Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss 9: టాప్-5 కంటెస్టెంట్లు వీళ్లే.. వారిద్దరి మధ్యే కప్పు పోరు

Bigg Boss 9: టాప్-5 కంటెస్టెంట్లు వీళ్లే.. వారిద్దరి మధ్యే కప్పు పోరు

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైంది. సెలబ్రిటీలు, కామనర్స్ అంటూ మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. మధ్యలో మరో ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ లోకి వచ్చారు. సంజన ఓసారి సీక్రెట్ రూంలోకి వెళ్లి వచ్చింది. అలాగే ఈ తొమ్మిది వారాల్లో దాదాపు 11 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. భరణి లాంటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక, ఈ సీజన్ తుది దశకు వచ్చినట్లే. ప్రస్తుతం,ఇమ్మాన్యూయెల్‌, తనూజ, కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, రీతూ చౌదరీ, సుమన్‌ శెట్టి, గౌరవ్‌, నిఖిల్‌, దివ్య నికితా, భరణి, సంజనా ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ షో పదో వారంలోకి అడుగు పెట్టింది. అంటే ఈ రియాలిటీ షో దాదాపు తుది దశకు చేరుకున్నట్లే. మహా అంటే ఈ షో సుమారు 5 లేక 6 వారాలు కొనసాగనుంది. దీంతో ఈ సారి టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరు? టైటిల్ ఎవరు గెలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

- Advertisement -

Read Also: BB Nominations: నామినేషన్స్ లో రచ్చ.. ఆరుగురు నామినేట్..?

హౌస్ మేట్స్ గురించి..

తాజాగా తొమ్మిదో వారంలో ఎలిమినేట్ అయిన శ్రీనివాస సాయి కూడా హౌస్‌మేట్స్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ట్రోఫీ రేస్‌లో బలమైన పోటీదారులుగా తనూజ, ఇమ్మాన్యుయేల్‌ను పేర్కొన్నాడు. అలాగే డీమాన్ పవన్, సుమన్ శెట్టి కూడా గట్టి పోటీదారులేనన్నాడు. అంతేకాకుండా, తనూజను రాజమాతగా పేర్కొని ఆమెకు ఉన్న హైప్ గురించి పరోక్షంగానే చెప్పుకొచ్చాడు. ఇక ప్రేక్షకుల ఓటింగ్, టాస్కుల్లో ప్రదర్శనలను బట్టి చూస్తే తనూజ, సంజన, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్ లు కచ్చితంగా టాప్ 5లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

Read Also: Sanju Samson: దరిద్రం అంటే నీదే భయ్యా…కెప్టెన్‌ పోస్ట్‌ దక్కించుకోలేని శాంసన్‌!

సుమన్ శెట్టి గురించి..

అలాగే సుమన్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన నిజాయితీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మిస్టర్ పర్ఫెక్ట్ గా ఆయన పేరుతెచ్చుకున్నాడు. ఎలాంటి పిచ్చి గొడవలకు దిగకుండా మంచి పేరుని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లోకి వెళ్లారంటే కచ్చితంగా పేరు పోగొట్టుకుంటారని పేరుంది. కానీ, దానికి భిన్నంగా ఆయన మంచి పేరుని, క్రేజ్ ని తెచ్చుకున్నారు. ఈ లెక్కన ఆయన కూడా టాప్ 5లో ఉంటాడని టాక్ నడుస్తోంది. ఇక, రీతూ చౌదరి టాప్-5లో ఉంటారని కూడా కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే టైటిల్ రేసు మాత్రం తనూజ, ఇమ్మాన్యుయేల్ మధ్యనే ఉంటుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. ఎలిమినేషన్లు, సీక్రెట్ టాస్కులతో టాప్- 5 లిస్ట్ లోనూ మార్పులు జరిగే ఛాన్స్ కన్పిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad