Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Captain: బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా.. అధ్యక్షా.. సుమన్ అనే నేను..!

Bigg Boss Captain: బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా.. అధ్యక్షా.. సుమన్ అనే నేను..!

Bigg Boss Captain: బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారు. ఇదే విషయాన్ని చెప్పి బిగ్‌బాస్ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. నిన్న జరిగిన టాస్కు తర్వాత మొత్తం ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వారిని మూడు జంటలుగా డివైడ్ చేసి ఈరోజు కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. సుమన్ శెట్టి-గౌరవ్, అయేషా-మాధురి, రమ్య-సాయి జంటలుగా ఈ టాస్క్ ఆడారు. ఇప్పుడు కెప్టెన్ అవ్వడానికి పాల్గొనాల్సిన టాస్క్ ‘విడిపించు గెలిపించు’.. ప్రతి జంటలోనూ ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న సమాధి లోపల బ్లాక్ అయి ఉంటారు.. జంటలోని మరో సభ్యులు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లి అక్కడ తన పార్టనర్ ఉన్న సమాధిని సరైన కోడ్ ఎంటర్ చేసి విడుదల చేయాలి.. అని బిగ్‌బాస్ చెప్పాడు.

- Advertisement -

Read Also: Bigg Boss Telugu 9: మహరాణి మాధురి రూల్స్.. సంజనా 2.0గా రమ్య?

సుమన్- గౌరవ్..

దీంతో సుమన్, మాధురి, రమ్య సమాధుల్లో పడుకున్నారు. ఇక వీటికి లాక్ చేసేసి ప్లేయర్ల చేతిలో వాకీ టాకీ పెట్టారు. దీంతో వాళ్లు తమ పార్టనర్‌కి సంకేతాలు ఇవ్వొచ్చు. ఇక సమాధి డోర్ క్లోజ్ అవ్వగానే మాధురి తెగ టెన్షన్ పడింది. అయేషా రెస్పాండ్ అవ్వు అయేషా.. అంటూ అరుస్తుంటే వింటున్నా వింటున్నా.. అని అయేషా కోడ్ కోసం పరుగులు పెట్టింది.  సుమన్ శెట్టి కూడా గౌరవ్ ప్లీజ్ త్వరగా రా అంటూ టెన్షన్ పడ్డాడు. రమ్య అయితే ఇది ఇది ఒరేయ్ ఇదేరా.. అంటూ సాయిని తిట్టేసింది కూడా. ఇక ఈ టాస్కులో ముందుగా సమాధి డోర్ తెరిచి సుమన్ శెట్టి-గౌరవ్ గెలిచారు. కొద్దిలో ఓడిపోయినందుకు అయేషా తనని తానే చెంప మీద కొట్టుకుంటూ బాధపడింది. నా కళ్ల వల్ల పోయింది ఇమ్మూ నాకు కనబడలేదు.. అంటూ అయేషా బాధపడుతుంటే ఎందుకు అలా చేస్తున్నావ్.. అంటూ మిగిలిన వాళ్లు ఓదార్చారు. మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకుంది.

Read Also: Bigg Boss 9 Telugu: మరో వివాదంలో బిగ్ బాస్.. బ్యాన్ చేయాలంటూ కేసు.. ఆ ఇద్దరివల్లేనా?

కెప్టెన్లు ఇద్దరు ఎవరంటే?

అయితే ఈ టాస్కులో గెలిచిన సుమన్ శెట్టి-గౌరవ్‌లని కెప్టెన్లుగా ప్రటిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో నిఖిల్ నాయర్ తన కంటెండర్‌షిప్ పవర్ ఉపయోగించుకున్నాడట. దీంతో సుమన్-గౌరవ్‌లలో ఒకరితో పోటీపడాలిని బిగ్‌బాస్ చెప్పాడు. తాను స్ట్రాంగ్ క్యాండెట్‌తోనే పోటీ పడతానని గౌరవ్‌తో టాస్క్ ఆడాడట నిఖిల్. ఈ టాస్కులో గౌరవ్ గెలవడంతో తనతో పాటు సుమన్ శెట్టిని కూడా బిగ్‌బాస్ కెప్టెన్లుగా ప్రకటించినట్లు సమాచారం. ఇక కెప్టెన్ అయిన తర్వాత సుమన్ శెట్టి ఫుల్ హుషారుగా గెంతులేసి అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అధ్యక్షా.. సుమన్ అనే నేను.. నీతిగా, నిజాయతీగా ఉంటానని హామీ ఇస్తున్నా అంటూ సుమన్ శెట్టి చెప్పగానే ఇమ్మూ సహా కొంతమంది సుమన్‌ని భుజాల మీద ఎక్కించుకొని జేజేలు పలికారు. దీనికి సంబంధించిన లీకులు బయటపడ్డాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad