Ramya Moksha: అలేఖ్య చిట్టి పికిల్స్ అని పచ్చళ్ల వ్యాపారంతో రమ్య మోక్ష సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, చాలా రోజులు పికిల్స్ పాప హౌస్ లో ఉంటుందని అందరూ భావించారు. అయితే, అది జరగలేదు. తన నోటి దురుసు, దుందుడుకు స్వభావంతో అనవసరంగా నెగెటివిటీని మూటకట్టుకుంది. ముఖ్యంగా టాప్ కంటెస్టంట్లు తనూజ, కళ్యాణ్ లను టార్గెట్ చేసి పర్సనల్ అటాక్స్ చేసింది. తనూజను ఫేక్ పిల్ల అని తిట్టిన రమ్య కల్యాణ్ ను అమ్మాయిల పిచ్చోడు అని ముద్ర వేసేసింది. దీనిపై నాగార్జున కూడా సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత వీకెండ్ ఎపిసోడ్ లో హైపర్ ఆది కూడా రమ్యకు కొన్ని మంచి టిప్స్ ఇచ్చాడు. కానీ వీటిని కూడా నెగెటివ్ గా తీసుకుంది. ఈ కారణంగానే ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటినప్పటికీ ఆడియెన్స్ ఓటింగ్ లో వెనకపడిపోయింది పచ్చళ్ల పాప. నామినేషన్స్ లో నిలిచి రెండో వారమే ఎలిమినేట్ అయ్యింది.
Read Also: Bigg Boss 9: పానీపూరి దొంగతనం చేసి తిన్న సుమన్ శెట్టి, తనూజ .. బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఫన్
సోషల్ మీడియాలో ట్రోలింగ్
అయితే, బిగ్ బాస్ కు రాక ముందు సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీని మూటగట్టుకుంది రమ్య మోక్ష. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు తన ఆటతీరుతో దానిని మార్చేసుకుంటుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. పైగా మరిన్ని విమర్శలను, నెగెటివిటీని మూట గట్టుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే, దీనిపైనా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆమె అక్కా చెల్లెళ్లతో హౌస్ లోకి వెళ్లడానికి ముందు చేసిన వీడియో వైరల్ గా మారింది. స్టేజ్ పైకి ఎవరెవరు రావాలి. ఎలా చేయాలి. ఏం చేయాలని అనే దానిపై జరిగిన డిస్కర్షన్ గురించి మాట్లాడుకున్న రీల్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. రెండు వారాలే హౌస్ లో ఉన్నదానిపైన ట్రోలింగ్ జరిగింది. ఆ మాత్రం దానికి హౌస్ లోకి వెళ్లడం ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు. డ్రాప్ చేసి అక్కడే ఉండి పికప్ చేసుకుంటే బాగుండేది అని విమర్శిస్తున్నారు. ఇప్పుడు తీసుకురావడానికి కూడా మీరే వెళ్లండి అని నెటిజన్లు అంటున్నారు. బయట నెగెటివిటీ ఉన్నా లోపల మంచి ఆటిట్యూడ్ తో ఉన్నావని మండిపడుతున్నారు. రమ్య దేనికి బిగ్ బాస్ కు వచ్చిందో.. దేనికి ఎలిమినేట్ అయ్యిందో తెలీదు అని మరొకరు అన్నారు.
View this post on Instagram


