Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 9 షురూ అయ్యింది. కానీ, ఈసారి సీజన్ మాత్రం అనుకున్నంతగా లేదు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ అంటే రచ్చ జరగాల్సిందే. కానీ, ఈసారి మాత్రం ఉహించినంతగా జరగలేదు. ఇక బుజ్జిగాడు బ్యూటీ సంజన మాత్రం హౌస్మేట్స్ అందరితో గొడవలు పెట్టుకుంటుంది. హౌస్ మేట్స్ కే కాకుండా, చిరాకు పుట్టిస్తోంది. షాంపు బాటిల్ కోసమే పెద్ద రచ్చ చేసింది. దీంతో ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్‌బాస్ సీజన్ 9 మొదటి రోజు నుంచే గొడవలతో స్టార్ట్ అయ్యింది. ఇక ఫస్డ్ వీక్ నామినేషన్స్ మాత్రం అంతగా హిటెక్కించేలా జరగలేదు. ఆమె నాతో మాట్లాడలేదు. తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు. ఇక మొదటి రోజు నుంచే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ అందరికీ విసుగు తెప్పిస్తూ అడియన్స్ దృష్టిలో పడుతుంది. దీంతో అందరూ ఆమె నామినేట్ చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి సంజన చేసిన వింత వాదనలు అందరికీ చిరాకు తెప్పించాయి. ముఖ్యంగా సంజన దెబ్బకు ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది.
షాంపూ కోసం గొడవ..
బాత్‌రూంలో షాంపూ, కండీషనర్ పెట్టే విషయంలో ఆశా షైనీ, సంజనా మధ్య విపరీతమైన గొడవ జరిగింది. షాంపూ, కండీషన్.. బయటపెట్టుకోండి అంటూ ఫ్లోరా ఫైర్ అయ్యింది. నావే.. ప్రతిసారి బయటకు తీయాలా.. ఒక సెట్ అక్కడ ఉండనివ్వండి అంటూ వితండ వాదనం చేసిం సంజన. దీంతో విసుగొచ్చిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా.. బాత్‌రూం క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా.. ? అని నిలదీసేసరికి సంజన ఫైర్ అయ్యింది. మ్యానర్స్ లేదు.. అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టేసింది. దీంతో ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఫుటేజ్ కోసమే సంజనా ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో సంజనా మరింత ఫైర్ అయ్యింది. ఏమన్నావ్.. ఫుటేజ్ కోసమా.. నా ముందు వేలు చూపించి మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇచ్చింది. చీప్ అంటూ మాట్లాడింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ దగ్గర శ్రీజను చూపిస్తూ అది సైకో.. దాన్ని చూస్తేనే చిరాకు అంటూ చెప్పుకొచ్చింది.
Read Also: Bigg Boss: తొలివారం నామినేషన్స్‌లో 9 మంది.. సామాన్యుల నుంచి పడాల, భరణి సేఫ్..!
నామినేషన్స్..
ఆ తర్వాత టెనెంట్స్ లో మీలో ఒకర్ని మీరే నామినేట్ చేసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. పోటీదారులు ఇద్దరు టన్నెల్స్ లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి. సుత్తి అందుకున్నవారు నామినేట్ చేస్తారు . ఇందులో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది. దీంతో ఆమెను మెడికల్ రూంకు పిలిచి తలకు కట్టు కట్టారు. ఇకపోతే, తనూజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. మిగతా నామినేషన్స్ మంగళవారం ఎపిసోడ్ లో కొనసాగనున్నాయి. అయితే, లీకుల ప్రకారం ఈ వారం తొమ్మిది మంది నామినేట్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు, మొత్తంగా తొలివారంలో నామినేట్ అయిన కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే..
1. సంజనా గల్రానీ
2. రీతూ చౌదరి
3. ఫ్లోరా షైనీ
4. శ్రష్ఠివర్మ
5. ఇమ్మానుయేల్
6. తనూజ
7. రాము రాథోడ్
8. సుమన్ శెట్టి
9. డిమోన్ పవన్
Read Also: Vice President: సంఘ్ నేత నుంచి.. ఉపరాష్ట్రపతి దాకా.. రాధాకృష్ణన్ ప్రస్తానమిదే..!


