Bigg Boss Elimination: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం ప్రియ ఎలిమినేట్ అయింది. మొత్తం ఆరుగురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరి నుంచి చివరిగా డేంజన్‌లో పవన్ కళ్యాణ్, ప్రియ నిలిచారు. ఈ ఇద్దరిలో తక్కువ ఓటింగ్ పడటంతో ప్రియ ఎలిమినేట్ అయింది. అయితే, మొత్తంగా ఆరుగురు డేంజర్ జోన్ లో ఉండగా.. ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరికి డేంజర్ జోన్‌లో ప్రియ, పవన్ కళ్యాణ్ నిలిచారు. వీరిని యక్టివిటీ ఏరియాకి పిలిచి ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టరు హోస్ట్ నాగార్జున. దసరా కావడంతో సింహం బొమ్మని వీళ్ల మధ్యలో పెట్టి.. ఆ సింహం ఎవరివైపు చూసి గర్జిస్తుందో వాళ్లు సేఫ్.. అవతలి వారు ఎలిమినేట్ అని నాగ్ చెప్పారు. అయితే ఈ ప్రాసెస్ మొదలుకాగానే కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడు. అయితే ప్రియ ఎలిమినేషన్ కంటే ముందే కళ్యాణ్ ఓదార్పు యాత్ర మొదలుపెట్టేశాడు. యాక్టివిటీ ఏరియాలో ప్రియ ఎలిమినేట్ కాగానే వెళ్లి హత్తుకొని అసలు వదల్లేదు కళ్యాణ్.
Read Also: Bigg Boss Promo: తెరపైకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. కన్నీరు పెట్టుకున్న డీమాన్
రాము రాథోడ్ టాప్ లో..
అయితే, ఆన్ లైన్ ఓటింగ్ పరంగా ప్రస్తుతం రాము రాథోడ్ టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాలు త్రుటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న ఫ్లోరా షైనీ ఇప్పుడు ఏకంగా రెండో స్థానంలో ఉండడం గమనార్హం. ఇక కాంట్రవర్సీ క్వీన్ రీతూ చౌదరి మూడో స్థానంలో ఉండగా మాస్క్ మ్యాన్ హరీశ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఐదు, ఆరు స్థానాల్లో పవన్ కల్యాణ్, ప్రియ ఉన్నారు. అంటే ప్రస్తుతం కల్యాణ్, ప్రియ డేంజర్ జోన్ లో మిగిలారు. మరీ ముఖ్యంగా ప్రియ ఈ వీక్ లో బయటకు వెళ్లింది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయ్యింది. ఈ సీజన్ ప్రారంభంలో కామనర్ కోటాలో అడుగు పెట్టిన ప్రియ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే అనవసరంగా సెలబ్రిటీలతో గొడవకు దిగడం, యాటిట్యూడ్ చూపిస్తూ అనవరసరంగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ఇక గతవారం సుమన్ శెట్టితో గొడవ ప్రియకు మరింత మైనస్ గా మారింది. అది ఓటింగ్ లోనూ ప్రతికూల ప్రభావం చూపించింది.


