Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డులు వచ్చాక రచ్చ రంబోలా జరుగుతోంది. ముఖ్యంగా దివ్వెల మాధురిని చూస్తేనే చాలు ఆడియన్స్ కస్సమంటున్నారు. ఆమె సున్నితంగా చెప్పకుండా ఆర్డర్లు జారీ చేస్తుంది. అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో.. దువ్వాడ బంగ్లా అనుకుంటుందో తెలియట్లేదు. క్వీన్ లా ఫీలైపోతుంది. నా ఆరోగ్యం పాడైపోతోందిలైట్లు ఆఫ్ అయ్యాక మాట్లాడకూడదు, గుసగుసలు వినిపించకూడదు. పొద్దున సాంగ్ కంటే ముందే లేచినవారు మౌనంగా ఉండాలి.. అంటూ రూల్స్ పెట్టింది మాధురి. ఇదేమైనా బిగ్‌బాస్ రూలా? అని రీతూ అనడంతో మాధురి గయ్యిమని లేచింది. నా ఆరోగ్యం పోతుంది.. నా రూల్స్ ఒప్పుకోకపోతే పోండి అని అరిచేసింది. ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎవరూ పడరు… నచ్చకపోతే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది.
Read Also: Bigg Boss Bharani: ఆడోళ్ల చేతిలో దెబ్బలు పడాల్సింది.. అలా బతికిపోయా
కడుపు నిండా ఆరగించిన రమ్య
ఇక, రమ్య ఆర్డర్ చేసిన వంటకాలన్నీ పంపించాడు బిగ్‌బాస్. సుమన్‌తో కలిసి కడుపునిండా ఆరగించింది. ఈ క్రమంలో సంజనాతో దొంగతనాలు చేస్తా.. సంజన 2.0 అవుతా అంది. మరోవైపు భరణి.. రీతూతో క్లోజ్‌గా ఉండటం నచ్చలేదని దివ్యతో అన్నాడు. నువ్వు టాస్కులో ఎంతో సాయం చేశావ్.. అయినా సంబంధం లేకుండా తర్వాతి రోజే నిన్ను నామినేట్ చేస్తే ఏం అనుకోవాలి? ఇంత జరిగాక ఆమె పక్కన కూర్చుని జోకులేసి నవ్వుకుంటుంటే ఎలా తీసుకోవాలి? అని ప్రశ్నించాడు. రీతూతోనే కాదు, వేరేవాళ్లతోనూ మాట్లాడానని దివ్య అంది. ఏడ్చేసిన భరణి- దివ్యచెప్పాలనిపించింది చెప్పాను. నిన్ను కంట్రోల్ చేసేంత సీన్ ఏం లేదు. వింటావా? వినవా? నీ ఇష్టం అని భరణి అన్నాడు. దీంతో.. ఎందుకిలా అపార్థం చేసుకుంటున్నారంటూ దివ్య చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆమెనలా చూసి భరణి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. మీరు ఏడవకండంటూ దివ్య భరణిని ఓదార్చింది.
Read Also: Bigg Boss 9 Telugu: మరో వివాదంలో బిగ్ బాస్.. బ్యాన్ చేయాలంటూ కేసు.. ఆ ఇద్దరివల్లేనా?
బిగ్ బాస్ చరిత్రలో..
ఇక, ఆ తర్వాత బిగ్‌బాస్ వైల్డ్‌కార్డులను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు. వీరు మిగతావారి నుంచి ఐదుగురిని సెలక్ట్ చేసుకుని గేమ్ ఆడాలన్నాడు. అందులో గెలిచి కంటెండర్‌షిప్ కాపాడుకోవాలన్నారు. అలా సంజన, భరణి, దివ్య, తనూజ, సుమన్ ను ఎంపిక చేసుకుని బాల్ టాస్క్ ఆడారు. ఇందులో రమ్య, గౌరవ్, శ్రీనివాస్.. చాలా బాగా ఆడారు. ఇందులో వైల్డ్ కార్డులతో పాటు చివరి వరకు సుమన్ నిలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. సూపర్ పవర్ ఉన్న నిఖిల్ కూడా కెప్టెన్సీ రేసులో నిలబడ్డాడు. లైవ్‌లో కెప్టెన్సీ టాస్క్ ఈపాటికే అయిపోయింది. గౌరవ్, సుమన్ గెలిచి కొత్త కెప్టెన్లుగా నిలిచారు. నీతి, నిజాయితీగా ఉంటానంటూ సుమన్ ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. తనను తక్కువ అంచనా వేసినవాళ్లకు తన సత్తా ఏంటో చూపించాడు. ఒకేసారి ఇద్దరు కెప్టెన్లు ఉండటమనేది తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం.


