Bigg Boss Elimination: బిగ్ బాస్ 9 తెలుగు సెకండ్ వీక్ హీటెక్కిస్తోంది. ఇక ఈ సీజన్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యేందుకు టైమ్ దగ్గరపడుతోంది. ఈ సారి నామినేషన్లలో ఏడుగురు ఉన్నారు. ఓటింగ్ తారుమారు అవుతోంది. కాగా.. ఎవరు ఎలిమినేట్ అతారనేది సస్పెన్స్ గా కొనసాగుతోంది. ఓటింగ్ తారుమారు అవుతుండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది. మరి బిగ్ బాస్ 9 తెలుగు సెకండ్ వీక్ లో నామినేషన్లలో ఎవరున్నారు? వాళ్లకు ఓటింగ్ పడిందో? ఎవరికి తక్కువ ఓట్లు పడుతున్నాయో చూసేద్దాం.
Read Also: Bigg Boss New Captain: ఆమె కోరింది.. అతడు చేశాడు.. ప్రేమ జంట పంట పండింది.. కెప్టెన్ గా డీమాన్ పవన్
నామినేషన్స్ లో ఏడుగురు
బిగ్ బాస్ 9 నామినేషన్లు బిగ్ బాస్ 9 తెలుగు సెకండ్ వీక్ నామినేషన్లలో ఏడుగురు ఉన్నారు. ఇందులో ముగ్గురు సెలబ్రిటీలు, నలుగురు కామనర్లు. సెలబ్రిటీల్లో సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైనీ నామినేషన్లలో ఉన్నారు. కామనర్స్ నుంచి డీమాన్ పవన్, హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియ శెట్టి నామినేషన్లో ఉన్నారు. అయితే, ప్రస్తుతం డేంజర్ జోన్లో ముగ్గురు కామనర్లు ఉన్నారు. మరి వీళ్లలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
తారుమారవుతున్న ఓటింగ్..
బిగ్ బాస్ 9 ఓటింగ్ బిగ్ బాస్ 9 తెలుగు రెండో వారం ఓటింగ్ అనూహ్యంగా మారిపోతుంది. నామినేషన్లలో ఉన్న వాళ్ల స్థానాలు కిందకు, మీదకు మారుతున్నాయి. ఇవాళ (సెప్టెంబర్ 19) ఉదయం 10 గంటల వరకు చూసుకుంటే ఓటింగ్ ప్రకారం ముగ్గురు కామనర్లు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ల మధ్య ఓటింగ్ డిఫరెన్స్ కూడా పెద్దగా లేదు. సెకండ్ వీక్ ఓటింగ్ లో కామనర్స్ కు ప్రమాదం పొంచి ఉంది. హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియ శెట్టి డేంజర్ జోన్లో ఉన్నారు. ఇవాళ ఉదయం వరకు చూసుకుంటే హరీష్ 6.88 శాతం, మనీష్ 6.68 శాతం, ప్రియ 6.53 శాతం ఓటింగ్ తో వరుసగా లాస్ట్ మూడు ప్లేస్ ల్లో ఉన్నారు. వీళ్ల మధ్య పెద్దగా డిఫరెన్స్ కూడా లేదు.
టాప్ లో సెలబ్రెటీలు..
టాప్ లో కమెడియన్ ఇక సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టికి ఓట్లు బాగా పడుతున్నాయి. ఆయన 41.77 శాతం ఓట్లతో టాప్ లో కొనసాగుతున్నారు. నంబర్ వన్ పొజిషన్ లోనే ఉన్నారు. ఇక సీరియల్ నటుడు భరణి 23.88 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మూడో ప్లేస్ లో కామనర్ డీమాన్ పవన్ 7.57 శాతం, నాలుగో స్థానంలో ఫ్లోరా సైనీ 6.88 శాతంతో ఉన్నారు.
ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో సెకండ్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. ఓట్ల పర్సంటేజీ పరంగా చూసుకుంటే హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి లాస్ట్ మూడు ప్లేస్ ల్లో ఉన్నారు. వీళ్లలో ఒకరు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. గత వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ ని వయించేశారు. హరీశ్ మాస్క్ రివీల్ చేశారు. దీంతో హౌస్ లో ఉండనూ అంటూ హరీష్ నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇక కామనర్స్ నే ఇష్టం వచ్చినట్లు మాటలన్న మర్యాద మనీష్ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఏం లేదు. ప్రియ కూడా అంతే. మరి వీళ్లలో నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.


