట్లాడాను.. ఆమెకి వివరించాను.. అది కూడా మీరు చూశారు..
Read Also: Kalyan Padala Father Interview: కాట్రాజ్ కళ్యాణ్.. సోల్జర్ పరువు తీసేసాడు.. కొడుకుపై తండ్రి ఆవేదన
షో కోసం నా 500 శాతం ఇచ్చాను
ఇవాల్టి వరకూ కూడా ఎవరైనా నా దగ్గరికొచ్చి అటాక్ చేస్తే నేను డిఫెండ్ చేసుకున్నాను తప్ప.. నేను ఒక్క మనిషితో కూడా తేడాగా మాట్లాడలేదు.. ఒక్క మనిషితో కూడా అరిచి మాట్లాడలేదు.. చాలా స్వీట్‌గా నా ఇంట్లో మెంబర్స్‌తో ఎలా ఉంటానో అలానే వీళ్లందరితో ఉన్నాను బిగ్‌బాస్.. హౌస్‌లో హార్మొనీ పాడుచేయాలని అయితే అసలు నాకు ఆలోచనే లేదు.. అయితే ఒప్పుకుంటాను నేను నాటీ క్యాండెట్.. ఆ నాటీనెస్‌ని పర్సనల్‌గా తీసుకొని ఇలా ఇంటి నుంచి బయటికి వెళ్లండని వాళ్లు పంపిస్తున్నారంటే వాళ్లకి ఒక స్పోర్టివ్ బిహేవియర్ లేకపోవచ్చు.. క్లియర్‌గా నన్ను కార్నర్ చేస్తున్నారు.. కానీ ఏది ఏమైనా మీరు చెప్పేది ఫైనల్ డెసిషన్.. నేను దాన్ని గౌరవిస్తాను. అయితే నా పరంగా నేను 100 కాదు 500 పర్సంట్ షో కోసం ఇచ్చాను.. ఆ తృప్తి నాకు ఉంది.. నేను ఈ హౌస్‌లో ఉండటానికి అర్హత ఉందని అనుకుంటున్నాను.. అంటూ సంజన చెప్పింది.


