Friday, February 13, 2026
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Divya: ఊహించిందే అయ్యింది.. హౌస్ నుంచి ఆమె ఔట్

Bigg Boss Divya: ఊహించిందే అయ్యింది.. హౌస్ నుంచి ఆమె ఔట్

Bigg Boss Elimination:  బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. హౌస్ లో గొడవలు జరిగాయంటే అది మామూలు విషయమే. కానీ, అది కాస్తా పర్సనల్ అటాక్ వరకు వెళ్లింది. రీతూపై సంజన చేసిన కామెంట్స్ హౌస్మేట్స్, ఇటు అడియన్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఇక ఇదే గొడవ పై గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున. శనివారం నాటి ఎపిసోడ్ లో సంజనపై హౌస్మేట్స్ మొత్తం రివర్స్ కాగా.. సారీ చెప్పాలంటూ ఆర్డర్ వేశారు నాగార్జున. బయటకు అయినా వెళ్లిపోతాను కానీ సారీ చెప్పను అంటూ నాగార్జునకే షాకిచ్చింది. తాను చూసిందే చెప్పానని.. కావాలని ఏం చెప్పలేదంటూ తన సైడ్ వాధించింది సంజన. అయితే, ఆమెను బ్లాక్ మెయిల్ చేసి మరీ మొత్తానికి ఆమె చేత బలవంతంగా సారీ చెప్పించారు నాగార్జున. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు హౌస్ లో ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. అయితే, ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

- Advertisement -

Read Also: IND vs SA: కోహ్లీ అద్భుత సెంచరీ.. సౌతాఫ్రికా లక్ష్యం 350

ఆరుగురు డేంజర్ జోన్ లో..

ఈ వారం ఆరుగురు.. దివ్య నిఖిత, సంజన, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, భరణి డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ముందు నుంచి అతి తక్కువ ఓటింగ్ ఉంది మాత్రం దివ్యకే. అయితే, గతవారం ఎలిమినేట్ కావాల్సిన దివ్య… నో ఎలిమినేషన్ రావడంతో సేఫ్ అయ్యింది. కానీ ఈసారి మాత్రం ఓటింగ్ తక్కువ రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దివ్య ఎలిమినేషన్ ముందు నుంచి ఊహించినదే. అలాగే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్ వినిపించింది. కానీ అలాంటిదేమి లేదని.. కేవలం సింగిల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు దివ్య బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: Thanuja: పాట పాడిన తనూజ.. కాఫీ షాప్ అబ్బాయ్ కోసమేనా?

దివ్య ఎలిమినేషన్ కి కారణం..

దివ్య ఎలిమినేషన్ కు కారణం.. భరణితో బాండింగ్స్.. తనూజతో గొడవలు. ఆమె భరణి విషయంలో కావాలనే తనూజను డామినేట్ చేస్తోంది. తనూజపై ఊ అంటే గొడవకు దిగుతోంది. అంతేకాకుండా, దివ్య భరణిపై పెత్తనం చెలాయించడం చాలా మందికి నచ్చలేదు. అలాగే భరణి, తనూజతో మాట్లాడితే చాలు గొవడ పెట్టుకుంది. దీంతో ఆమె పై నెగిటివిటీ పెరిగింది. దివ్య డిమాండింగ్ వల్లే భరణి ఆట తగ్గిపోయిందని నెటిజన్స్ అభిప్రాయం. దీంతో దివ్య బయటకు పంపిస్తే బెటర్ అంటూ మిగతా కంటెస్టెంట్లకు ఓటింగ్ గుద్దిపడేశారు. ఈవారం దివ్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం. అయితే, ఆమె ఎలిమినేషన్ తో భరణి ఆట మారుతుందని ఆయన ఫ్యాన్స్ చాలా మంది వాదిస్తున్నారు. ఇకనైనా, భరణి ఆట మారుతుందో చూడాలి. మరోవైపు, త్వరలోనే బిగ్ బాస్ ఫైనల్స్ జరగనున్నాయి. తనూజ, కళ్యాణ్, ఇమ్మూ మధ్యే కప్పు గురించి పోరు జరగనున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News