Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పోరు రసవత్తరంగా సాగుతోంది. సడెన్ గా మధ్యరాత్రి సైరన్ మొగించి మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక రెడ్ సీడ్ పొందిన వారందరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలని చెప్పాడు. అయితే, రెడ్ సీడ్ పొందిన వారు సంజనాను ఇంటి నుంచి బయటికి పంపేందుకు రెడీ అయ్యారు. ఇక, రెడ్ సీజ్ వారందరూ నిర్ణయించిన సంజన సూట్‌కేస్‌ని మెయిన్ గేట్ బయట పెట్టండి.. సంజన మీరు వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్లండి.. అంటూ బిగ్‌బాస్ అన్నాడు. దీంతో సంజనని హత్తుకొని ఫ్లోరా ఎమోషనల్ అయింది. డోంట్ వర్రీ టైగర్‌లా ఉండు.. అందరూ ఉన్నారు నీకు.. అంటూ సంజన చెప్పింది. ఇక ఇమ్మూ ఏడవడం చూసి ఏడవకు నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా.. దేవుడికి చూడు నాకు బయట ఇంకొక బిడ్డ కూడా ఉన్నాడు.. నేను పోయి తనని చూడాలని ఉందేమో.. నువ్వు టైగర్‌రా ఏడవకూడదు ఇమ్మానుయేల్.. నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తానురా.. నేను ఒంటరిగా పోతున్నా నీతో అందరూ ఉన్నారు కదా.. నీతో అందరూ ఉన్నారు కదా నువ్వెందుకు ఏడవడం.. అంటూ సంజన కూడా కళ్ల నీళ్లు పెట్టుకుంది. థాంక్యూ మమ్మీ.. అంటూ సంజనని హత్తుకొని ఇమ్మూ తెగ ఏడ్చాడు. నువ్వే గెలవాలి కప్పు.. ఇంక నేను లేను కప్పు నీదే.. నువ్వే కప్పు గెలవాలి.. అంటూ ఇమ్మూకి ధైర్యం చెప్పి అందరికీ బైబై చెప్పేసింది సంజన.
కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్
సంజన వెళ్లిపోయాక ఇమ్మూ ఇంకా ఎమోషనల్ అయిపోయాడు. ఎవరేమనుకున్నా నేను చేయాలనుకున్నది చేస్తా.. నేను నెగెటివ్ అయినా ఫర్లేదు.. నేను షో కోసం ఏదో ఒకటి చేస్తా.. అది ఎలా వెళ్లినా ఫర్లేదు అనే మైండ్ ఎవరికీ ఉండదన్నా.. అంటే.. నా తప్పులు నీ మీద పడకూడదు.. నేను తప్పులు చేసుకుంటూనే ముందుకెళ్తా.. అది నేను మైండ్‌లో ఫిక్స్ అయ్యా.. నువ్వు నేను తప్పు చేసేటప్పుడు దగ్గరికి రావద్దని నన్ను దూరం పెట్టేది.. అంటూ ఇమ్మూ ఏడ్చాడు. ఇక అప్పటికే సంజన సీక్రెట్ రూమ్‌కి వెళ్లి ఇదంతూ టీవీలో చూస్తుంది. నేను నాటీ బిగ్‌బాస్ నాటీ అంటే నెగెటివ్ కాదు.. నేను నాటీ దారిలోనే వెళ్తాను.. అంటూ సంజన చెప్పింది. ఒక్క క్షణం ఒంటరివాడ్ని అయిపోయానని.. అంటూ ఇమ్మూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు మంచి పార్టనర్ అండి కామెడీ చేయడానికి అంటూ దివ్యతో చెప్పి ఇమ్మూ ఏడ్చాడు. హౌస్‌లో నవ్వులు పోయాయి.. నవ్వే మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్లరు.. ఆ ఐదుగురు డిస్కస్ చేశారు కదా బిగ్‌బాస్.. ఆ రూమ్‌లో అది కూడా నేను చూడాలి.. అంటూ సంజన బిగ్‌బాస్‌ని రిక్వెస్ట్ చేసింది.
Read Also: Kalyan Padala Father Interview: కాట్రాజ్ కళ్యాణ్.. సోల్జర్ పరువు తీసేసాడు.. కొడుకుపై తండ్రి ఆవేదన
రోజూ ఏడ్చేదని ఎమోషనల్
ఇమ్మూ ఏడుస్తూనే ఉండేసరికి ఏయ్ ఏడవకు స్టుపిడ్ వస్తాను మళ్లీ.. అంటూ సీక్రెట్ రూమ్‌లో సంజన మాట్లాడింది. ఆవిడ లేకపోతే హౌస్‌లో మజా ఉండదండి.. నిజాయితీగా చెప్తున్నా నేను ఫ్యాన్ అయిపోయాను ఆవిడకి.. అందుకే నేను ఆవిడకి అంత కనెక్ట్ అయ్యనేమో అనిపిస్తుంది.. మ్యాడ్.. ఎంచుకున్న దారి తప్పుదారి కానీ.. అంటూ ఇమ్మూ అన్నాడు. ఏం తప్పు లేదయ్యా చిన్నబిడ్డా.. అంటూ సంజన అంది. డైలీ ఏడ్చేదండి నేను చూసేవాడ్ని.. దుప్పటి కప్పుకొని ఏడ్చేది.. కానీ ఏ రోజూ అది కంటెంట్ మీద పడనివ్వలేదు.. డైలీ ఏడ్చేది.. నేను వెళ్లి పక్కన కూర్చూనేవాడ్ని.. నేను చూశా ఫస్ట్ వీక్ మొత్తం ఏడ్చింది.. సెకండ్ వీక్ మొత్తం ఏడ్చింది.. నేను పడుకునేటప్పుడు అరగంట నవ్వించి పడుకోవడం స్టార్ట్ చేశా.. అప్పుడు పడుకోవడం స్టార్ట్ చేసేది.. అది ఏరోజూ మార్నింగ్ చూపించేది కాదు.. పిల్లల్ని మిస్ అవుతున్నాను.. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనేది ఏ రోజూ చూపించేది కాదు.. అంటూ ఇమ్మూ చెబుతుంటే సీక్రెట్ రూమ్‌లో సంజన కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
Read Also: Bigg Boss Updates: మిడ్ వీక్ సంజనా ఎలిమినేట్.. సైకో ఆనందమా అని హరీష్ కామెంట్
సీక్రెట్ రూమ్‌లో ఉంటుందని గెస్ చేసిన కంటెస్టెంట్లు
ఆమె తిరిగి వస్తుందని స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది.. అంటూ ఇమ్మూతో భరణి అన్నాడు. మరోవైపు ఎక్కడికీ వెళ్లరు బ్రదర్.. సీక్రెట్ హౌస్‌లోనో ఎక్కడో ఉంటారు.. ఉండి వచ్చేస్తారు.. సీక్రెట్ రూమ్‌లోనో ఎక్కడో ఉండి వచ్చేస్తారు ఆవిడ.. అంతే అనిపిస్తుంది నాకు.. అంటూ హరీష్ కూడా రాముతో అన్నాడు. ఇక రాము-హరీష్ కూర్చొని సంజన గురించి మాట్లాడుకున్నారు. నిజంగా అట్ల ఆడితే కనిపిస్తది.. ఇలా క్రియేట్ అవుతుందని అందరూ అనుకుంటే ఇక్కడ ఎవరైనా కూడా ఒక్కరు కూడ తగ్గరు.. కానీ మనకి అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే మైండ్ సెట్ లేదు.. అంటూ రాము అన్నాడు. హరీష్ కూడా తందానా అన్నాడు.
నేను తమ్ముడని దూరం పెట్టా..
ఇక వాష్‌రూమ్ ఏరియా దగ్గర రీతూతో పులిహోర కలుపుతున్నాడు డీమాన్. ఆమె (సంజన) నైస్ గర్ల్.. నాకు కూడా ఆవిడ కంపెనీ అంటే ఇష్టం.. కానీ కొన్ని పాయింట్లు మాత్రం.. అంటూ డీమాన్ నసిగాడు. ఆవిడ ఇరిటేట్ చేస్తుంది.. ఎంటర్‌టైన్ చేస్తుంది ఓకే కాకపోతే ఆవిడ ఆవిడలానే ఉంటుంది.. మిగతావాళ్లు అలా ఉండరు తెలుసా.. మిగతా వాళ్లు యాక్ట్ చేస్తారు కొంచెమైనా.. అంటూ రీతూ చెప్పింది. ఇక ఇది టీవీలో చూస్తూ వీడు ఇంట్లో ఉన్న అందరి అమ్మాయిలతోనూ ఆటలాడుకుంటున్నాడు.. నేను తమ్ముడు చెప్పి దూరం పెట్టాను.. అంటూ డీమాన్ గురించి సంజన చెప్పింది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. ఇక తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరగుతుందో చూడాలి.


